image_print

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం!

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం! -కొండేపూడి నిర్మల డా.కె.గీత ఇటీవల వెలువరించిన అపరాజిత స్త్రీవాద కవితా సంకలనంలో 93మంది కవయిత్రులు వెలువరించిన 168 కవితలు ఉన్నాయి. 85 నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీల కవితలు- స్త్రీవాద కవితలు మధ్య వున్న చిన్నసరిహద్దు గీత స్పష్టంగా ఎవరికీ అర్ధంకావడం లేదు. అపరాజితతో బాటూ, ఇంత క్రితం వచ్చిన గురిచూసి పాడే పాట , నీలిమేఘాలు సంకలన సందర్భాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ గతం ప్రస్తావించకపోతే […]

Continue Reading

సంతకం కవయిత్రుల కవిసమ్మేళనం

సంతకం కవయిత్రుల కవిసమ్మేళనం -కొండేపూడి నిర్మల అక్షరాలు మనవే అయినపుడు  వాస్తవాలు వేరేగా ఎందుకు వుండాలి  ? ఈనెల 29 వ తేదీన సంతకం సాహిత్య వేదిక కవయిత్రుల సమ్మేళనం నిర్వహించింది . 22 మ౦ది కవయిత్రులు కవిత్వ౦ చదివారు. నాలుగైదుమ౦ది సీనియర్స్ వున్నప్పటికీ ఎక్కువశాతం యువ కవయిత్రులు వుండటం ఇందులో విశేషం .    రేణుకా అయోల ప్రారంభ పరిచయ వాక్యాలతో నడిచిన ఈ సభ లో  తూముచర్ల రాజారాం సమీక్ష చేశారు.  అతిధులుగా విచ్చేసిన పుట్టు మచ్చ బ్రాండు కవి ఖాదర్ మొహియుద్దీన్ […]

Continue Reading

గోడంత అద్దంబు గుండెలకు వెలుగు (కొండేపూడి నిర్మల కవిత)

https://youtu.be/PcmdB2_3KBM “గోడంత అద్దంబు గుండెలకు వెలుగు”  -కొండేపూడి నిర్మల అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా? ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦ అదేపనిగానో , అప్పుడప్పుడో అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా నావరకు నేను దాని లోతుల్లోకి దిగిన ప్రతిసారీ ఒక కొత్త రూపం తెచ్చుకోవాలనే అనుకుంటాను ఆమాత్రం ఏమార్చకపోతె అద్దం గొప్పదనం ఇంకేముంది అందాన్ని సానపెట్టడానికి తీసుకున్న ఒక్కొక్క సౌందర్య లేపనంతొ వంద మయసభలు కట్టుకోవచ్చు అద్దంతో నా […]

Continue Reading

చీకటి పెట్టెలు (కవిత)

చీకటి పెట్టెలు -కొండేపూడి నిర్మల “అమ్మానాన్నెప్పుడొస్తారు ?” ఎడబిడ్డ అడిగాడు వస్తారు బాబూ , తెల్లారి బ౦డికి వస్తారు చండి బిడ్డను ఎత్తుకుని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆమె అన్నది దూరంగా జెర్రిపోతులాంటి రైలు చీకటి పెట్టెల్ని ఈడ్చుకుంటూ పరిగెడుతోంది “అమ్మా నాన్న మిఠాయి తెస్తారా ?” తెస్తారు బాబూ పెద్ద పెట్టెనిండా తెస్తారు ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిన బుగ్గమీద ముద్దు పెట్టి చెప్పింది తెల్లారుతూనే ఒక పెట్టెను సాయంపడుతూ కొంతమంది మనుషులొచ్చారు “అమ్మా ఈ […]

Continue Reading

రిస్క్ తీసుకుంటాను(కవిత)

రిస్క్ తీసుకుంటాను(కవిత) -కొండేపూడి నిర్మల మొదటి పెగ్గు.. మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి చెబుతుంది సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు గోడమీద తగ కావిలించుకుని దిగిన హనీమూన్ ఫొటో వింత చూస్తూ వుంటుంది. సత్యనారాయణ వ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు […]

Continue Reading

మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం

శ్రీమతి కె. వరలక్ష్మి అజో-విభో కందాళం విశిష్ట సాహితీ మూర్తి జీవిత కాల సాధన పురస్కారం జనవరి 6, 2020న బాపట్లలో అందుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం- మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం  -కొండేపూడి నిర్మల ప్రధానంగా నేను కె. వరలక్ష్మి కధలకు  అభిమాన పాఠకురాలిని. ఆమె వేళ్ళు కధలోనే ఎక్కువ దూరం వెళ్ళాయి. వరలక్ష్మి నిర్లక్ష్యం చేసిన ఇంకో మొక్క ఆమె కవిత్వం . సరే ప్రక్రియ ఏమయినా ఒక […]

Continue Reading

దేహమంటే మనిషి కాదా

దేహమంటే మనిషి కాదా – కొండేపూడి నిర్మల దేశమ౦తా మనది కాకపోవచ్చు దేహమయినా  మనది కాకుండా ఎలా వుంటుంది ? దగ్ధమయిన దేహం ఇంక ఎవరి కన్నీరూ తుడవదు, కోపగించుకోదు కానీ నిన్నటి దాకా  చెప్పిన పాఠాలు ఎక్కడికి పోతాయి ఏళ్లతరబడి అల్లుకున్న స్నేహాలెక్కడిపోతాయి సగం చదివి మడత పెట్టిన పేజీకి అవతల కధ ఎటు పారిపోతుంది ఇంత జవ౦, జీవం, పునరుజ్జీవ౦ వున్న మనిషి  నుంచి దేహాన్ని  విడదీసి మంట పెట్టడం  ఏమి న్యాయం..? కాలధర్మం […]

Continue Reading