డా. రాయదుర్గం విజయలక్ష్మి మదరాసు విశ్వవిద్యాలయం నుండి, “ఆధునికాంధ్ర కవిత్వముపై బౌద్ధ మత ప్రభావము” అన్న అంశం లో పి.హెచ్ డి., పట్టాను పొందారు. అవిభక్త ఆంధ్రరాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం లో’ సింగరేణి కాలరీస్ డిగ్రీ కళాశాల’లో అధ్యాపకురాలిగా పనిచేసి, ప్రస్తుతం మదరాసులో స్థిరపడినారు. . సిరి కోన వాక్స్థలి సభ్యులు. కథలు, కవితలు, వ్యాసాలు, భారతి మొదలైన పత్రికలలో ప్రచురణను పొందాయి.. వీరి పరోశోధక గ్రంథం, ‘ఆధునికాంధ్ర కవిత్వం పై బౌద్ధమత ప్రభావం’ , ‘పొరుగుతెలుగు బతుకులు’ ‘అన్న రెండు పుస్తకాలను ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘానికి కార్యదర్శిగా ఉంటూ, ముప్పై ఆరు కథలతో, “మదరాసుబ్రదుకులు” అన్న కథల సంపుటిని,, భువనచంద్రగారు, నాగసూరి వేణుగోపాల్ గార్లసాహసంపాదకత్వంతో తీసుకు వచ్చారు. ‘శ్రీ వెంకటాద్రి స్వామి కీర్తనలను తమిళం నుండి ఆంధ్రీకరించారు.