పేరు..............తమిరిశ జానకి
పుట్టినఊరు....మచిలీపట్నం, క్రిష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ . ( అమ్మమ్మగారి ఊరు )
తండ్రిగారి ఊరు---నర్సాపురం , పశ్చిమగోదావరిజిల్లా .
పుట్టినతేదీ-------26- 10- 1946
విద్య-----------బి.ఏ.
రచనలు చేయడం మొదలుపెట్టినది 1960 లో హైస్కూల్లో చదువుతున్నప్పటినుండీ. హైస్కూల్ మేగజైన్ ,కళాశాల మేగజైన్ , చిన్నచిన్న స్థానిక పత్రికలలోనూ రచనలు చేశాను. అప్పుడు నాపేరు యర్రమిల్లి జానకి. పూర్తిపేరుతో రాయకుండా వై.జె. అనే పేరుతో రాసేదాన్ని. కళాశాలలో చదివేటప్పుడు మంజువాణి అనే పత్రికవారు అన్ని ఊళ్ళల్లోని కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులకు నిర్వహించిన కధలపోటీలో నా కధకు బహుమతి వచ్చింది. యువ, జ్యోతి మాసపత్రికలలోనూ, ఆంధ్రపత్రిక, చుక్కాని పక్షపత్రికలోనూ,కృష్ణాపత్రికలోనూ, ఎమ్.ఎస్.కో వారి పుస్తకప్రపంచంలోనూ వై.జె. అనే పేరుతోనూ, వై.జానకి అనేపేరుతోనూ కధలు రాసేదాన్ని. 1965లో వివాహమయ్యాక తమిరిశ జానకి పేరుతో అన్ని పత్రికలలోనూ కధలు , కవితలు , వ్యాసాలు, నవలలు రాస్తూనే ఉన్నాను.
“తప్పొప్పుల జీవితం” -తమిరిశ జానకి ఎవరికైనా సరే సొంత ఊరిపేరు తలుచుకుంటే చాలు సంతోషంగా అనిపిస్తుంది కదా కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటూ చాలా ఆనందంగా తన అభిప్రాయం చెప్పాడు సమీర్. రాజు తప్ప మిగిలిన ఇద్దరూ సుబ్బారావు చక్రధర్ ఔనంటే ఔనని ఒప్పేసుకున్నారు. రాజు […]
నిజానిజాలు – తమిరిశ జానకి నీకొడుకు అలా చేసిఉండకూడదు సింహాచలం కిళ్ళీ నముల్తూ వీరభద్రయ్య అన్నమాటకి ఖంగుతిని నీళ్ళునముల్తూ తల దించుకున్నాడు సింహాచలం. ఒకళ్ళు కిళ్ళీ మరొకళ్ళు నీళ్ళు నమిలేస్తుంటే కొడుకు మీది కోపంతో వాడిప్పుడు ఇక్కడుంటే వాడినే నమిలేసేదేమో అన్నట్టుగా పళ్ళు కొరుకుతూ చూసింది సింహాచలం భార్య తిరపతమ్మ. ఇద్దరూ యజమాని వీరభద్రయ్యకి ఎదురుగా చేతులుకట్టుకుని నిలబడిఉన్నారు. మా ఇంటి కాంపౌండ్ లోనే ఔట్ హౌస్ లో మిమ్మల్ని ఉండనిస్తూ మీ మంచీచెడ్డా మీ […]
సోమరాజు సుశీల స్మృతిలో – ఇల్లేరమ్మకు నివాళి -తమిరిశ జానకి స్నేహసుగంధ పరిమళం….నిష్కల్మష హృదయం…..నవనీత సమాన మానసం చతురోక్తుల పలుకుల సంబరం కలగలిసి రూపుదిద్దుకున్న స్వరూపమే మాఇల్లేరమ్మ శ్రీమతి సోమరాజు సుశీలగారు. 1945లో తూర్పుగోదావరిజిల్లా సిద్ధాంతంలో జన్మంచిన సుశీలగారికి 1966 లో వివాహమయినది. అప్పటికి ఆవిడ ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ మేరీస్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆతర్వాత శ్రీవారితో కలిసి పూనేలో ఉన్నప్పుడు అక్కడి నేషనల్ కెమికల్ లేబొరేటరీలో సైంటిస్ట్ గా చేశారు. డాక్టరేట్ […]