image_print

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ-2

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ-2 -వసుధారాణి  ఉత్తరం అన్ని హంగులతో పూర్తి చేసి మా అక్కయ్యా వాళ్ళింటి పక్కన పెట్టిన తపాలా డబ్బాలో వేసేసాం.ఇక మేము అనుకున్న వారికి అది చేరటం , మేము అందులో  పొందుపరిచిన విషయం వారి మీద చూపబోయే ప్రభావం గురించి ఊహల్లోకి వెళ్లిపోయాం. ఇంతలోకి మా కిషోర్ బాబు అసలు విషయం చెప్పాడు.వాడికి ఓ అలవాటు ఉంది ఏది వద్దు అంటే అది చేయటం.ఆ విషయంలో వాడి మాట వాడే […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ -వసుధారాణి  ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత ,ఉత్సాహం ఎక్కువగా ఉండే బాల్యావస్థలో చక్కటి మార్గదర్శనం చేయటానికి మాకు దొరికిన మార్గదర్శి మా కృష్ణానందం బావగారు.మా రెండవ అక్కయ్యా,బావగార్లయిన సావిత్రి,కృష్ణానందం (ఇద్దరూ జువాలజీ లెక్చరర్లు)వాళ్ళ పిల్లలు చిన్నారి,కిషోర్ తో పాటు నన్ను కూడా వారింట పుట్టిన పిల్లలా చూసేవాళ్ళు.మా బావగారు పిల్లల పెంపకం గురించి మా కాలం కంటే చాలా ముందు ఆలోచనలు చేసి మా ముగ్గురి పెంపకం కొంచెం ప్రయోగాత్మకం […]

Continue Reading
Posted On :

పౌలస్త్యహృదయం దాశరథి విజయం – 2

 పౌలస్త్యహృదయం దాశరథి విజయం-2 -వసుధారాణి  హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’ తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి సమీక్ష రెండవ భాగం పౌలస్త్య రావణుని హృదయం నరజాతులన్నింటినీ ఏకీకృతం చేసి వారందని రక్ష సంస్కృతిలో వైదిక ధర్మం ఆచరించేలా చేయటం అన్న యోచనకు బద్ధమై ఉంది.అనుక్షణం అతని నోటినుంచి వెలువడే పదం ‘వయం రక్షామః’ . శూర్పణక భర్త విద్యుజ్జిహ్వుని రక్ష సంస్కృతిలోకి రాలేదు అన్న కారణంగా అతన్ని చంపివేయటం,చెల్లెల్లు ఎంత ప్రియమైనప్పటికీ వయం రక్షామః […]

Continue Reading
Posted On :

పౌలస్త్యహృదయం దాశరథి విజయం

 పౌలస్త్యహృదయం దాశరథి విజయం -వసుధారాణి  హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’ తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి ఈ పుస్తకాన్ని చదవటం గొప్ప అనుభవం.సమీక్ష చేయపూనటం గొప్ప సాహసం.బాపు అందించిన బొమ్మ అద్భుతం. హిందీ మూల రచయిత ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి గారి పరిశోధన గురించి ఎంత చెప్పినా సరిపోని విధంగా వంశాలు,భౌగోళిక అంశాలు,ఆనాటి సాంఘిక,రాజకీయ జీవిత వర్ణనలు ఈ పుస్తకాన్ని గొప్ప పుస్తకంగా మలిచాయి. శాస్త్రి గారి పరిశోధన సారాంశం,ఆయన […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్

ఇట్లు మీ వసుధారాణి నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్ -వసుధారాణి  కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుందో , నా చేతికి క్షమించాలి కాలికి సైకిల్ ఇచ్చాక మా ఇంట్లో వాళ్ళకి తెలిసొచ్చింది.”అందుగలడిందులేడను సందేహము వలదు” లాగా మా బుల్లి టౌన్ లో ఎక్కడ చూసినా నా నీలి సైకిల్ తో,హిప్పీ జుత్తుతో,బోలెడు నిర్లక్ష్యం తో నేనే కనిపిస్తూ వుండేదాన్ని. ఒక బజారులో పని ఉంటే మరి రెండు బజార్లు అదనంగా తిరిగి వచ్చేదాన్ని.నాకు […]

Continue Reading
Posted On :

సమకాలీన కొంకణీ కథానికలు

సమకాలీన కొంకణీ కథానికలు -వసుధారాణి సంపాదకులు:పుండలీక్ నారాయణ్ నాయక్. తెలుగు అనువాదం: శిష్టా జగన్నాథరావు. పుస్తకం పట్టుకున్నది మొదలు చివరివరకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన పుస్తకం.మొదటి కారణం భాష,రెండవ కారణం భాష పట్ల వారికి గల ప్రేమ ,చిత్తశుద్ధి,మూడవ ముఖ్యమైన కారణం 12వ శతాబ్దం మొదటినుంచి 18 శతాబ్దం చివరి వరకూ వివిధ కారణాల వల్ల కకావికలైన కొంకణీ భాష తిరిగి వికాసం కోసం చేసిన ప్రయత్నం.ఇక ముఖ్యమైన నాలుగవ కారణం కథానికలలోని వైవిధ్యం .తక్కువ ప్రాంతం ,తక్కువ […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- గవాక్షం

ఇట్లు మీ వసుధారాణి      గవాక్షం -వసుధారాణి  గులాబీ నగరం అదేనండి మన జయపూర్ వెళ్ళినప్పుడు హవామహల్  ముందు నుంచుని కిందనుంచి అన్ని కిటికీలతో నిండిన ఆ కళాత్మకమైన గోడని చూసినప్పుడు,ఒక ఆనందం,ఒక విషాదం ఒకేసారి తోచాయి.ఆనందం మన కళాకారుల ప్రతిభకి, విషాదం ఆ రాణీవాసంలోని రాణులందరి పట్ల.విషాదం అని ఎందుకు అంటున్నాను అంటే కేవలం కిటికీ నుంచి కనపడేదే వారి బయటి ప్రపంచం.బయట వైపునుంచి వారి కిటికీలు ఎంత అందంగా ఉన్నా ,సన్నని కన్నాలే […]

Continue Reading
Posted On :

దివాణం సేరీ వేట

దివాణం సేరీ వేట -వసుధారాణి రూపెనగుంట్ల  కథా సంకలనం :  దివాణం సేరీ వేట  రచయిత:  శ్రీ పూసపాటి కృష్ణంరాజు (1928-1994) రాశితో పనిలేని వాసి కథలు, వాడి కథలు ,1960 లో అచ్చయిన తొలి కథ “ దివాణం సేరీవేట” నుంచి మొదలై 15,16 కథలకు మించని ఈ కథలు ఇప్పటికీ వేడి వేడి కథలు.కథలో వాక్యనిర్మాణం సామాన్యం ,అతిసాధారణం అయినా ఓ గగురుపాటుకు ,ఓ విభ్రమానికి,ఓ విస్మయానికి గురిచేసే కథలు. ఓ కులానికో,ఓ సామాజిక […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- మా వడ్లపురి

ఇట్లు మీ వసుధారాణి మా వడ్లపురి -వసుధారాణి  గండికోటను ఇండియన్ గ్రాండ్ క్యాన్యన్.పెన్నా నది పలకలు పలకలుగా ఉన్న రాతి నేలని కొంచెం కొంచెంగా ఒరిపిడికి గురిచేసి, అరగదీసి గండి కొట్టింది. మూడు వైపులా పెన్నానది సహజ సిద్ధం గా ఏర్పరచిన గండి రక్షణ కందకంలా చేసుకుని ఆ కొండపై కోట కట్టారు . గండికోటలో అలనాటి వైభవానికి గుర్తుగా ఎన్ని ఉన్నప్పటికీ, నన్ను అక్కడ ఆకర్షించిన కట్టడం ధాన్యాగారం .ఆరునెలల పాటు నిరవధికంగా యుద్ధం జరిగినా […]

Continue Reading
Posted On :

సంధ్యారాగం, వజ్రపు ముక్కు పుడక : రెండు నవలికలు

సంధ్యారాగం,వజ్రపు ముక్కు పుడక : రెండు నవలికలు -వసుధారాణి  పంజాబీ మూలం: దలీప్ కౌర్ తివానా. తెలుగు అనువాదం: జె. చెన్నయ్య. నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా. మొదటి ముద్రణ: 2010. భారత సమాజంలో వివాహ బంధాన్ని చిత్రించిన నవలిక ‘సంధ్యారాగం’ .వివాహిత అయిన ఓ సీనియర్ అధికారిణి అనుకోని పరిస్థితులలో ఎదుర్కొన్న జీవితాను భావాలు.స్వేచ్చా జీవిత భావన చుట్టూ అల్లుకున్న ఆలోచనలతో ,అనుభవంలోకి తెచ్చుకోలేని భావాలతో నలిగిపోయిన స్త్రీ మనోవేదన ఈ నవలిక. అతి స్వార్ధపరుడైన భర్త,అతి […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఆ బావి

ఇట్లు మీ వసుధారాణి ఆ బావి -వసుధారాణి  అదాలజ్ (రాణి గారి బావి) గుజరాత్ రాష్ట్ర రాజధాని  అహ్మదాబాద్ లో ఉంది.అది చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ మాకు దాని నిర్మాణకౌశలం,నిర్మించడానికి వెనుక ఉన్నగాథ చెపుతూ ఉన్నాడు. మూడు నాలుగు అంతస్థులుగా అందమైన శిల్ప కళతో, పెద్ద పెద్ద మెట్లతో  నిజంగానే చూడచక్కని దిగుడుబావి.మొత్తం తిరిగి చూసిన తరువాత గైడుకు డబ్బులు ఇచ్చి పంపివేసాక  పై మెట్టుమీద కాసేపు కూర్చుందామా అనిపించి, కూర్చుండి పోయాము.స్తంభాల మధ్య నుంచి […]

Continue Reading
Posted On :

కెంజాయ కుసుమం

కెంజాయ కుసుమం -వసుధారాణి రూపెనగుంట్ల కన్నడ మూలం : నా. డిసౌజా తెలుగు అనువాదం: ఉమాదేవి,ఎన్ స్వాతి మాసపత్రికకు అనుబంధంగా ఫిబ్రవరి 1987 లో వచ్చిన 107 పేజీల బుజ్జి నవల. నా.డిసౌజా:  నలభై పైగా నవలలు రచించారు. నాటికలు, కథాసంకలనాలు కలిపి తొంభై పైగా ప్రచురించారు. “ముళుగడెయ ఊరిగె బందవరు” అనే పిల్లల నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ద్వీప, కాడినబెంకి అనే నవలలు చలనచిత్రాలుగా రూపొంది, రాష్ట్రీయ బహుమతులు పొందాయి. కాడినబెంకి […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఆ మందిరం

ఇట్లు మీ వసుధారాణి  ఆ మందిరం -వసుధారాణి  కరకరా ఆకలివేస్తుండగా బడి నుంచి మధ్యాన్నం 12 గంటలప్పుడు హిండాలియం స్కూల్ బాక్స్ చేత్తో పట్టుకునే ఓపిక కూడా లేక ఇంటిదగ్గరికి వచ్చేసరికి నెత్తిమీద పెట్టుకుని నడిచి వచ్చేవాళ్ళం.బడికి వెళ్లి వచ్చిన దుస్తులతో అన్నం తినకూడదు కనుక కాళ్ళూ చేతులు కడుక్కుని  వేరేవి మార్చుకుని చక చకా వంటింట్లోకి చేరే సరికి ప్రతిరోజూ ఒకటే దృశ్యం. వండిన పదార్ధాలు అన్నీ ఘుమ ఘుమ లాడుతూ దేవుడి మందిరం ముందు […]

Continue Reading
Posted On :

తెలుగు సాహిత్యంలో మహిళలు (మహిళా దినోత్సవ ప్రత్యేక వ్యాసం)

తెలుగు సాహిత్యంలో మహిళలు -వసుధారాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు పాఠకులను ప్రభావితం చేసిన మహిళా కవయిత్రులు, రచయిత్రుల గురించి పాఠకులకు తెలిపే ప్రయత్నమే  ఈ వ్యాసం. ప్రాచీన సాహిత్యంతొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క 1423-1503 మధ్యకాలంలో జీవించిన తాళ్ళపాక అన్నమాచార్యుని పెద్ద భార్య ఈవిడ పేరు తిరుమలాంబ.తిమ్మక్క ‘సుభద్రా కల్యాణం’అనే కావ్యాన్ని మంజరీ ద్విపదలో రచించింది.ప్రాస నియమం మాత్రమే ఉండి యతి నియమం లేని దేశీయమైన ఛందస్సు మంజరీ ద్విపద.ఇందులో1170 మంజరీ ద్విపదలున్నాయి.ఈమె కుమారుడు తాళ్ళపాక […]

Continue Reading
Posted On :

కొన్ని సమయాలలో కొందరు మనుషులు& గంగ ఎక్కడికెళుతోంది ?

కొన్ని సమయాలలో కొందరు మనుషులు& గంగ ఎక్కడికెళుతోంది ? -వసుధారాణి తమిళమూలం: జయకాంతన్   కొన్ని సమయాలలో కొందరు మనుషులు.   గంగ ఎక్కడికెళుతోంది ? తెలుగు అనువాదం : కొన్ని సమయాలలో కొందరు మనుషులు.         – మాలతీ చందూర్. గంగ ఎక్కడికెళుతోంది?          – జిల్లేళ్ళ బాలాజీ. ‘కొన్ని సమయాలలో కొందరు మనుషులు’ నవల తమిళంలో ఈ నవల 1975 లో వచ్చింది .మాలతీ చందూర్ 1981 […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి-అన్నింటిలోనూ పెద్ద-3

ఇట్లు మీ వసుధారాణి.  అన్నింటిలోనూ పెద్ద-3 -వసుధారాణి  కిన్నెరసాని అందాలను అలా వెన్నెలలో చూసిన చల్లని మనసులతో భద్రాచలం చేరాము.అదే మొదటి సారి నేను భద్రాచలం చూడటం.ఉదయాన్నే లేవగానే మేము ఉన్న చిన్న కొండమీద కాటేజీ కిటికీ నుంచి చూస్తే గోదావరి.”అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి” కీర్తన గుర్తుకు వచ్చింది.సూర్యోదయం ,గోదావరి, గుడిగంటలు ఏదో తెలియని భక్తిభావం ఇంకా రామయ్యని చూడకుండానే.మా బావగారూ వాళ్ళు బద్దకంగా మేము కొంచెం నిదానంగా వస్తాము మీరు తయారయి గుడికి […]

Continue Reading
Posted On :

చోముని డప్పు

చోముని డప్పు కన్నడ మూలం : శివరామ కారంత తెలుగు అనువాదం: శర్వాణి. -వసుధారాణి నేలదీ నీటిదీ ఏనాటి బంధమో కాని ,అదే వానచుక్క ,అదే మట్టి వాసన వేల ఏళ్లుగా ఉండివుంటుంది .కొన్ని రచనలు ,కొంత మంది రచయితలు కూడా అలానే మట్టిని ,నీటిని ,బతుకుని అంటుకుని ,పెనవేసుకుని ఎన్ని ఏళ్ళయినా పురాతనమైన మట్టి పాత్రల్లాగా ఆకర్షిస్తూంటారు .జ్ఞానపీఠ్ అవార్డు పొందిన కన్నడ రచయిత శివరామ కారంత అలాంటివారు .అలాగే అనువాదకురాలు  “శర్వాణి “గారు కూడా […]

Continue Reading
Posted On :

తపస్సు (కవిత)

 తపస్సు -వసుధారాణి  ఒక తపస్సులా గమనించు తూనీగల రెక్కల చప్పుడు కూడా వినిపిస్తుంది. కొండ యుగయుగాల కథలు చెపుతుంది. జలపాతం చిలిపితనం నేర్పిస్తుంది. నది ఆగిపోని జీవనగమనం చూపిస్తుంది. ఆకాశం ఉన్నదేమిటో,లేనిదేమిటో ఒక్క క్షణంలో మార్చేస్తుంది. ముని అవ్వటం అంటే ఇదేనేమో జనజీవనంలో నిలబడి కూడా. ఏమయినా సముద్రుడు నాకు బోలెడు కబుర్లు చెపుతాడు. నది వచ్చి నాలో చేరేటప్పుడు ఆ మంచినీరు నేనేమి చేసుకోనూ? వెనక్కి తోసే ప్రయత్నం చేస్తాను. ఐనా నది సంగమించే తీరుతుంది. […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి-అన్నింటిలోనూ పెద్ద-2

 ఇట్లు మీ వసుధారాణి.   అన్నింటిలోనూ పెద్ద -2 -వసుధారాణి  నాకప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయేమో మా పెద్దక్కయ్యా వాళ్ళింటికి నిర్మల్ వెళ్ళాను.చిన్నపిల్లవి కాదంటూ బోలెడు విషయాలు చెప్పింది.ఉదయాన్నే ఇంట్లో హాల్లోని సోఫాలు,నిర్మల్ బొమ్మలు,నిర్మల్ పెయింటింగ్స్ తుడవటంతో నా దినచర్య మొదలు. తర్వాత టీ (అపుడు మాకు ఇంట్లో కాఫీ అలవాటు ఉండేది.కానీ నిర్మల్ లో పాలు పల్చగా వుంటాయని అక్కయ్య టీ కాచేది),తర్వాత ఉదయం పూట ఉపాహారం నువ్వే తయారు చేయి అని ఏమి చెయ్యాలో కూడా […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి-అన్నింటిలోనూ పెద్ద

ఇట్లు మీ వసుధా రాణి   అన్నింటిలోనూ  పెద్ద  -వసుధారాణి  విజయలక్ష్మీ సరస్వతి అనే మా పెద్దక్కయ్య మా అమ్మకు పదహారవ ఏట పుట్టింది .అక్కయ్య పుట్టినప్పుడు దేచవరం అనే చిన్న పల్లెటూరిలో ఉండేవారు .మొత్తం ఊరు ఊరంతా అక్కయ్యను చూడడానికి వచ్చారట .వచ్చిన వారంతా పిల్లను చూడడం ,మాడున ఓ చుక్క ఆముదం అద్దడం ,నోట్లో ఓ చుక్క ఆముదం వేయడం ఇలా ఊరిలో జనం అంతా చేసేసరికి పిల్లకు విరోచనాలు పట్టుకున్నాయట .చిన్నప్పుడు నవ్వు వచ్చినా, […]

Continue Reading
Posted On :

త్రిపుర కథలు

త్రిపుర కథలు పుస్తకం:- త్రిపుర కథలు రచయిత:- త్రిపుర -వసుధా రాణి  పదే పదే నవలల మీదకు వెళ్లే నా మనసును కథల్లో ఓ కిక్కు ఉంటుంది చదువు అంటూ కథల మీదకి కాస్త మళ్ళేలా చేసిన వారు వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు.ఐతే అన్నప్రాశనరోజే ఆవకాయలా త్రిపుర గారి కథ ‘భగవంతం కోసం’ ఆవిడే స్వయంగా చదివి వినిపించి కథని ఇలా చదువుకోవాలి,రచయిత రచనలోని గొప్పతనాన్ని ఇలా ఆస్వాదించాలి,అప్పుడు రచయిత అనుభవాలు కూడా మనవి అవుతాయి అని […]

Continue Reading
Posted On :

ఇదీ నా కవిత్వం(కవిత)

 ఇదీ  నా కవిత్వం – వసుధారాణి   నీపై ప్రేమ ఎలాగో ఈ కవిత్వమూ అంతేలా ఉంది . నా ప్రమేయం లేకుండా నాలో నిండిపోయి అక్షరాల్లో ఒలికిపోతోంది.   కవి అంటే  ఓ వాన చినుకు,  ఓ మబ్బుతునక మండేసూర్యగోళం చల్లని శశికిరణం కన్నీటికెరటం ఉవ్వెత్తు ఉద్వేగం పేదవాడికోపం పిల్లలకేరింత కన్నతల్లి లాలిత్యం గడ్డిపూవు,గంగిగోవు ఒకటేమిటి  కానిదేమిటి కవి అంటే విశ్వరూపం వేయిసూర్య  ప్రభాతం.   గుండెకింద చెమ్మ, కంటిలోన తడి ఇవి లేకుండా  కవిత్వం […]

Continue Reading
Posted On :

పూనాచ్చి- ఒక మేకపిల్ల కథ

  పూనాచ్చి- ఒక మేకపిల్ల కథ తమిళ మూలం :పెరుమాళ్ మురుగన్. తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్. -వసుధారాణి  ముందుమాటతో మొదలు పెడితే పెరుమాళ్ మురుగన్ రాసుకున్న ముందుమాటే ‘నిద్రాణస్థితి’ కొంచెం వింతగా అనిపించింది. మొదటి పేరానే ఇలా ఉంది, “ బయటకి చెప్పని కథలు ఎంతకాలమని నిద్రాణంగా ఉండిపోతాయి?  మనుషులగురించి రాయాలంటే భయం.దేవుళ్ళగురించి రాయాలంటే విపరీతమైన భయం.రాక్షషులగురించి రాయవచ్చు.రాక్షసుల జీవితం గురించి కొంచెం పరిచయం ఉంది.ఇప్పటికీ కాస్త ప్రయత్నించవచ్చు.సరే,జంతువుల గురించి రాద్దాం.” పుస్తకం అట్టమీద ‘భారతదేశంలో వివాదాస్పదుడైన […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఆనందాంబరం మా నాన్న-2

ఇట్లు మీ వసుధారాణి.  ఆనందాంబరం మా నాన్న-2  -వసుధారాణి   మా తాతగారు అలా అర్ధాంతరంగా చనిపోవటం ,మా నాయనమ్మ అయిదుగురు కొడుకులతో   విజయవాడలో ఉండటం విన్నప్పుడు నాకు కుంతీదేవి తన కొడుకులతో లక్కయింటి నుంచి బకాసురుడి  ఊరు వెళ్లటం గుర్తుకు వచ్చింది . తమ బాబాయి కొడుకు అయిన రూపెనగుంట్ల పిచ్చయ్య గారి కుటుంబం ఇలా అయిందని తెలుసుకుని మా పెద్ద అమ్మమ్మ విజయవాడకు తమ్ముడి భార్యని అంటే మా నాయనమ్మని పలకరించటానికి వచ్చిందట.అప్పుడు […]

Continue Reading
Posted On :

జలసూర్య

జలసూర్య             రచయిత్రి : అరవింద -వసుధారాణి ‘అవతలి గట్టు’ నవల ద్వారా ఎంతో ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి A S మణి (అరవింద వీరి కలం పేరు) రచించిన మరో నవల ‘జలసూర్య’.జూలై 1978 లో అచ్చయిన ఈ నవల ఓ స్టడీ మెటీరియల్ లాగా  విడి విడి జిరాక్స్ కాగితాల రూపంలో నా చేతికి వచ్చింది. సాహిత్యంలో నిధులు ఇలాంటి రూపంలోనే ఉంటాయని గత అనుభవాలు కొన్ని నేర్పాయి.అందుకని అన్ని కాగితలని చక్కగా అమర్చుకుని చదవటం మొదలు […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఆనందాంబరం మా నాన్న

ఇట్లు  మీ వసుధా రాణి  ఆనందాంబరం మా నాన్న -వసుధారాణి  సహనసముద్రం మా అమ్మ గురించి ముందు కథలలో చెప్పుకున్నాం కదా.ఇక మా నాన్న గురించి కొన్ని కథలు చెప్పుకుందాం. మా నాన్న కూతుర్ని అని ఒక విషయంలో చాలా సగర్వంగా చెప్పుకుంటాను నేను, అదేమిటంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన చాలా సంతోషంగా ఉండేవాడు.నాకూ అదే వచ్చింది.మా నాన్న గురించి చెప్పుకోవాలంటే మొదట మా పితామహుల దగ్గరి నుంచి రావాలి.మా తాతగారి పేరు రూపెనగుంట్ల పిచ్చయ్య గారు […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- సహన సముద్రం మా అమ్మ-3వ భాగం

ఇట్లు  మీ వసుధా రాణి  సహన సముద్రం మా అమ్మ-3వ భాగం -వసుధారాణి        పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోయి గత రెండు నెలలుగా ధారావాహికగా రాస్తున్న అమ్మ కథ ముగించాలని అనుకుటుంటేనే ఏదో బాధ.మన అందరి ఆరంభం కదా అమ్మ ముగింపు ఏమిటి అని మనసులో ఓ మూల కలుక్కుమంటున్ననొప్పి.కానీ తప్పదు మొదలు పెట్టింది ముగించాలి కదా.నిజానికి నా జీవితంలో అమ్మ ముగిసిపోలేదు,ఎక్కడికీ వెళ్ళలేదు.ఎందరో రూపంలో వస్తూనే ఉంది నా తల ఆప్యాయంగా నిమురుతూనే ఉంది. […]

Continue Reading
Posted On :

పుస్తక సమీక్ష – మైనా

   మైనా     -వసుధారాణి     రచయిత :-  శీలావీర్రాజు 1969 లో’ మైనా’ నవలకు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం  లభించింది. వెలుగు రేఖలు కాంతిపూలు కరుణించని దేవత ఆయన ఇతర నవలలు. పది కథా సంపుటాలను, తొమ్మిది కవిత్వ సంకలనాలను రచించారు. కాలానికి ఇటూ అటూ (వ్యాస సంపుటి) శిల్పరేఖ (లేపాక్షి రేఖా చిత్రాలు) శీలావీర్రాజు చిత్రకార్తీయం (వర్ణ చిత్రాల ఆల్బమ్). ఒక వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అయివుండటం అరుదైన విషయం.సాహిత్యం,చిత్రకళ ఈ రెండిటిలోనూ సమానంగా […]

Continue Reading
Posted On :

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2

 భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2 -వసుధారాణి రూపెనగుంట్ల భారతీయ నవలాదర్శనంలో తరువాతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాల నెలవైన ఒరిస్సా , రాష్ట్ర భాష ఒరియా.ఈ భాష ,ఈ నేలా రెండూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓవైపు  స్పృశిస్తూ ఉన్నవే.వీరలక్ష్మీదేవి గారు ఈ భాషలో మొదట ఎన్నుకున్న నవల ఉపేంద్ర కిషోర్ దాస్ రచించిన ‘ మరాహవా చాంద్ ‘ తెలుగులో రాలిపోయిన చందమామ.పేరులోనే విషాదం ,ఉదాత్తత నింపుకున్న నవల. సత్యభామ అనే యువతి తెలిసో , తెలియకో […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- సహన సముద్రం మా అమ్మ

ఇట్లు  మీ వసుధా రాణి  సహన సముద్రం మా అమ్మ -వసుధారాణి        పెళ్లిళ్లు పేరంటాలు అంటే పిల్లలకు మాచెడ్డసరదా కదా .నాకు ఇప్పటికీ అంతే అనుకోండి.అలా నా పదవ ఏట అనుకుంటా గుంటూరులో ఓ పెళ్లికి పిలుపు వచ్చింది.సాధారణంగా పెళ్లికి వెళ్లాల్సి వచ్చినపుడు ఇంటిలో అందరి కంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు. వాళ్ళకి పెద్దగా బడులు , తరగతులు పోయేది ఏమీ ఉండదని.అలా మా అమ్మతో పెళ్లికి చంకన పెట్టుకెళ్లిన పిల్లిలా నేనూ తయారు […]

Continue Reading
Posted On :

పుస్తక సమీక్ష -భారతీయ నవలాదర్శనం

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం) -వసుధారాణి        నేను చెపుతున్న ఈ మాట కాస్తంత ముతకగా ,మోటుగా అనిపించినా  ఆవిడ నెత్తికి ఎత్తుకున్న పని మాత్రం మాత్రం సామాన్యమైనది కాదు. పాఠకులకు అరవై భారతీయ నవలలని దర్శనం చేయించడం. ఇది సంపూర్ణ భారతదేశ పుణ్యక్షేత్రాల యాత్రాదర్శనం లాంటిదే. ఈ పనిని తలపెట్టిన వీర వనిత డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ,పుస్తకము “ భారతీయ నవలాదర్శనం”.  60 విశిష్ట భారతీయనవలల పరిచయసంపుటి.  ఇదీ వరస […]

Continue Reading
Posted On :

ఇట్లు మీ వసుధారాణి

 ఇట్లు మీ వసుధారాణి  భాగవతంలో శ్రీకృష్ణుడికి, నాకూ ఓ దగ్గరి పోలిక ఉంది. నన్ను నేను తక్కువగా అనుకున్నప్పుడల్లా ఆ పోలిక గుర్తుచేసుకుని నా ఆత్మవిశ్వాసం పెంపొందించు కుంటుంటాను. అదేమిటంటే శ్రీమతి రూపెనగుంట్ల లక్ష్మీరాధమ్మ, శ్రీ రామదాసు దంపతులకు మనం అంటే వసుధారాణి అనబడే నేను అష్టమసంతానంగా జన్మించటం. మరి అల్లరి కిష్టయ్య కూడా అష్టమ గర్భమేగా. అందువలన చేత నేనుకూడా అల్లరి చేసేయాలి కామోసు అనేసుకుని, జీవితంలో అతి ముఖ్యమైన బాల్యాన్ని అందమైన, ఆహ్లాదకరమైన అల్లరితో […]

Continue Reading
Posted On :