చిత్రలిపి- గుండెనీరయిన కథ !

చిత్రలిపి గుండెనీరయిన కథ ! -మన్నెం శారద అప్పుడసలు గుండె ఒకటుంటుంది తెలియనే తెలియదు బోసినవ్వుల అమాయకత్వం నుండి ఆటపాటల అల్లరిదాకా ‘చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తిండి గోలేతప్ప  గుండె గో;ల  తెలియదు గాక  తెలియదు  దశలుమారి ,దిశలు తిరిగి వయసు భుజాలపై  రంగు రంగు  రెక్కలు మొలిచి లోకమొక నందనవనంగా కనులకు భ్రాంతి గొలిపి ……..పిదప గుండెజాడ తెలిపింది  ఎర్రని వర్ణపు Continue Reading

Posted On :

చిత్రలిపి- “ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని !

చిత్రలిపి ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని ! -మన్నెం శారద ఒకానొక  కాఠిన్యపు  కిరణస్పర్శకు తాళలేక  తల్లడిల్లి ..కరిగి నీరయి న మంచు శిఖరం  ఒకటి ఏరయి సెలయేరయి వాగయి ,వంకయి శాపవిమోచనమొందిన  గౌతమిలా తన ప్రియ సాగర సమాగం కోసం   మహానదిగా మారి  దక్షిణ దిశకు  పరుగులు తీసింది ! పట్టలేని  పరవశం అది ! ఎన్నో Continue Reading

Posted On :

చిత్రలిపి- నా జ్ఞాపకాల పొత్తంలో నెమలీకవు నీవు!

చిత్రలిపి నా జ్ఞాపకాల  పొత్తంలో  నెమలీకవు నీవు! -మన్నెం శారద ఒకానొక ప్రయాణంలో మనం కలిసేవుంటాం మాటామాటా కలిపే వుంటాం  ఆకుపచ్చని చేలని చూడాలని నేను ఆత్రపడినప్పుడు కిటికీ దగ్గర సీటుని నువ్వు నాకు ఇచ్ఛే వుంటావ్  నేను తెచ్చిన పూరీలు , నువ్వు తెచ్చిన పల్లీలు ఒకరికొకరం పంచుకుని తినే ఉంటాం  అనుకోని వానజల్లు  నా Continue Reading

Posted On :

చిత్రలిపి- అమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు ???

చిత్రలిపి అమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు ??? -మన్నెం శారద అవునమ్మా …నువ్వు ఆనాడే ఎందుకు చెప్పలేదూ ….తాతయ్య వడిలో కూర్చుంటే తప్పని బాబాయి భుజాలమీద ఊరేగవద్దని ఆటో అంకులు ని ముట్టుకోనివ్వద్దని పక్కింటికి పోవద్దని దోస్తుల్ని నమ్మొద్దని వెన్నెల్లో ఆడొద్దని చుట్టమిచ్చిన చాకోలెట్  అయినా తినవద్దని …..ఇల్లు దాటొద్దని ! ఎన్నో ఎన్నెన్నో  ప్రతి బంధాల మధ్య  నా బాల్యం Continue Reading

Posted On :

చిత్రలిపి- ఆశల తీరమది

చిత్రలిపి ఆశల తీరమది -మన్నెం శారద గూడు చెదరి  వీడి పోదామనను కున్నప్పుడాచెట్టు కనులు చెదిరే  రంగులతో …మనసు  పొంగే హంగులు  వడలంతా నింపుకుని  వయ్యారంగా ఆగమని ఆకుల కన్నులతో అలవోకగా సైగ చేస్తుంది !  చూరు మీద ఆకులు రాలి ఆకాశం కనిపిస్తున్నప్పుడు  కదలిపోదామిక  అని గాఢంగా  నిట్టూర్చినప్పుడు తారలు కుట్టిన ఆకాశం  కప్పుమీద  దుప్పటిపరచి  తళుకులీనుతూ మురిపిస్తుంది Continue Reading

Posted On :

చిత్రలిపి- అగమ్య గమ్యం !

చిత్రలిపి అగమ్య గమ్యం ! -మన్నెం శారద ఆ అడవిదారిలో  ఎందుకు అడుగులువేసానో  నాకయితే తెలియదు కానీ ……ఇంత పత్రి తెచ్చాను   వినాయక చవితని ! పాములూ తేళ్ళుంటాయి,,,వళ్లు తెలియదా  అంటూనే తీసుకుని  పూజ చేసింది అమ్మ ! మళ్ళీ అటెనడిచాను  మరేదో కావాలని ….బయలంతా  పసుపు పారబోసినట్లు విరబూసిన తంగేడు పూలని చూసి మనసు Continue Reading

Posted On :