వసంత కాలమ్ -5 అతిథి వచ్చి ఆకలంటే
అతిథి వచ్చి ఆకలంటే -వసంతలక్ష్మి అయ్యగారి మాపక్కగుమ్మమే ఓ పేరున్న డయాగ్నోస్టిక్ సెంటరు..నూతనంగా వెలసిన వైద్యపరీక్షాలయం…మనకి గుడి తోసమానం.. గుడ్డిలో మెల్లన్నట్టు …అదో ఆనందం…ముఖ్యంగా తెల్లారుతూనే పరకడుపున చేయించుకోవలసినరక్తపరీక్షలువంటివాటికి చెప్పలేనిదాహాయి! రక్తహీనత,ఎముకసాంద్రత,సంపూర్ణ రుధిర చిత్రం..ఇలా ఓనాలుగు పరీక్షలకి, నాలుగువేలు వారికిచ్చి…స్కూల్ లో లాగా క్యూ క్రమశిక్షణ పాటించి రక్తనమూనా స్వీకర్త వద్దకూర్చుని వారడిగిన హస్తాన్ని వారికే చాచి ఇవ్వడం..పిడికిలిబిగించి,కనులు గట్టిగా మూసుకొని బలిసిన చేయిలో నరందొరకక ఆవిడ నొక్కులకు,సన్నాయినొక్కులకు అసహనంఅసంపూర్ణంగా వ్యక్త పరచడం..పరిపాటి.ఇన్ని పరీక్షలుకనుక హోల్సేల్ గా కాస్త యెక్కువగానే గుంజివుంటారునారక్తం..పైకంలాగే.. ఏం శిక్షణ తీసుకుంటారోగానీ..రక్త సేకరణ ఘడియల్లో మనలను ఏమార్చడం కోసం..ఒక్కొక్కరిదీ ఒక్కోవైనం. నాకు దొరికిన మహిళామణి, ముసుగులో మునిగి పోయి నేత్రద్వయాన్ని మాత్రం ప్రదర్శించుకుంటున్నముసలమానుభామ! ఈ ఘట్టం నాకు త్రైమాసిక పండగే ! నాక్రితం విజిట్ లో కూడా ఆవిడే లాగినట్టు గుర్తు.అందుకనేమో నన్ను హలో..కైసేహై? అని పలకరించింది.నేనూ ఆబీబీ కినా సలాము చెప్పాను. చెయ్యి..ఇయ్యి…మడుచు..ముడుచు..మామూలే..సిరంజి గుచ్చుతూ…మాటల్లో పెట్టింది,అదీ మామూలే.. “జరా వెయిట్ జ్యాదా పుటాన్ కియే క్యా…? అంది. “ హాఁ..బిల్కుల్ .. థేరాయిడ్ ఠీక్ నహీ హై షాయద్”అనేశా. ఇంతలో ఈ నారీ మణి నాడీని నరాలను వెతికి పట్టింది.ఇంకేముంది…మాటలు పెంచి..లోతుగా దించుటే..దృష్టిమరలుస్తూ ఆవిడన్నమాటలు ఉభయతారకంగా తెలుగులోరాస్తానేం..జరిగినది ఉర్దూలోనైనా. నేను మిమ్మల్ని రోజూ మీ బాల్కనీలో వాకింగ్ చేసే టపుడు చూస్తుంటా. చానా సార్లు చెయ్యిఊపి హాయ్ చెప్పినా. మీరు భీనవ్వినార్ . కానీ నేను మీకు తెల్వ కుండచ్చు..బుర్ఖా ఉందికదా. మీ ఇంటి ముంగల రోజూ మామిడి పళ్ళ బండిఉంటదికదా. అక్కడ కొన్కోని మీదగ్రా వచ్చీ తిందామనుకున్నా. అంటూ తలతోక లేకుండా అర్థంపర్థం కాకుండాపరభాషలో పలుకుతూ పోయింది. నాకు సగంఎక్కలేదు..ఒక పక్క పీకేస్తున్నందుకేమో తెలియదు. అయినా నా సహజ శైలిలో పక్కనే కదా,ఎటువంటిఅవసరముదన్నా రండి మాయింటికి. లంచ్కి కూడారావచ్చునన్నానను కుంట..రెండోసారి చూపులు కలసినందుకే. అదీకేవలం చూపులేఅని చెప్పాగా ! బురఖా బీబీ కనక రూపురేఖలు రూల్డౌట్!వెనక బోలెడుమంది క్యూలో వెయిటింగూ. ఐనా యీవిడ ఓచక్కని scribble pad తీసుకుని friends are always better than relatives అనే అర్థమొచ్చేలా ఏదోగొణుగుతూ నా సెల్ నంబర్ తీసుకుంది. నిరభ్యంతరంగా యిచ్చా! రాత్రి తొమ్మిదికి మావారే వెళ్ళి తెచ్చిన రిపోర్టులను ఎంసెట్ రిజల్ట్ లెవెల్లో కిందాపైనా చూసేశాం. సరిగ్గా నోరుతిరగని పేరుగల ఆ బీబీగారు, ఒకేఒక్క రోజు gap లోపదకొండింటివేళ నాకు ఫోను. “నాకు మీ దీ ఫేవర్ కావాలి,మీయింటికి లంచ్కీ వస్తాన్, ఒకటిగంట కొట్టినంకా. Continue Reading