ఆలాపన (కవిత)

ఆలాపన -బండి అనూరాధ నిదానంగా కురిసే ప్రేమని పెనుగాలులు అసలేమీ చెయ్యలేవు. దీపాలు కొండెక్కడం మామూలుకాదు. నానాతంటాలూ పడి ఏదో అనాలని చూస్తారుకానీ కాంతిలో తేలిపోతారు ఎవరివి హృదయాలని వెతకకుఎక్కడ మనుష్యులూ అని తిరుగకువిరిగిపోయిన ముక్కల్లో లెక్కలు చూడకుదూరమైనసూదుల్లాంటిభావాల్లో తలనుదూర్చినిన్ను నువ్వు గుచ్చుకోకుగ్రహించుదారంలేనివి ఆధారాలు కావెప్పుడూ  అయినా పలకరింపుల్లేని ప్రేమల్లో Continue Reading

Posted On :

సమయం (కవిత)

సమయం -బండి అనూరాధ ఎండకి గొంతెండిన మొక్కలకి నీళ్ళిస్తూ సాయంత్రంలో నేను.మొక్కలకి పైగా సాయంత్రంపై వీచే గాలుల్లో గూళ్ళకి చేరుతూ పక్షులు. ముసురుకుంటున్న చీకట్లలో సమయం.రాత్రిని అంటుకుంటున్న చలిగాలులు.బయటకి చూస్తే నలుపు. గుబురుచెట్ల మధ్యన అంధకారం.మొదళ్ళ మౌనం. ఇంకొంచం గడిచిన సమయం.మరింత సాగిన రాత్రి. నడినెత్తిన సగం చంద్రుడు.అరవెన్నెల్లో ఆకాశం. లోపలా Continue Reading

Posted On :

Raw Beauty (కవిత)

Raw Beauty -బండి అనూరాధ ఈ పొద్దూ వానొచ్చినదితనదారిన తాను పోయినదిఎవరి దారిన వాళ్ళు పోవాలిగా ఇక్కడ మిగిలినది చూస్తే- కొంత మట్టీ కొంత ఇసుకాకొన్ని రాళ్ళూ మరికొన్ని మొక్కలూవిరిసిన ఒకే ఒక రోజా పువ్వు పాకుడుపట్టిన పాతగోడ,..తడికి మరింత పచ్చగా మెరుస్తూగాయమంత పచ్చిగా.. గోడకు పాకించిన Continue Reading

Posted On :

మేరీ (కథ)

మేరీ -బండి అనూరాధ ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఉదయం ఎనిమిది అయ్యింది. కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ వరండాలో కూర్చున్నాను. గేట్ తీసుకుని ఒకమ్మాయి వస్తోంది. ఎవరన్నట్లు ఆరాగా చూస్తుంటే, నమస్కారమమ్మా నా పేరు మేరీ అంది. ఏమిటన్నట్లు Continue Reading

Posted On :

నిర్ణయం (తృతీయ ప్రత్యేక సంచిక కథ)

నిర్ణయం (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -బండి అనూరాధ నిద్రపట్టట్లేదు. అశాంతి. ఏవేవో ఆలోచనలు. కొంత ఏడుపవుతుంది. కొంత భయమవుతుంది. లైటేస్తే, హ్మ్ ,..  చీకటి పళ్ళునూరుతుంది. వెలుతురు వెక్కిరిస్తోంది.  హ హ్హ హ్హా. నాకెందుకో నవ్వొస్తూంది. మరింత నవ్వు. ఏడుపునెక్కువ Continue Reading

Posted On :

పరంపర (కవిత)

పరంపర -బండి అనూరాధ మరలిపోయినాయధాస్థితిలో తిరిగి నిన్ను నిలిపే కాలస్ప్రుహ ఏదో వెన్నునంటే ఉంటుందెందుకో. ఆగి చూసుకుంటే-విడిచివచ్చినవేం పెద్ద బాధించవు.అంతర్లీనమై కొంత దుఃఖాన్ని నిక్షిప్తం చేస్తాయ్. అంతే. కొంచం సమయం చిక్కి వెనుకకి ప్రయాణమై చూసుకోలనుకుంటేఒక్క అద్దముంటుంది లోన. అంతే ముందుకుపోయే ఉత్సాహమో చింతనోఏదయితేనేం ఒక కొనసాగింపుకిక్షణాల ముస్తాబుని Continue Reading

Posted On :

మేకప్ (కవిత)

మేకప్ -బండి అనూరాధ మరోసారి గాయాలని పిలుద్దాంరహస్య చల్లగాలితో హృదయాల్ని లాలిద్దాంకాస్త కుదురుకున్నట్లు ధైర్యాన్ని ప్రకటిద్దాంలోలోపల బావురుమనే కరువుని పక్కకిజరుపుదాం రేకులురాలిన గులాబీలకి ముఖాలనంటిద్దాంముళ్ళని తాకిన మనసుల కథలని దాటిద్దాంపచ్చని ఆకుల వెచ్చని శ్వాసన నిదురిద్దాంఅద్దాల్లో నిజాలకు నీడలు కల్పిద్దాం చూసినకొద్దీ ఎముంటుందీ చీకటి Continue Reading

Posted On :

మీను (కథ)

మీను -బండి అనూరాధ శీతాకాలం అంటే నాకు చాలా ఇష్టం. బద్ధకాన్నీ చలినీ పోగొట్టే తెల్లారగట్ట చలి మంటలంటే మహాఇష్టం. ఇప్పుడు ఈ ఖాళీ అప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి రావడంవల్ల కొంత పూడుతోంది. నిజమయిన అమాయకత్వంలో అప్పటి ఆ అల్లరి Continue Reading

Posted On :