Raw Beauty

-బండి అనూరాధ

ఈ పొద్దూ వానొచ్చినది
తనదారిన తాను పోయినది
ఎవరి దారిన వాళ్ళు పోవాలిగా
 
ఇక్కడ మిగిలినది చూస్తే-
 
కొంత మట్టీ కొంత ఇసుకా
కొన్ని రాళ్ళూ మరికొన్ని మొక్కలూ
విరిసిన ఒకే ఒక రోజా పువ్వు
 
పాకుడుపట్టిన పాతగోడ,..
తడికి మరింత పచ్చగా మెరుస్తూ
గాయమంత పచ్చిగా..
 
గోడకు పాకించిన మనీప్లాంట్ ఆకులనుండీ
అప్పుడప్పుడూ
ఒక్కో మిగులు వాన చుక్కా..
 
నా కళ్ళు ఇక విదిలించలేని చినుకులేనా అవి!?
ఎవరో తమ అసలుకి పోయారు.
నొప్పై, ఇదిగో
నేను ఇలాగ నవ్వుతున్నానా!?
 
పట్టిచూడడం అందం.
పట్టించుకోకపోవడం పెను విషాదం.

*****

Please follow and like us:

One thought on “Raw Beauty (కవిత)”

  1. అద్భుతంగా వ్రాశారు.. 👌👌👌 మీ సాహిత్యం చాలా బావుంటుంది.. అనురాధ బండి గారూ…

Leave a Reply

Your email address will not be published.