
Raw Beauty
-బండి అనూరాధ
ఈ పొద్దూ వానొచ్చినదితనదారిన తాను పోయినదిఎవరి దారిన వాళ్ళు పోవాలిగా ఇక్కడ మిగిలినది చూస్తే- కొంత మట్టీ కొంత ఇసుకాకొన్ని రాళ్ళూ మరికొన్ని మొక్కలూవిరిసిన ఒకే ఒక రోజా పువ్వు పాకుడుపట్టిన పాతగోడ,..తడికి మరింత పచ్చగా మెరుస్తూగాయమంత పచ్చిగా.. గోడకు పాకించిన మనీప్లాంట్ ఆకులనుండీఅప్పుడప్పుడూఒక్కో మిగులు వాన చుక్కా.. నా కళ్ళు ఇక విదిలించలేని చినుకులేనా అవి!?ఎవరో తమ అసలుకి పోయారు.నొప్పై, ఇదిగోనేను ఇలాగ నవ్వుతున్నానా!? పట్టిచూడడం అందం.పట్టించుకోకపోవడం పెను విషాదం.
*****
Please follow and like us:

పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. కథలంటే ఆసక్తి. రాస్తుంటాను.

అద్భుతంగా వ్రాశారు..

మీ సాహిత్యం చాలా బావుంటుంది.. అనురాధ బండి గారూ…