
మేకప్
-బండి అనూరాధ
మరోసారి గాయాలని పిలుద్దాంరహస్య చల్లగాలితో హృదయాల్ని లాలిద్దాంకాస్త కుదురుకున్నట్లు ధైర్యాన్ని ప్రకటిద్దాంలోలోపల బావురుమనే కరువుని పక్కకిజరుపుదాం రేకులురాలిన గులాబీలకి ముఖాలనంటిద్దాంముళ్ళని తాకిన మనసుల కథలని దాటిద్దాంపచ్చని ఆకుల వెచ్చని శ్వాసన నిదురిద్దాంఅద్దాల్లో నిజాలకు నీడలు కల్పిద్దాం చూసినకొద్దీ ఎముంటుందీ చీకటి తప్పవెలుగులుచిందే ముఖాలు ఎన్నీ భూమండలమ్మీదఅయినా ఎందుకో దుఃఖాన్నంతా తలగడకిద్దాంచిరునవ్వుతో కాలంపై యుద్ధం చేద్దాం
*****

పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. కథలంటే ఆసక్తి. రాస్తుంటాను.

‘Genuine poetry can communicates before it is understood’.-TSEliot
నిజానికి, ఇందులో అర్థం కానిదంటూ ఏమీలేదు. అంతా direct గానే ఉంది.
పైకి కవితార్థం సుళువుగానే బోధపడుతున్నా కవితాంతరార్థం మాత్రం వెంటనే communicate కాదు ..కొంచెం time తీసుకుంటుంది. అది అందిన తర్వాత కలిగే అనిర్వచనీయమైన ఆనందపుటాలోచన అంతా ఇంతా కాదు..చెప్పేందుకు మాటలు చాలవు.
ఆగని అంతులేని దు:ఖం, తగరపు ( hypocrisy) జీవితాల మెరుపులపై నిరసన, అందులోనే అందమైన వ్యంగ్యం అత్భుతంగా. పండింది .. “రసన” అంటే ఇదీ.. ఇట్లుండాలి..
Eliot నిర్వచనాన్ని అధిగమించిన పొయెం.
కవికీ publish చేసిన మీకూ అభినందనలు చాలవు.. ధన్యవాదాలు..
Thank you sir
Excellent poem
Thank you sir