ప్రత్తిపాటి నానీలు

-సుభాషిణి ప్రత్తిపాటి

1.
అమ్మే..
నా బలం ఎప్పుడూ!
నా కలంలో సిరా..
అమ్మ కన్నీళ్ళేగా!

2.
ఆమె కళ్ళకు
ఒకటే ఋతువు!
అతని అహం తీర్చే…
శ్రావణమేఘాలవి!

3.
ఆ రాత్రి
అరుణమై జ్వలించింది!
వీరుని రక్తం
పూసుకుందదిగో కశ్మీరం!

4.
ఆదివారం ఒక్కటే,
బతికిపోయాను…!
రెండైతే…
బొందితో స్వర్గమే!..

5.
అంతా
ఆ నలుగురే!
ఆహ్వానించడానికీ‌…
సాగనంపడానికి కూడా!

6.
అవమానాలు
తూటాల్లాంటి మాటలవ్వచ్చు.
కానీ…
గుండెకు తూట్లు కారాదు!

7.
మాటలన్నీ
మౌనాన్ని కరిగించలేవు
నీరవ నిశీధిని
సృష్టించచ్చు,.

*****

2 thoughts on “ప్రత్తిపాటి నానీలు (కవిత)”

  1. అమ్మ కన్నీళ్ళు, తన సిరా..
    అమ్మే తన బలం
    ఎంత హృద్యంగా ఉందీ…

    ఆమె కళ్ళకు ఒకటే ఋతువు
    ఆమె కన్నీరు, అతని అహాన్నితీర్చే శ్రావణమేఘం
    అహంభావి స్వభావాన్ని రెండు పంక్తుల్లోకి ఇలా తర్జుమా చెయ్యడం బావుంది

    నిజమే కదా.
    మాటలన్నీ మౌనాన్ని కరిగించలేవు
    మరికొంచం చీకటిని పెంచొచ్చు కూడా.

    అభినందనలు, ప్రత్తిపాటి సుభాషిణీ గారూ. మీ నానీలు బావున్నాయి. ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.

    -అనూరాధ బండి

Leave a Reply

Your email address will not be published.