image_print
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1. అమ్మే.. నా బలం ఎప్పుడూ! నా కలంలో సిరా.. అమ్మ కన్నీళ్ళేగా! 2. ఆమె కళ్ళకు ఒకటే ఋతువు! అతని అహం తీర్చే… శ్రావణమేఘాలవి! 3. ఆ రాత్రి అరుణమై జ్వలించింది! వీరుని రక్తం పూసుకుందదిగో కశ్మీరం! 4. ఆదివారం ఒక్కటే, బతికిపోయాను…! రెండైతే… బొందితో స్వర్గమే!.. 5. అంతా ఆ నలుగురే! ఆహ్వానించడానికీ‌… సాగనంపడానికి కూడా! 6. అవమానాలు తూటాల్లాంటి మాటలవ్వచ్చు. కానీ… గుండెకు తూట్లు కారాదు! 7. […]

Continue Reading
Posted On :
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1️⃣గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలనుఅశ్రువుల్లా..రాల్చేస్తాయి!2️⃣కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!3️⃣కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!4️⃣కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!5️⃣మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!!    ***** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 […]

Continue Reading
Posted On :

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి నా ఉనికి నిశ్శబ్దం! కానీ నా రాతలు మాత్రం ఓ శబ్దస్పర్శే!! వేలభావాలు తోడుతున్నాను! చిత్రంగా గుండెబావి ఊరుతూనే ఉంది!! కలం విప్లవానికి తొలి గళం! సంఘం గుట్టు విప్పుతుంది కదా! కాలం కరిగిపోతోంది!! ఆయువు కూడా తరిగిపోతోంది!! చందమామ మెరిసిపోతున్నాడు!! మకిలిలేని.కొత్తగాలి కమ్ముతోందిగా!! అంతులేని విశ్రాంతిలో ఆయనకు నడక! అలసటతో.. ఆమె పడక! ***** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ […]

Continue Reading
Posted On :