
ప్రత్తిపాటి నానీలు
-సుభాషిణి ప్రత్తిపాటి
నా ఉనికి
నిశ్శబ్దం!
కానీ నా రాతలు మాత్రం
ఓ శబ్దస్పర్శే!!
వేలభావాలు
తోడుతున్నాను!
చిత్రంగా
గుండెబావి ఊరుతూనే ఉంది!!
కలం
విప్లవానికి తొలి గళం!
సంఘం గుట్టు
విప్పుతుంది కదా!
కాలం
కరిగిపోతోంది!!
ఆయువు కూడా
తరిగిపోతోంది!!
చందమామ
మెరిసిపోతున్నాడు!!
మకిలిలేని.కొత్తగాలి
కమ్ముతోందిగా!!
అంతులేని విశ్రాంతిలో
ఆయనకు నడక!
అలసటతో..
ఆమె పడక!
*****

ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు. పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు చేయడం ఇష్టమైన వ్యాపకాలు.

నానీలు బావున్నాయి సుభాషిణి గారు. మీ కలం మనసులోని వేల భావాలకు సదా కొత్త నిర్వచనం వెతుకుతునే ఉంటుంది
బావున్నాయి సుభాషిణి గారు..మీ కలం మనసులోని భావాలకు సదా కొత్త నిర్వచనం వెతుకుతునే ఉంటుంది
As always simple , short and osm.. Your pen is powerful
Thank you Praveena