image_print
komala

కాళరాత్రి- 21 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం) (చివరి భాగం)

కాళరాత్రి-21 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏప్రిల్‌ 10వ తేదీన ఇంకా క్యాంపులో 20వేల మంది ఖైదీలున్నారు. వారిలో పిల్లలు కొన్నివందల మంది సాయంత్రానికంతా అందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించారు. తదుపరి క్యాంపు తగలబెడతారు. అందరినీ పెద్ద అపెల్‌ ఫ్లాట్‌లోకి తోలారు. గేటు తెరుచుకునేలోగా 5 మంది చొప్పున వరుసలు గట్టి ఎదురుచూడాలి. అకస్మాత్తుగా సైరన్లు మోగాయి. జాగరూకతగా. అందరం బ్లాక్స్‌ లోపలికెళ్ళాం. సాయంత్రం మమ్మల్ని తరలించడం సాధ్యం కాదు. […]

Continue Reading
komala

కాళరాత్రి- 20 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-20 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల సైరన్లు మోగాయి. లైట్లు వెలిగాయి. అందరం లోనకు జొరబడ్డాం. వాకిలి దగ్గర సూపు బాండీలున్నా ఎవరికీ తినాలనిపించలేదు. మంచాల మీదకు చేరితే చాలనుకున్నాం. చాలా బంకులు ఖాళీగా ఉన్నాయి. ఉదయం మెలకువ వచ్చింది. నాకొక నాన్నున్నాడని జ్ఞప్తికి వచ్చింది. హడావిడిగా రాత్రి లోనకు జొరబడిపోయానేగాని నాన్నను పట్టించుకోలేదు. నాన్నకోసం చూడటానికి వెళ్ళాను. నా అంతరంగంలో ఆయన లేకపోతే నాకేమీ బాధ్యత ఉండదనే దుర్మార్గపు […]

Continue Reading
komala

కాళరాత్రి- 19 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-19 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల మాకు తిండిలేదు మంచు మా ఆహారం. పగళ్ళు, రాత్రిళ్ళు మాదిరిగా ఉన్నాయి. మధ్య మధ్య ఆగుతూ ట్రెయిన్‌ పోతూ ఉన్నది. మంచు కురుస్తూనే ఉన్నది. రాత్రిం బవళ్ళు అలా ఒకరి మీద ఒకరం వొరిగి గడిపాం. మాటా పలుకూ లేదు. గడ్డకట్టిన శరీరాల్లా ఉన్నాం. కళ్ళు మూసుకునే ఉన్నాం. రాబోయే స్టాప్‌లో శవాలను ఈడ్చివేస్తారని వేచి ఉన్నాం. జర్మన్‌ పట్టణాలగుండా గూడా ట్రెయిన్‌ […]

Continue Reading
komala

కాళరాత్రి- 18 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-18 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చీకటి పడింది. ఎస్‌.ఎస్‌.లు మమ్మల్ని వరుసలు కట్టమని ఆర్డరు యిస్తున్నారు. మరల మా కవాతు మొదలయింది ` చనిపోయినవారు మంచు కిందపడి ఉన్నారు. వాళ్ళకోసం కడిష్‌ ఎవరూ పఠించలేదు. చనిపోయిన తండ్రులను కొడుకులు అలానే వదిలివేశారు. వారికోసం ఒక చిన్న కన్నీటిబొట్టు కూడా రాల్చలేదు. మంచు కురుస్తూనే ఉన్నది. మేము నెమ్మదిగా మార్చింగ్‌ చేస్తున్నాము. గార్డులు కూడా అలసినట్లున్నారు. పాదం గడ్డ గట్టిపోయేటట్లున్నది. […]

Continue Reading
komala

కాళరాత్రి- 17 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-17 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏదో పాడుబడిన పల్లెకు చేరాం. జీవమున్న ఏ ప్రాణి అక్కడ కనిపించలేదు. కుక్కల అరుపులు గూడా వినరాలేదు. కొందరు పాడుబడిన యిళ్ళలో దాక్కోవచ్చని వరుసలు వీడారు. మరో గంట ప్రయాణం తరువాత ఆగమన్నారు. మంచులో అలాగే పడిపోయాము. ‘‘ఇక్కడ వద్దులే, కొంచెం ముందుకెళితే, షెడ్డులాంటిది కనిపిస్తున్నది, అక్కడికి పోదాంలే’’ అంటూ నాన్న నన్ను లేపాడు. నాకు లేవాలనే కోరికగానీ, శక్తిగానీ లేవు. అయినా […]

Continue Reading
komala

కాళరాత్రి- 16 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-16 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల గెటోలో అమ్మ అలా చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. నాకు నిద్రపట్టలేదు. కాలిపుండు విపరీతంగా సలుపుతున్నది. మరునాడు క్యాంపు క్యాంపులా లేదు. ఖైదీలు రకరకాల బట్టలు ధరించారు. మారువేషాల్లా అనిపించాయి. చలి కాచుకునే ఉద్దేశ్యంలో ఎన్నో బట్టలు ధరించాము. బఫూన్లలాగా ఉన్నాము. బ్రతికిన వాళ్ళలా గాక, చచ్చిన వాళ్ళలా ఉన్నాము. పెద్ద బూటు ఒకటి తొడుక్కుందామని ప్రయత్నించాను. కుదరలేదు. దుప్పటి చించి కాలుకు […]

Continue Reading
komala

కాళరాత్రి- 15 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-15 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చలికాలం వచ్చింది. పగటి వేళలు తగ్గాయి. రాత్రిళ్ళు భరించలేనట్లున్నాయి. చలిగాలులు మమ్మల్ని కొరడాలతో కొట్టినట్లు బాధిస్తున్నాయి. కాస్త బరువుగా ఉన్న చలికోట్లు యిచ్చారు. పనికిపోతున్నాం. బండలు మరీ చల్లగా ఉండి మా  చేతులు వాటికీ అతుక్కు పోతున్నాయన్నట్లు ఉండేది. అన్నిటికీ అలవాటుపడ్డాం. క్రిస్మస్‌, నూతన సంవత్సరం రోజు మేము పని చేయలేదు. సూపు మరీ అంత నీళ్ళగా యివ్వలేదు. జనవరి మధ్యలో నా […]

Continue Reading
komala

కాళరాత్రి- 14 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-14 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల మమ్మల్ని బెర్కినాలో ఆహ్వానించిన క్రూరుడు డా॥ మెంజలీ చుట్టూ ఆఫీసర్లు మూగారు. బ్లాకల్‌టెస్ట్‌ నవ్వుతున్నట్లు నటిస్తూ ‘‘రెడీగా ఉన్నారా?’’ అని అడిగాడు. మేము, ఎస్‌.ఎస్‌. డాక్టర్లూ అందరం రెడీగా ఉన్నాం. మెంజెలీ చేతిలో మా నంబర్ల లిస్టు ఉన్నది. బ్లాకల్‌టెస్ట్‌కి సిగ్నల్‌గా తలూపాడు. మొదట పోవలసిన వారు కపోలు, ఫోర్‌మెన్‌, వాళ్ళంతా శారీరకంగా బలంగా ఉన్నారు. తరువాత మామూలు ఖైదీలు. వాళ్ళని మెంజలీ […]

Continue Reading
komala

కాళరాత్రి- 13 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-13 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల వేసవికాలం ముగింపు కొచ్చింది. యూదు సంవత్సరం ముగింపుకు వస్తున్నది ` రాష్‌హషనా. ముందటి సాయంత్రం ఆ భయంకరమైన సంవత్సరపు ఆఖరు సాయంత్రం అందరం ఆవేదనతో ఉన్నాము. ఆఖరిరోజు ‘సంవత్సరాంతం’ మా జీవితాలకు గూడా ఆఖరి రోజు కావచ్చు. సాయంత్రం చిక్కని సూపు ఇచ్చారు. ఎవరికీ ముట్టాలనిపించలేదు. ప్రార్థన తరువాత చూద్దామనుకున్నాము. అపెల్‌ ప్లాట్‌లో వేల మంది యూదులం కరెంటు ముళ్ళ కంచె మధ్య […]

Continue Reading
komala

కాళరాత్రి- 12 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-12 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఒక వారం గడిచాక క్యాంపు మధ్యలో నల్లని ఉరికంబం ఉండటం చూశాం. అప్పుడే పని నుండి తిరిగి వచ్చాం. హాజరు పట్టీ చాలాసేపు పట్టింది ఆ రోజు. ఆ తరువాతే సూపు యిస్తారు మాకు. ఆర్డర్లు రోజూ కంటే కఠినంగా వినిపించాయి. లెగరాల్‌ టెస్ట్‌ ‘టోపీలు తీయండి’ అని అరిచాడు. పదివేల టోపీలు పైకి లేచాయి. టోపీలు కిందకి’ అన్నాడు. టోపీలు తల […]

Continue Reading
komala

కాళరాత్రి- 11 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-11 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల అది ఒక ఆదివారపు ఉదయం. మా కమాండోకి ఆ రోజు పనిలేదు. కాని ఇడెక్‌ మమ్మల్ని పనిచేయమని డిపోకి పంపాడు. ఫ్రెనెక్‌తో వీళ్ళతో ఏమి చేయిస్తావో నీ యిష్టం, పని చేయించకపోతే, నా సంగతి నీకు తెలుసుగా అంటూ వెళ్ళిపోయాడు. మాకేమి చేయాలో తోచక వేర్‌హవుస్‌లో అటూ ఇటూ తిరుగుతున్నాం ఎక్కడైనా ఎవరైనా మరచి పోయిన రొట్టెముక్క అయినా దొరుకుతుందేమొ అనే భ్రమలో. […]

Continue Reading

My Life Memoirs-25

My Life Memoirs-25 My Life, Full of Beautiful Memories -Venigalla Komala    Rahul’s Love of Animals           As a kid, Rahul  loved all kinds of animals. He used to feed neighbor’s horses with apples from our tree and thought that apples were for horses not for humans. If he saw any […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 10 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-10 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఒక వేర్‌హవుస్‌ ముందు ఆపారు మమ్మల్ని. ఒక జర్మన్‌ ఉద్యోగి వచ్చి కలిశాడు మమ్మల్ని. మా పట్ల శ్రద్ధ చూపలేదు. పని కష్టమయింది కాదు. నేలమీద కూర్చొని బోల్టులూ, బల్బులూ, ఇతర చిన్న కరెంటు సామాను వేరు చేయటం. ఆపని ప్రాముఖ్యత గురించి కపో లెక్చరిచ్చాడు. బద్ధకస్తులకు శిక్ష పడుతుందన్నాడు. జర్మన్‌ ఉద్యోగి ముందు కపో అట్లా మాట్లాడాలి గనుక అలా అంటున్నాడన్నారు […]

Continue Reading
komala

కాళరాత్రి- 9 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-9 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల నాన్న ‘నేనే వీజల్‌ని’ అన్నాడు. అతడు నాన్నను చాలా సేపు చూశాడు. ‘‘నన్ను ఎరగవా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ బంధువు స్టెయిన్ని. రేజల్‌ భర్త స్టెయిన్ని. నీ భార్య రేజల్‌కు పిన్ని తను తరుచు మాకు ఉత్తరాలు రాస్తూ ఉండేది’’ అన్నాడు. నాన్న అతడిని గుర్తు పట్టలేదు. నాన్న కమ్యూనిటీ సంగతులు పట్టించుకున్నంతగా కుటుంబ సభ్యులను పట్టించుకునే వాడుకాదు. ఒకసారి […]

Continue Reading
komala

కాళరాత్రి- 8 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-8 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల అది మే నెలలో చక్కటి రోజు. వసంతకాలపు గాలులు వీస్తున్నాయి. సూర్యాస్తమవబోతున్నది. కొన్ని అడుగులు ముందుకు వేసామో లేదో మరో క్యాంపు. మరో ముళ్ళకంచె ఇక్కడ ఒక ఇనుప గేటు ఉన్నది. దానిమీద ‘‘పని మీకు విశ్రాంతినిస్తుంది’’ ఆష్‌విట్స్‌ అని రాసి ఉన్నది. బెర్కెనా కంటే కొంచెం నయమనిపించింది. రెండతస్తుల సిమెంట్‌ కట్టడాలు. అక్కడక్కడ చిన్న తోటలున్నాయి. ఒక ద్వారం ముందు కూర్చున్నాం. […]

Continue Reading
komala

కాళరాత్రి- 7 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-7 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ప్రవేశ ద్వారం దగ్గర కంపు కొడుతున్న లిక్విడ్‌ బ్యారెల్‌ ఉన్నది. అందరం అందులో మునిగాం. తరువాత వేడినీళ్ళ స్నానం అన్నీ అర్జెంటే. తరువాత బయట ఇంకొంచెం పరుగెత్తించారు. అక్కడ ఇంకొక బ్యారెక్‌ అందులో పొడవాటి బల్లలమీద బట్టల గుట్టలు ఉన్నాయి. మా మీదకు ప్యాంట్లు, షర్టులూ, జాకెట్లు విసిరారు. పెద్దవాళ్ళకు చిన్నసైజు బట్టలు చిన్న వాళ్ళకు పెద్దసైజు బట్టలు దొరకటంతో అవి ధరించి […]

Continue Reading