image_print

My America Tour -2

My America Tour -2 Telugu Original : Avula Gopala Krishna Murty (AGK) English Translation: Komala Venigalla Journey through Nature `Take a sixty days tour in our country, observe newspapers, journalistic trends, law courts and all other things of your interest, visit places you like and meet with people you prefer to` That was the invitation […]

Continue Reading
Posted On :

My America Tour -1

My America Tour -1 Telugu Original : Avula Gopala Krishna Murty (AGK) English Translation: Komala Venigalla           Avula Gopalakrishna Murthy (AGK) a Humanist, an orator, a famous lawyer and a writer gives us a critical appreciation of America and its people.            AGK`s tour is significantly different […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 21 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం) (చివరి భాగం)

కాళరాత్రి-21 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏప్రిల్‌ 10వ తేదీన ఇంకా క్యాంపులో 20వేల మంది ఖైదీలున్నారు. వారిలో పిల్లలు కొన్నివందల మంది సాయంత్రానికంతా అందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించారు. తదుపరి క్యాంపు తగలబెడతారు. అందరినీ పెద్ద అపెల్‌ ఫ్లాట్‌లోకి తోలారు. గేటు తెరుచుకునేలోగా 5 మంది చొప్పున వరుసలు గట్టి ఎదురుచూడాలి. అకస్మాత్తుగా సైరన్లు మోగాయి. జాగరూకతగా. అందరం బ్లాక్స్‌ లోపలికెళ్ళాం. సాయంత్రం మమ్మల్ని తరలించడం సాధ్యం కాదు. […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 20 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-20 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల సైరన్లు మోగాయి. లైట్లు వెలిగాయి. అందరం లోనకు జొరబడ్డాం. వాకిలి దగ్గర సూపు బాండీలున్నా ఎవరికీ తినాలనిపించలేదు. మంచాల మీదకు చేరితే చాలనుకున్నాం. చాలా బంకులు ఖాళీగా ఉన్నాయి. ఉదయం మెలకువ వచ్చింది. నాకొక నాన్నున్నాడని జ్ఞప్తికి వచ్చింది. హడావిడిగా రాత్రి లోనకు జొరబడిపోయానేగాని నాన్నను పట్టించుకోలేదు. నాన్నకోసం చూడటానికి వెళ్ళాను. నా అంతరంగంలో ఆయన లేకపోతే నాకేమీ బాధ్యత ఉండదనే దుర్మార్గపు […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 19 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-19 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల మాకు తిండిలేదు మంచు మా ఆహారం. పగళ్ళు, రాత్రిళ్ళు మాదిరిగా ఉన్నాయి. మధ్య మధ్య ఆగుతూ ట్రెయిన్‌ పోతూ ఉన్నది. మంచు కురుస్తూనే ఉన్నది. రాత్రిం బవళ్ళు అలా ఒకరి మీద ఒకరం వొరిగి గడిపాం. మాటా పలుకూ లేదు. గడ్డకట్టిన శరీరాల్లా ఉన్నాం. కళ్ళు మూసుకునే ఉన్నాం. రాబోయే స్టాప్‌లో శవాలను ఈడ్చివేస్తారని వేచి ఉన్నాం. జర్మన్‌ పట్టణాలగుండా గూడా ట్రెయిన్‌ […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 18 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-18 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చీకటి పడింది. ఎస్‌.ఎస్‌.లు మమ్మల్ని వరుసలు కట్టమని ఆర్డరు యిస్తున్నారు. మరల మా కవాతు మొదలయింది ` చనిపోయినవారు మంచు కిందపడి ఉన్నారు. వాళ్ళకోసం కడిష్‌ ఎవరూ పఠించలేదు. చనిపోయిన తండ్రులను కొడుకులు అలానే వదిలివేశారు. వారికోసం ఒక చిన్న కన్నీటిబొట్టు కూడా రాల్చలేదు. మంచు కురుస్తూనే ఉన్నది. మేము నెమ్మదిగా మార్చింగ్‌ చేస్తున్నాము. గార్డులు కూడా అలసినట్లున్నారు. పాదం గడ్డ గట్టిపోయేటట్లున్నది. […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 17 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-17 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏదో పాడుబడిన పల్లెకు చేరాం. జీవమున్న ఏ ప్రాణి అక్కడ కనిపించలేదు. కుక్కల అరుపులు గూడా వినరాలేదు. కొందరు పాడుబడిన యిళ్ళలో దాక్కోవచ్చని వరుసలు వీడారు. మరో గంట ప్రయాణం తరువాత ఆగమన్నారు. మంచులో అలాగే పడిపోయాము. ‘‘ఇక్కడ వద్దులే, కొంచెం ముందుకెళితే, షెడ్డులాంటిది కనిపిస్తున్నది, అక్కడికి పోదాంలే’’ అంటూ నాన్న నన్ను లేపాడు. నాకు లేవాలనే కోరికగానీ, శక్తిగానీ లేవు. అయినా […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 16 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-16 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల గెటోలో అమ్మ అలా చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. నాకు నిద్రపట్టలేదు. కాలిపుండు విపరీతంగా సలుపుతున్నది. మరునాడు క్యాంపు క్యాంపులా లేదు. ఖైదీలు రకరకాల బట్టలు ధరించారు. మారువేషాల్లా అనిపించాయి. చలి కాచుకునే ఉద్దేశ్యంలో ఎన్నో బట్టలు ధరించాము. బఫూన్లలాగా ఉన్నాము. బ్రతికిన వాళ్ళలా గాక, చచ్చిన వాళ్ళలా ఉన్నాము. పెద్ద బూటు ఒకటి తొడుక్కుందామని ప్రయత్నించాను. కుదరలేదు. దుప్పటి చించి కాలుకు […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 15 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-15 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చలికాలం వచ్చింది. పగటి వేళలు తగ్గాయి. రాత్రిళ్ళు భరించలేనట్లున్నాయి. చలిగాలులు మమ్మల్ని కొరడాలతో కొట్టినట్లు బాధిస్తున్నాయి. కాస్త బరువుగా ఉన్న చలికోట్లు యిచ్చారు. పనికిపోతున్నాం. బండలు మరీ చల్లగా ఉండి మా  చేతులు వాటికీ అతుక్కు పోతున్నాయన్నట్లు ఉండేది. అన్నిటికీ అలవాటుపడ్డాం. క్రిస్మస్‌, నూతన సంవత్సరం రోజు మేము పని చేయలేదు. సూపు మరీ అంత నీళ్ళగా యివ్వలేదు. జనవరి మధ్యలో నా […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 14 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-14 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల మమ్మల్ని బెర్కినాలో ఆహ్వానించిన క్రూరుడు డా॥ మెంజలీ చుట్టూ ఆఫీసర్లు మూగారు. బ్లాకల్‌టెస్ట్‌ నవ్వుతున్నట్లు నటిస్తూ ‘‘రెడీగా ఉన్నారా?’’ అని అడిగాడు. మేము, ఎస్‌.ఎస్‌. డాక్టర్లూ అందరం రెడీగా ఉన్నాం. మెంజెలీ చేతిలో మా నంబర్ల లిస్టు ఉన్నది. బ్లాకల్‌టెస్ట్‌కి సిగ్నల్‌గా తలూపాడు. మొదట పోవలసిన వారు కపోలు, ఫోర్‌మెన్‌, వాళ్ళంతా శారీరకంగా బలంగా ఉన్నారు. తరువాత మామూలు ఖైదీలు. వాళ్ళని మెంజలీ […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 13 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-13 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల వేసవికాలం ముగింపు కొచ్చింది. యూదు సంవత్సరం ముగింపుకు వస్తున్నది ` రాష్‌హషనా. ముందటి సాయంత్రం ఆ భయంకరమైన సంవత్సరపు ఆఖరు సాయంత్రం అందరం ఆవేదనతో ఉన్నాము. ఆఖరిరోజు ‘సంవత్సరాంతం’ మా జీవితాలకు గూడా ఆఖరి రోజు కావచ్చు. సాయంత్రం చిక్కని సూపు ఇచ్చారు. ఎవరికీ ముట్టాలనిపించలేదు. ప్రార్థన తరువాత చూద్దామనుకున్నాము. అపెల్‌ ప్లాట్‌లో వేల మంది యూదులం కరెంటు ముళ్ళ కంచె మధ్య […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 12 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-12 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఒక వారం గడిచాక క్యాంపు మధ్యలో నల్లని ఉరికంబం ఉండటం చూశాం. అప్పుడే పని నుండి తిరిగి వచ్చాం. హాజరు పట్టీ చాలాసేపు పట్టింది ఆ రోజు. ఆ తరువాతే సూపు యిస్తారు మాకు. ఆర్డర్లు రోజూ కంటే కఠినంగా వినిపించాయి. లెగరాల్‌ టెస్ట్‌ ‘టోపీలు తీయండి’ అని అరిచాడు. పదివేల టోపీలు పైకి లేచాయి. టోపీలు కిందకి’ అన్నాడు. టోపీలు తల […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 11 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-11 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల అది ఒక ఆదివారపు ఉదయం. మా కమాండోకి ఆ రోజు పనిలేదు. కాని ఇడెక్‌ మమ్మల్ని పనిచేయమని డిపోకి పంపాడు. ఫ్రెనెక్‌తో వీళ్ళతో ఏమి చేయిస్తావో నీ యిష్టం, పని చేయించకపోతే, నా సంగతి నీకు తెలుసుగా అంటూ వెళ్ళిపోయాడు. మాకేమి చేయాలో తోచక వేర్‌హవుస్‌లో అటూ ఇటూ తిరుగుతున్నాం ఎక్కడైనా ఎవరైనా మరచి పోయిన రొట్టెముక్క అయినా దొరుకుతుందేమొ అనే భ్రమలో. […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 10 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-10 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఒక వేర్‌హవుస్‌ ముందు ఆపారు మమ్మల్ని. ఒక జర్మన్‌ ఉద్యోగి వచ్చి కలిశాడు మమ్మల్ని. మా పట్ల శ్రద్ధ చూపలేదు. పని కష్టమయింది కాదు. నేలమీద కూర్చొని బోల్టులూ, బల్బులూ, ఇతర చిన్న కరెంటు సామాను వేరు చేయటం. ఆపని ప్రాముఖ్యత గురించి కపో లెక్చరిచ్చాడు. బద్ధకస్తులకు శిక్ష పడుతుందన్నాడు. జర్మన్‌ ఉద్యోగి ముందు కపో అట్లా మాట్లాడాలి గనుక అలా అంటున్నాడన్నారు […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 9 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-9 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల నాన్న ‘నేనే వీజల్‌ని’ అన్నాడు. అతడు నాన్నను చాలా సేపు చూశాడు. ‘‘నన్ను ఎరగవా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ బంధువు స్టెయిన్ని. రేజల్‌ భర్త స్టెయిన్ని. నీ భార్య రేజల్‌కు పిన్ని తను తరుచు మాకు ఉత్తరాలు రాస్తూ ఉండేది’’ అన్నాడు. నాన్న అతడిని గుర్తు పట్టలేదు. నాన్న కమ్యూనిటీ సంగతులు పట్టించుకున్నంతగా కుటుంబ సభ్యులను పట్టించుకునే వాడుకాదు. ఒకసారి […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 8 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-8 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల అది మే నెలలో చక్కటి రోజు. వసంతకాలపు గాలులు వీస్తున్నాయి. సూర్యాస్తమవబోతున్నది. కొన్ని అడుగులు ముందుకు వేసామో లేదో మరో క్యాంపు. మరో ముళ్ళకంచె ఇక్కడ ఒక ఇనుప గేటు ఉన్నది. దానిమీద ‘‘పని మీకు విశ్రాంతినిస్తుంది’’ ఆష్‌విట్స్‌ అని రాసి ఉన్నది. బెర్కెనా కంటే కొంచెం నయమనిపించింది. రెండతస్తుల సిమెంట్‌ కట్టడాలు. అక్కడక్కడ చిన్న తోటలున్నాయి. ఒక ద్వారం ముందు కూర్చున్నాం. […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 7 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-7 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ప్రవేశ ద్వారం దగ్గర కంపు కొడుతున్న లిక్విడ్‌ బ్యారెల్‌ ఉన్నది. అందరం అందులో మునిగాం. తరువాత వేడినీళ్ళ స్నానం అన్నీ అర్జెంటే. తరువాత బయట ఇంకొంచెం పరుగెత్తించారు. అక్కడ ఇంకొక బ్యారెక్‌ అందులో పొడవాటి బల్లలమీద బట్టల గుట్టలు ఉన్నాయి. మా మీదకు ప్యాంట్లు, షర్టులూ, జాకెట్లు విసిరారు. పెద్దవాళ్ళకు చిన్నసైజు బట్టలు చిన్న వాళ్ళకు పెద్దసైజు బట్టలు దొరకటంతో అవి ధరించి […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 6 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-6 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల అయితే మేము మంటల్లోకి పోతున్నామన్నమాట. కొద్ది ఎడంగా పెద్దవాళ్ళను కాల్చే గుంట ` అందులో మంటలు. నాకు అనుమానం వచ్చింది. నేనింకా బ్రతికే ఉన్నానా? అని. పెద్ద, చిన్న, ఆడ, మగ అందర్నీ అలా కాల్చి చంపుతుంటే ప్రపంచం నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నది? ఇది నిజం కాదేమొ!  పీడకల అయి ఉండాలి నాది. ఒక్క ఉదుటున మేల్కొంటాను భయంతో చెమటలు కక్కుతున్నాను. తీరా […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 5 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-5 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చెకోస్లోవేకియా భూభాగం వద్ద కస్‌చా అనే ఊరిలో బండి ఆగింది. అప్పటికి గానీ మాకు హంగరీలో ఉండబోవటం లేదనేది తెలిసి వచ్చింది. ఒక జర్మన్‌ ఆఫీసరు ఒక హంగరీ ఆఫీసర్ని వెంటబెట్టుకుని తలుపు తెరచి లోనికి వచ్చాడు. హంగరీ ఆఫీసరు అతను చెప్పేది అనువదించి మాకు చెపుతున్నాడు. ఈ క్షణం నుండి మీరు జర్మన్‌ ఆర్మీ ఆధీనంలో ఉంటారు. మీ దగ్గర బంగారం, […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి-4 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-4 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఇంతలో యూదు పోలీసులు వచ్చి ‘‘టైమయింది. మీరంతా అన్నీ వదిలిపోవాలి’’ అని జీరబోయిన స్వరాలతో చెప్పారు. హంగరీ పోలీసులు ఆడ, మగ, పిల్లలు, వృద్ధులను కర్రలతో కొట్టనారంభించారు. అందరూ గెటోలు వదిలి తమ సంచులతో రోడ్డు మీదికి వచ్చారు. పోలీసులు పేర్లు పిలిచి అందరూ ఉన్నారో లేదో అని పదిసార్లు లెక్కించారు. ఎండ తీవ్రత బాధించింది. పిల్లలు మంచినీళ్ళు కావాలని గోలపెడుతున్నారు. ఇళ్ళల్లో […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి-3 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-3 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఇది బాగానే ఉన్నదని అనుకున్నారు జనం. మా కిష్టంలేని ఆ పోలీసుల ముఖాలు చూడనవసరం లేదు అని సర్దుకున్నాం. యూదులం కలిసి బ్రతుకుతున్నామనుకున్నాం. అసంతృప్తికర విషయాలు జరుగుతూనే ఉన్నాయి. మిలిటరీ రైళ్ళకు బొగ్గు నింపటానికి మనుషుల్ని తీసుకుపోవటానికి జర్మన్లు ఇళ్ళలోకి వచ్చేవారు. అలాంటి పనులు చేయటానికి యిష్టపడే వాలంటీర్లు బహు తక్కువ. అది తప్ప వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లే. యుద్ధం ముగిసేదాకా గెటోల్లోనే […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి-2 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-2 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఇది 1942 చివరలో జరిగింది. అటు తరువాత జీవితాలు మామూలుగా సాగుతున్నాయి. రోజూ లండన్‌, రేడియో వింటుండే వాళ్ళం. జర్మనీ స్టాలిన్‌ గ్రాడ్‌ బాంబింగ్సు గురించి వింటుంటే సిఘెట్‌లోని యూదు లందరూ తమకు మంచి రోజులు రానున్నాయని నమ్మారు. నా చదువు యధావిధిగా కొనసాగించాను ` పగలు టల్‌ముడ్‌, రాత్రి కబాలా! నాన్న తన వ్యాపారం నడుపుతూ కమ్యూనిటీ బాగోగులు చూస్తుండేవాడు. మా […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి-1 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)(ఈ నెల నుండి ప్రారంభం)

కాళరాత్రి అనువాదం : వెనిగళ్ళ కోమల అతన్ని అందరూ మోషే ది బీడిల్‌ అనే పిలిచేవారు. అతనికి ఎప్పటికీ ఇంటి పేరంటూ లేనట్లే. హసిడిక్‌ ప్రార్థనా మందిరంలో అన్ని పనులూ చక్క బెట్టేవాడు. ట్రాన్‌సిల్వేనియాలో చిన్నపట్నం సిఘెట్‌ ` అక్కడే నా బాల్యం గడిచింది. ఆ పట్నంలో అందరికీ అతను ఇష్టుడు. అతను చాలా పేదవాడు. మా ఊరివాళ్ళు పేదవాళ్ళను ఆదుకునేవారు. కాని వాళ్ళంటే యిష్టపడేవాళ్ళు కాదు. కానీ మోషే ది బీడిల్‌ సంగతి వేరు. అతను […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు (చివరి భాగం)

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు (చివరి భాగం)  -వెనిగళ్ళ కోమల అమెరికాలో స్నేహితులు మా ఇద్దరికీ ముఖ్యమైన మిత్రులు ప్రొ.ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయి. వారితో ఇండియాలో పరిచయమైనా ఇక్కడ మాకు వారితో స్నేహం గాఢమయింది. వారింటికి (గెయితీస్ బర్గ్) తరచు వెళ్ళి రోజంతా గడుపుతాము. కృష్ణ కుమార్ గారు సౌమ్యులు. నెమ్మదిగా అనేక విషయాలు ఇన్నయ్యతో చర్చిస్తుంటారు. ఇక జ్యోతిర్మయి రకరకాల వంటలు ఓపిగ్గా మాకు చేసి పెడుతుంటారు. ఎప్పుడూ వారింట్లో ఎవరో ఒకరు స్నేహితులు బస […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-12

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-12 -వెనిగళ్ళ కోమల డి. ఆంజనేయులు డి. ఆంజనేయులు ఇన్నయ్యకు చిరకాల మిత్రులు. తెలుగు, ఇంగ్లీషు భాషల మీద మంచి పట్టుగల రచయిత, జర్నలిస్టు, క్రిటిక్, పి.ఐ.బి.లో పనిచేశారు. మద్రాసులో నివాసం. పెద్ద గ్రంథాలయం ఏర్పరచుకున్నారు. ఆంజనేయులుగారి ఏకైక పుత్రిక శాంతిశ్రీ చిన్నప్పటి నుండి నవీన, రాజుతో మంచి స్నేహితురాలుగా మెలుగుతూ వచ్చింది. ఇప్పడు పూనా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు. తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుంది. మంచి వక్త. […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-11

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-11 -వెనిగళ్ళ కోమల రాజు ఢిల్లీ నివాసం యూరప్ లో ఉన్నప్పుడే “హిందూస్థాన్ టైమ్స్” ప్రతినిధులు రాజును వారికి ఆర్ధిక, పరిశ్రమలకు సంబంధించిన దిన పత్రికను ప్రారంభించమని కోరారు. రాజు తన మాతృదేశానికి ఏదైనా తన వంతు చేయాలనే తలంపుతో ఉన్నాడు. తాను పుట్టినదేశం, తనకు చదువు సంధ్యలిచ్చిన దేశం పట్ల తనకు కర్తవ్యం ఉన్నదనే భావంతోనే హిందూస్థాన్ టైమ్స్ వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. రాజు తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు, “ది వాల్ […]

Continue Reading
Posted On :

My Life Memoirs-10

My Life Momoirs-10 My Life, Full of Beautiful Memories -Venigalla Komala   18.Our First Trip to the US We were anxiously waiting to be with Naveena and Hemanth hoping to be of some support to them. We got our Visas by the end of January, 1992 and reached America on February 3. All of us have […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-10

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-10 -వెనిగళ్ళ కోమల కాలేజ్ సర్వీస్ అన్వరుల్ – ఉలుం కాలేజీలో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేది. మా డిపార్ట్ మెంట్ హెడ్ ఎ.ఎం.వాఛా స్టాఫ్ ను ఆదరించేవారు. అందరిచేత పనిచేయించటంలో నేర్పరి. కష్టజీవి. ఎప్పుడూ సెలవుపెట్టి ఎరగడు. తన పుట్టిన రోజున మాకు పార్టీలిచ్చేవాడు. ఇప్పటికీ అది కొనసాగుతున్నది. రాఘవేంద్ర మాన్వీ, క్రిస్టీనా, జాఫ్రీ – అందరం ఒక కుటుంబ సభ్యులుగా అమెరికాలో పెరిగేవాళ్ళం. నేను క్రిస్టీనా ఖమరున్నీసా బేగం (ఎకనామిక్స్) స్నేహంగా, […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-9

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-9 -వెనిగళ్ళ కోమల నవీన మెడిసిన్ పూర్తవుతుండగా హేమంత్ తో వివాహం జరిగింది. అతను నిజాం కాలేజి గ్రాడ్యుయేట్. ఇండియన్ ఎంబసీ, వాషింగ్టన్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను ప్రపోజ్ చేసిన మీదట నవీన ఇష్టపడింది. అతను సెలవులకు హైదరాబాద్ వచ్చి ఉన్నాడు. ఇన్నయ్యకు ఆ పెండ్లికి అభ్యంతరం లేకపోయింది. జనవరి 12, 1988న రిజిస్టర్ వివాహం జరిగింది. జూబ్లీహిల్స్ క్లబ్ లో డిన్నర్ ఇచ్చాము. వ్యవధి లేకపోవటాన నా వాళ్ళంతా ఊళ్ళ […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-8

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-8 -వెనిగళ్ళ కోమల రాజు పుట్టుక గురించి నాకొక గట్టి విశ్వాసం ఉన్నది. నేను, కనకమణి స్కూలు లైబ్రరీకి ఇంగ్లీషు పుస్తకాలు కొనటానికి ఒకనాడు ఆబిడ్స్ వెళ్లాము. పుస్తకాలు సెలక్షన్ అయ్యింది. లంచ్ చేద్దామని నిజాం కాలేజికెదురుగా ఉన్న ఓరియంట్ రెస్టారెంట్ కి వెళ్ళాము. పదార్ధాలు ఆర్డరిచ్చి మాట్లాడుకుంటున్నాము. నాలో అతిసన్నని కదలిక అనిపించింది. గర్భం సూచన అది అనిపించింది. భోజనం సహించలేదు. ఓరియంట్ రెస్టారెంట్ కి ఒక ప్రత్యేకత ఉండేది. ఎలీట్, […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-7

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-7 -వెనిగళ్ళ కోమల వివాహం, పిల్లలు, బాధ్యతలు అన్నయ్యకు చదువుతుండగానే పెండ్లయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో డి్గ్రీ చదివారు. ముగ్గురు పిల్లల తండ్రయ్యారు. తార, నాగమణి, కృష్ణమోహన్ – వదిన ఎంపికే ముగ్గురి పేర్లు. పెంచే విధానం గూడా ఆమెకు తోచినట్లే. ఆ తరుణంలో మా అమ్మ నాకూ శ్యామలక్కకూ పెండ్లి విషయం నాన్న, అన్నయ్య శ్రద్ధ పట్టటం లేదని కొంత బెంగ పడింది. స్నేహితుల పెళ్ళిళ్ళ విషయంలో చూపే శ్రద్ధ మాపట్ల […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-6

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-6 -వెనిగళ్ళ కోమల ఒకనాడు వెల్మా, నేను బస్ మిస్ చేసి మార్కెట్ కు అడ్డదారిన నడిచి వెళుతూ ఉన్నాం. నలుగురు యువకులు ఆ దారినే వెళుతూ ఉన్నారు. వెల్మా గళ్ళెగా పెద్దదానిలాగా ఉంటుంది. నేను అప్పుడు బక్కగా ఉండేదాన్ని. తనకు తెలుగు రాదు గనుక ఇద్దరం హిందీలో కబుర్లాడుకుంటూ నడిచాం. ఆ అబ్బాయిలు తెలుగులో మా మీద కామెంట్స్ పాస్ చేస్తూనే నడిచారు. మాకు అర్థం కాదని గాబోలు – ‘ఈమె […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-5

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-5 -వెనిగళ్ళ కోమల నాకు 8 ఏళ్లుంటాయి  నేను గెంతుతూ ఆడుతున్నాను. బజారు తలుపు తెరుచుకుని ఒకాయన కాషాయవస్త్రధారి (యువకుడే) వచ్చాడు. నాన్నను చూచి – ఈ అమ్మాయి అడవిలో కళ్ళు మూసుకుని కూర్చున్నా అన్నం దొరుకుతుంది అన్నాడు. నాన్న అతని మాటలు నమ్మాడని కాదుగాని అతను నాన్నను ప్లీజ్ చేయటానికి వాడిన సమయస్ఫూర్తి నచ్చి అతనికి 2 రూపాయలు (అప్పుడది ఎక్కువ) యిచ్చి పంపాడు. దానధర్మాలు చేయటం, చందాలు విరివిగా ఇవ్వటం […]

Continue Reading
Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-4

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-4 -వెనిగళ్ళ కోమల చిన్నపిల్లల్ని పోగేసి చింతగింజలాట ఆడేదాన్ని ఇంటర్ చదివేటప్పుడు. అన్నయ్య ‘నిన్ను ఇలా చూచినవారెవరూ ఇంటర్ చదువుతున్నావంటే నమ్మరు’ అనేవాడు. ఐదురాళ్ళ ఆట కూడా మొదలు పెట్టా. నొక్కుల జుత్తు పెద్దగా, ఒత్తుగా ఉండేది. చిక్కు తీసుకోలేక పీకి, కత్తిరించి పడేస్తుంటే అన్నయ్య – నీకెందుకింత చక్కని జుట్టు వచ్చిందో గాని నులకతాడు పేనినట్లు పేనుతున్నావు అని కోప్పడేవాడు. మంచి దువ్వెన తెచ్చి ఇచ్చాడు.  ఇంటర్ లో 10 మంది […]

Continue Reading
Posted On :
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-3

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-3 -వెనిగళ్ళ కోమల సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో చదువు కుంటుంటే దగ్గర ఉండి వండి పెట్టింది. నా పెండ్లి దాకా ఉన్నది పెద్దమ్మ. మేమంతా గౌరవించి, ప్రేమించిన సీతమ్మ పెద్దమ్మ. నాన్నగారి తరఫున తాతయ్య, బాబాయిలు, నాగమ్మత్తయ్య ఎక్కువ వచ్చిపోతుండేవారు. నాన్న స్థితిమంతుడవటాన […]

Continue Reading
Posted On :
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-2

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-2 -వెనిగళ్ళ కోమల పెద్ద మామయ్య అంటే నాన్నకు యిష్టం.  మాకందరికీ చనువు ఉండేది. మామయ్యలు అమ్మ ఒకరినొకరు ప్రాణప్రదంగా చూసుకునేవారు. పెదమామయ్య సౌమ్యుడు. ఏ పని చేసినా నీటుగా, అందంగా చేసేవాడు. తాటిజీబుర్లతో ఎంతో ఉపయోగంగా ఉండే చీపుర్లు కట్టేవారు. నులక, నవారు, మంచాలు నేయటంలో నేర్పరి. దీపావళికి ఉమ్మెత్తకాయలు తొలిచి ప్రమిదలుగా చేసి, నూనెపోసి వెలిగించి ద్వారాలకు అందంగా వేలాడదీసేవాడు. ఉండ్రాళ్ళతద్దెకూ, అట్ల తద్దెకూ మా రెండో యింట్లో మోకులతో […]

Continue Reading
Posted On :
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-1

జ్ఞాపకాలు-1 -వెనిగళ్ళ కోమల నాన్న తన మూడవ ఏట మూల్పూరు పెంపు వచ్చారట. పెంచుకున్న వారు అఫీషియల్ గా దత్తత నిర్వహించి నాన్న అసలు యింటి పేరు మార్చలేదు. పెంచి బాధ్యతలు, ఆస్తులు అప్పగించారు తప్ప. అందువలన మూల్పూరులో మేము  ఒక్కళ్ళమే వెనిగళ్ళవాళ్ళం. అంట్లు, సూదకాలు మా దరికి రాలేదు మూల్పూరులో. మాది ఏకఛత్రాదిపత్యం మూల్పూరులో. పెద్దింటి వారుగా ఊరంతా గౌరవించేవారు. అలా అమ్మా, నాన్నా నడుచుకున్నారు మరి! అమ్మకు ఎనిమిదవ ఏట నాన్నతో (18ఏళ్ళు) పెండ్లి […]

Continue Reading
Posted On :