
మనిషితనం (కవిత)
-కె.రూప
ఒంటరితనం కావాలిప్పుడు నన్ను నాకు పరిచయం చేసే చిన్న చప్పుడు కూడా వినపడని చోటుఏ వస్తువు కనబడని చోటునాలో మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేదినన్ను నన్నుగా గుర్తించేది ౧ ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది నాకు వినపడేలా నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని నాలో నింపుకోవలసిన సమయమిప్పుడు!౨బిగుతై పోతున్న గుండె బరువుల నుండి సేదతీరాలనే సంకల్పంతో౩ఉదయపు వేకువల చప్పుళ్ళనుండి మొదలురాత్రి వెన్నెలకు కురిసే తడి కూడా అంటనంత నా అడుగుల చప్పుడు కూడా నన్ను గుర్తించనంతగాఏ శబ్దమో ..ఏ రాగమో ..వినపడనంత దూరంకొండవాలుగా జారే జలపాతం అంత లోతుగా గగనంలోకి జారిపోవాలిఏ గాలి చొరబడ కుండా ఇప్పుడేదైనా కప్పేసుకోవాలి ౪అంతగా..చీకటి నిండిన దారులలో వెలుగుని వెతికే విశాలమైన మనసు కోసం ఓ ఒంటరి స్వరం నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది మౌన ముద్రలోని అభ్యాసాలూ నాకేవో చెప్తున్నాయి. నాలోని ఒంటరితనాన్ని మేల్కొలిపి .. చెదిరిన నవ్వులకు ఆపన్నహస్తం అయ్యే మార్గాన్ని వెతికి పట్టుకోవాలి…మనిషితనాన్ని గుర్తించాలి
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

ఆలోచనాత్మకం,కవిత నిర్మాణం లో నూతనత్వం. బాగుంది
నాలో ఒంటరితనాన్ని మేల్కొలిపి చెదిరిన నవ్వులలకు అపన్నాహస్తం అయ్యే మార్గాన్ని వెతికి పట్టుకోవాలి….. మనిషితనాన్ని గుర్తించాలి…. అవును నిజం బాగుంది కవిత….
బాగుంది మీ కవిత
Thank you 😊
Very nice nice
Thankyou very much 😊
మనిషి తనం కోల్పోయిన ప్రతి స్వరం ఒంటరి స్వరమే..
Thank you sir😊
It’s so good send me ur number
I worked with u in vijayawada
9030455949
Thank you 😊
విశాలమైన మనసుకోసం ఓ ఒంటరి స్వరం. నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. బాగుంది. మనిషితనాన్ని దొరకబుచ్చుకోవాలన్న మీ సిన్సియర్ పయత్నం సక్సస్ కావాలని ఆశిస్తున్నాను. 🌺
Thank you sir thank you very much fr ur blessings 😊