విషాద నిషాదము

షష్టమ భాగము – స్వరాభిషేకము

-జోగారావు

1956 వ సంవత్సరము నుండి బహిరంగ సంగీత కచేరీలకు దూరమైనప్పటికీ, పురస్కారములు అన్నపూర్ణాదేవిని అలంకరించేయి.

1977 వ సంవత్సరములో పద్మ భూషణ్, 1991 లో సంగీత నాటక ఎకాడమీ

ఎవార్డ్, 1997 లో విశ్వ భారతీ విశ్వ విద్యాలయము గౌరవ డాక్టరేట్ కు

సమానమైన “ దేశికోత్తమ “ అన్నపూర్ణాదేవిని అందుకుని తమను తాము గౌరవించుకున్నాయి.

ఈ మూడు అవార్డులనూ అందుకొనడానికి అన్నపూర్ణాదేవి గడప దాటలేదు.

వాటిని ఆ గౌరవ ప్రదాతలు ఆకాశ గంగకు వచ్చి ఆవిడకు అంద చేసేరు.

1999 వ సంవత్సరములో ఆవిడ సంగీత నాటక ఎకాడమీ సభ్యులిగా నియమింప బడ్డారు.

1970 వ సంవత్సరములో ప్రముఖ పాప్ రాక్ గ్రూప్ సభ్యుడు పండిత్ రవి శంకర్ శిష్యుడు జార్జ్ హేరిసన్ అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీని కలసినప్పుడు తనకు అన్నపూర్ణాదేవి వద్ద సంగీతము నేర్చుకోవాలని ఉన్నదని అడిగేరు. ఆవిడ అన్నపూర్ణాదేవి తో జార్జ్ హేరిసన్ ను శిష్యునిగా చేర్చుకొమ్మని అడిగేరు.

అప్పుడు అన్నపూర్ణాదేవి శ్రీమతి ఇందిరా గాంధీ తో తను అతనికి సంగీతము నేర్పనని, ఒక్క రోజు తను సుర్ బహార్ సాధన చేసేటప్పుడు జార్జ్ హేరిసన్ ను వినడానికి అనుమతించేరు.

ఆ విధముగా ఒక్క రాత్రి జార్జ్ హేరిసన్ అన్నపూర్ణాదేవి అభ్యాసము చేసేటప్పుడు కొన్ని గంటలు ఆవిడ సాన్నిధ్యములో కూర్చునే అదృష్టమును పొందేరు.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.