అసలైన విశ్వ సుందరి 

-శ్రీనివాస భరద్వాజ కిశోర్

 

సృష్ఠికంతటికి మన భూమాతే —  అసలైన విశ్వసుందరి —

అసలైన విశ్వమంతటికీ          — భూమాతయే విశ్వసుందరి 

భూమాతే నిజమైన సుందరి   – భూమాతయే విశ్వసుందరి

నీలి సముద్రము చీరగా – పచ్చని అడవులు రవికెగా

మంచుకిరీటముతో తిరిగే మన – భూమాతయే విశ్వసుందరి

నల్లని ఆకాశపు తివాసిపై – తెల్లని పూలుగ  తారలు మారగ

రాజహంసలా నడిచే- మన – భూమాతయే విశ్వసుందరి

లావణ్యానికి ముగ్ధుడై – కన్నార్పకుండ అన్నివేళలా

సూర్యుడు ఎవరిని చూసేడో ఆ – భూమాతయే విశ్వసుందరి

చల్లని చూపూ చిరునవ్వు కోరి – వన్నెల వెనెల చంద్రుడు పాపం

ఎవరి చుట్టు తిరిగేడో ఆ  – భూమాతయే విశ్వసుందరి

ఎన్నో యుగాల వయస్సువున్నా – రోజూ పెరిగే వర్ఛస్సుతో

నిత్య యవ్వనముతో వెలిగే ఆ  – భూమాతయే విశ్వసుందరి

నాగలితో తన తనువు చీరినా – విషములతో కలుషితము చేసినా

కడుపులు నింపే పంటలనిచ్చే  – భూమాతయే విశ్వసుందరి

అస్త్రాలు వాడి పెళ్ళగించినా – యంత్రాలతోటి కడుపు చించినా

రత్నాలే రాసులుగా ఇచ్చే  – భూమాతయే విశ్వసుందరి

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.