నూజిళ్ల గీతాలు-4(ఆడియో)

నెచ్చెలి (పాట)

రచన: నూజిళ్ల శ్రీనివాస్

గానం: ఈశా వరకూరు

ఎల్లరు మెచ్చే నెచ్చెలి

ఏ ఎల్లలు లేని నెచ్చెలి

తెలుగు వనితల సాహిత్యం

వెలుగు చరితల ఔన్నత్యం

లోకమంతటికి వెల్లడి చేసే

ముచ్చటలాడే నెచ్చెలి

స్త్రీ ప్రగతికి నిచ్చెన నెచ్చెలి!

 

చరణం -1:

ఏ రంగంలోనైనా స్త్రీ మూర్తుల కృషి ఘనమైనదని

ఏ పనీ చేపడుతున్నా స్త్రీ విజయాలకు కొదవుండదని

ఎరుక పరచు అంతర్జాతీయ వనితా మాస పత్రిక

వెలుగులను పంచు అంతర్జాల గీతా మానస పుత్రిక

….. ముచ్చట గొలిపే నెచ్చెలి

       గెలుపిచ్చెడి మాటల నెచ్చెలి

 

చరణం -2:

కవన కోకిలల గానాలు, కథలను వినిపించే చిత్రాలు

అంతరంగ అన్వేషణలు, అనుసృజనలు, సరదా సందడులు

ఆత్మకథల సంవేదనలు, అద్భుతమగు యాత్రా కథనాలు

జగతికందించి మోదమున ముంచు అనుభూతుల సుమ మాలిక!

 …. ముచ్చట గొలిపే నెచ్చెలి

       గెలుపిచ్చెడి మాటల నెచ్చెలి

 

చరణం -3:

అనుభవమందిన పలుకులతో గతకాలపు సంగతులందించి

నవ యువ కలములు, గళములతో సృజనాత్మక శరముల సంధించి

నవ్య సాంకేతికతను వివరించు విశ్వ విజ్ఞాన వేదిక

భవ్యలోకమును కోరి సాధించు విశ్వ మహిళకిది వేడుక!

…. ముచ్చట గొలిపే నెచ్చెలి

       గెలుపిచ్చెడి మాటల నెచ్చెలి


*****

Please follow and like us:

One thought on “నూజిళ్ల గీతాలు-4 నెచ్చెలి (ప్రత్యేక గీతం)”

Leave a Reply

Your email address will not be published.