నా నేస్తం!! (కవిత)

-సుభాషిణి ప్రత్తిపాటి

అనాసక్త జీవన ప్రయాణంలో…

చైత్రవర్ణాలు నింపిన వాసంతం!!

కల్లోలకడలిన తెరలెత్తిన చుక్కాని!

దుఃఖపు పొరల మధ్య…

నా చెక్కిలి నిమిరే మలయసమీరం!!

రెప్పలు దాటని స్వప్నాలను….

సాకారం చేసిన దేవత!

మోడులైన పెదవంచుల…

చిరునగవుల వెన్నెల పూయించిన జాబిల్లి!

తనే…నా…నేస్తం!!

గుండె గదుల్లో దాగిన చీకట్లను…

తరిమి,తరిమి కొట్టిన వెలుతురు పిట్టలు….నా పుస్తకాలు.

నన్నే నాకు కానుక చేసిన

ప్రియచెలులేకేమివ్వగలను…???

మరు జన్మకు పుస్తకమై జతకలవడం తప్ప!!!

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

10 thoughts on “నా నేస్తం!! (కవిత)”

 1. చాలా బాగుంది అక్షర కుసుమం.
  అంతర్జాలం పేరుకు తగ్గట్టే!.
  అభినందన సుమాలు.
  మీ కలం నుండి మరిన్ని కవనాలు
  పుస్తక రూపాలుగా జాలువారాలని కోరుకొంటూ…
  – కంచర్ల సుబ్బానాయుడు.

 2. ప్రతి అక్షరము మనసు పొరల్లో నుండి వస్తున్న భావము…శుభాకాంక్షలుతో.. మీ శ్రేయోభిలాషి.. ప్రవీణ

Leave a Reply to Shankar Cancel reply

Your email address will not be published.