
నా నేస్తం!! (కవిత)
-సుభాషిణి ప్రత్తిపాటి
అనాసక్త జీవన ప్రయాణంలో…
చైత్రవర్ణాలు నింపిన వాసంతం!!
కల్లోలకడలిన తెరలెత్తిన చుక్కాని!
దుఃఖపు పొరల మధ్య…
నా చెక్కిలి నిమిరే మలయసమీరం!!
రెప్పలు దాటని స్వప్నాలను….
సాకారం చేసిన దేవత!
మోడులైన పెదవంచుల…
చిరునగవుల వెన్నెల పూయించిన జాబిల్లి!
తనే…నా…నేస్తం!!
గుండె గదుల్లో దాగిన చీకట్లను…
తరిమి,తరిమి కొట్టిన వెలుతురు పిట్టలు….నా పుస్తకాలు.
నన్నే నాకు కానుక చేసిన
ప్రియచెలులేకేమివ్వగలను…???
మరు జన్మకు పుస్తకమై జతకలవడం తప్ప!!!
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
Please follow and like us:

ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు. పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు చేయడం ఇష్టమైన వ్యాపకాలు.

చాలా బాగుంది అక్షర కుసుమం.
అంతర్జాలం పేరుకు తగ్గట్టే!.
అభినందన సుమాలు.
మీ కలం నుండి మరిన్ని కవనాలు
పుస్తక రూపాలుగా జాలువారాలని కోరుకొంటూ…
– కంచర్ల సుబ్బానాయుడు.
మీ శుభ కామనలకు ధన్యవాదములు సార్
బాగా రాశారు😊😀
ప్రతి అక్షరము మనసు పొరల్లో నుండి వస్తున్న భావము…శుభాకాంక్షలుతో.. మీ శ్రేయోభిలాషి.. ప్రవీణ
ధన్యవాదములు సార్ 🙏
Nice lines
బాగారాశారు మేడం.
మీకు అభినందనలు
Chala bavundi su-bhashini.abhinandanalu.
ధన్యవాదములు మేడం గారు
Thank you Sir 🙏