తెనిగీయం-2

వెంట్రుకల బంతి (కథ)

ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్

స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి

 

కేట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆమె గ్భాశయంపై ఒక కంతి పెరింగింది. కాస్త పెద్దదే. చాలా మంది ఆడవాళ్ళకు ఇలా అవుతుందని డాక్టరు చెప్పారు. అయితే ప్రమాదకరమైన కేన్సర్ కంతి అవునో కాదో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆ కంతిని తాను చూస్తానని కేట్ చెప్పింది. ఆపరేషన్ జరిగింది…ఆ కంతి కేన్సర్ కాదు. కాస్త పెద్ద కంతి డాక్టర్ ఆపరేషన్ చేసి తీశారు. గుండ్రంగా పైన ఎర్రని వెంట్రుకలతో చిక్కులుపడిన ఊలుదారం ఉండలా కనిపిస్తోంది. 

              ఒక సీసాలో ఫార్మల్ ఫైడ్ తెప్పించి ఆ కంతిని ఆందులో పెట్టి తనతోపాటు ఇంటికి తెచ్చుకుంది. స్టఫ్పుడు టాయ్స్ లాంటిదే కదా అది కూడా. కాని గెర్ కి అది ఇష్టం లేదు. మామూలుగా అయితే కొత్తదనం పట్ల ఆసక్తి చూపిస్తాడు. కాస్త చిరాకు మనిషి. ఆపరేషన్ తర్వాత తాను రాగానే ఈ కంతిని చూసి బయట పారేయమన్నాడు. చాలా అసహ్యంగా వుందన్నాడు. కుదరదు ఇది నాతోనే వుంటుందని కేట్ చెప్పేసింది. టేబుల్ పైన గేర్ తెచ్చిచ్చే వాడిపోయిన పూలకన్నా ఈ కంతి దాచిన సీసా బాగుందని చెప్పింది. ఆపరేషన్ కోసం ఎలా కోశారో…కుట్లువేసిన చోట పగిలిపోయేలా వుంది చూస్తావా అంది కేట్. ఇప్పుడొద్దులే అన్నాడు. గెర్ కి ఇలాంటివి అస్సలు ఇష్టం వుండదు. రక్తం చూస్తె కళ్లుతిరుగుతాయి. రెండేళ్ళక్రితం భార్యకు బిడ్డపుట్టినప్పుడు ఆ రక్తస్రావం చూడలేక బయటకు పారిపోయాడు. కేట్ ఒక సిగరెట్ వెలిగించి పొగ గట్టిగా పీల్చి గెర్ ముఖంపైన ఊదాలనుకుంది. అతని చేతిలో డ్రింక్ వుంది. ఆమె చేతిని పట్టుకున్నాడు Good by Gerald అంది అతని పూర్తి పేరు పలుకుతూ…కాస్త వ్యంగంగా.

                వాళ్ళిద్దరు కలిసినప్పుడు అతనిపేరు గెరాల్ట్. ఆ పేరు నెమ్మదిగా కేట్ మార్చేసింది. మొదట గెర్రిగా, తర్వాత ఇంకా పొట్టిగా గెర్ చేసింది. అతను ధరించే దుస్తులు, బూట్లు, హెయిర్ స్టయిల్, ఆహార ఆలవాట్లు, అన్ని మార్చేసింది. ఇప్పుడతను పాత గెరాల్డ్ కాదు. నిజానికి కేట్ కూడా అలాగే మారిపోయిన మనిషి. ఆమె చిన్నప్పుడు అసలు పేరు కేథరిన్. చిన్నప్పుడు తన పేరు చాలా బాగుంటుందనుకుంది. కాని హైస్కూలుకొచ్చేసరికి కేథరిన్ పాతవాసన కొడుతుందనిపించింది. అందుకే కేథీ గా మారిపోయింది. ఫ్యాషనబుల్ గర్ల్ కేథీ అయ్యింది. యూనివర్సిటికి వచ్చేసరికి తనపేరు మరింత కుదించి కేత్ అయ్యింది.  ఇంగ్లండు చేరాక కేట్ గా మారింది. ఇంగ్లండు లో పైకెదగాలంటే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునేలా ఏదోఒకటి చేయాలిమరి. తన పేరువల్లనే ఉద్యోగంలో సెలక్టయ్యాననుకుంటుంది. ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ లో ఉద్యోగం. నెమ్మదిగా ఉద్యోగంలో పైకెదిగింది. కాని ఆమె అనుకున్నంత జీతం ఆ మ్యాగజైన్ వాళ్ళు ఇవ్వటం లేదు.

         రెండుసార్లు అబార్షన్ చేయించుకోవలసి వచ్చింది. ఎందుకంటే ఆ మగాళ్ళు ఆమె అనుకున్న స్ధాయిలో లేరు. అసలు తనకు పిల్లలు అవసరమా అనుకుంది. కాని జీవితం చాలా పెద్దదిగా కనపడింది. వయసు ముప్పై దాటిపోతోంది. భవిష్యత్తులో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. గెరాల్డ్ తో పరిచయం కాక ముందు విషయమిది. 

         గెరాల్డ్ ఆమెను కలసినప్పుడు మీరు చాలా అందంగా వున్నారు…అన్నాడు. అలాంటి మాటలు వినాలనే ఆమె కూడా కోరుకుంది. టోరంటోలో ఒక ఫ్యాషన్ మేగజైన్ ప్రారంభిస్తున్నారని, అందులో చేరమని కొరాడు. టోరంటో చాలా పెద్ద నగరమని అక్కడ చాలా బాగుంటుందని నచ్చచెప్పాడు.  మాటల్లో మీపేరు కేట్ అంటే అర్ధమేంటని అడిగాడు. కేట్ అంటే కిట్ కేట్ లాంటి పదం… నోట్లో వేసుకోగానే కరిగిపోయే చాక్లెట్ లాంటిది అని జవాబిచ్చింది కేట్. 

అలా గెరాల్డ్ ఇచ్చిన ఆఫర్ ని ఒప్పుకున్న కేట్ అతని ఆఫీస్ లోనే అతన్ని వశపరచుకుంది. గెరాల్డ్ ఆపీసులో అతని భార్య ఫోటో ముందే ఆమె లోదుస్తులు చూశాడు. లండన్ లో అయితే 

గెరాల్డ్ లాంటి మగాళ్ళను ఆమె పెద్దగా పట్టించుకునేది కాదు. మాటకారి కాదు, పెద్దగా తెలివైనవాడు కాదు, హాస్యంగా మాట్లాడలేడు, తనకన్నాఎనిమిదేళ్ల పెద్దవాడు. అలాంటివాడు తనకు కేట్ దొరకడం నమ్మలేకపోయాడు. అతని భార్యను కేట్ కంపెనీ మీటింగులలో కలుస్తుందుంది. తన భర్త పక్కన దర్జాగా నుంచుని కేట్ కి ఏదో చెప్పాలనే ప్రయత్నం కనిస్తుంటుంది. 

                 మాగజైన్ కొత్తగా పెట్టినదైనా పాఠకాదరణ పొందింది. కేట్ కు జీతం పెరింగింది. కాని గెరాల్డ్ చెప్పినట్లు తనకు పూర్తిగా స్వేఛ్చగా పనిచేసే అవకాశం దొరకలేదు. బోర్డ్ డైరెక్టర్లను కన్విన్స్ చేయవలసి వచ్చేది. డైరెక్టర్లు కాస్త పాతకాలం ఆలోచనలతో చాలా నెమ్మదిగా పనిచేసేవారు…కేట్ సరికొత్త ఐడియాలతో దూసుకుపోయే మనిషి. 

                కేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన తరువాత గెరాల్డ్ ఆమెను కలసి వెళ్ళిపోయూడు. గెరాల్డ్ వెళ్ళిపోయాక కెట్ పచార్లు చేస్తూ ఆలోచిస్తోంది. కుట్లుకాస్త నొప్పిగా వున్నాయి. ఆకలిగా వుంది…కాని తినాలని లేదు. అసలు తాను మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చిందో అర్ధం కావడం లేదు. గెర్ అంటే ఇప్పుడు ఆమెకు చాలా అసహనంగా వుంది. అయినా అతనికోసమే తాను ఈ జీవితాన్ని ఎంచుకుందా?…

                అతని వల్ల ఇప్పుడు ఆమెకు పెద్దగా ప్రయోజనాలు కూడా లేవు. వాళ్ళిద్దరు కలసి గడిపే సమయం కూడా తగ్గిపోయింది. అతని నుంచి తనకేం కావాలో కూడా ఇప్పుడు ఆమెకు తెలియదు…తనకు ఇంతకన్నా మంచి అవకాశాలున్నాయని, తన ప్రతిభకు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని అనుకుంటోంది. ఆమె మరో మగాడితో సన్నిహితంకాలేదు, అలా చేయలేదు కూడా, ఒకటి రెండు సార్లు ప్రయత్నించింది కాని తన వల్ల కాలేదు. బహుశా లండన్ చాలా గుర్తొస్తోంది. ఈ దేశంలో బందీలా అయిపోయింది. ఇక్కడ చాలా ఉక్కిరి బిక్కిరిగా వుంది. ఆసుపత్రిలో ఆమెకు వచ్చిన పూలన్ని వాడిపోయాయి. గెరాల్డ్ తను ఆసుపత్రిలో వున్నప్పుడు ఎందుకు రాలేదు, మరచిపోయాడా? ఆసుపత్రి నుంచి తాను సీసాలో తెచ్చిన కంతిని చూస్తూ మాట్లాడడం ప్రారంభించింది.

‘వెంట్రుకల బంతి… నువ్వు మాట్లాడితే బాగుండు. ఇక్కడ ఉన్న చాలా ముంది కన్నా నువ్వన్నా కాస్త తెలివిగా మాట్లాడతావు’ అంది. ఆ కంతి పళ్ళు మెరిసి ఇక మాట్లాడుతుందేమో అనిపించింది. 

                  ఆమెకు జ్వరం వచ్చినట్లుంది. ఏదో చెడు జరుగుతుందేమో అనిపిస్తోంది. మేగజైను నుంచి ఫోన్లేమీ రాలేదు. తాను లేనప్పుడు వాళ్లేమి చేశారో… రాజ్యంలో అధికారమున్న రాణి సెలవు పెట్టకూడదు, ఆపరేషన్లకయినా సరే. సిక్త్ సెన్స్ ఏదో చెప్తోంది. తాను కూడా ఇంతకు ముందు వాళ్లు పన్నే అనేక కుట్రల్లో పాలుపంచుకున్న మనిషే కదా…  మరో వారం వరకు ఆమె ఆఫీస్ కు వెళ్ళకపోయినా పర్వాలేదు. కాని మర్నాడే గబగబా కాఫీ తాగి ఆఫీసుకు వెళ్ళింది. కారిడార్లో తనను చూసి గుసగుసలు…హల్లో హల్లో… అంటున్న వాళ్ళ మాటల్లో ఆబద్దాల నీడలు. ఆమె తన డెస్క్ కెళ్ళి మెయిల్స్ చెక్ చేసుకుంది. తల నొప్పిగా వుంది. కుట్లు కూడా నొప్పి పెడుతున్నాయి. ఆమె వచ్చిన విషయం గెర్ కి తెలిసిది. వెంఠనే ఆమెను కలవాలనుకున్నాడు. లంచ్ కోసం కాదు…

                 తన ఆఫీస్ ఛాంబర్ లో దర్ఙాగా కూర్చునివున్నాడు. ఖరీదైన ఆఫీసులో ఖరీదైన మనిషిగా  సెక్సీ మగాడిగా మారాడు. కేట్ ని చూసి మృదువుగా మొదలుపెట్టాడు… వారం తరువాత నువ్వొస్తె అప్పుడు చెప్పాలనుకున్నాను, అంతకు ముందే నువ్వొస్తావని అనుకోలేదు… అంటూ మొదలుపెట్టాడు. బోర్డాఫ్ డైరెక్టర్లు ఆమె పనితీరును మరీ విపరీతంగా ఉందని అన్నారట. అతనెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట. అతను ప్రయత్నించాడా?… జరిగివుండదు. ఒక పిచ్చి సైంటిస్టు తయారుచేసిన రాక్షసుడు ఆ సైంటిస్టు పైనే తిరగబడ్డాడు. “నేనే నీకు బ్రతుకునిచ్చాను”… అని అరచి చెప్పాలనుకుంది. 

కేట్ బలహీనంగా వుంది. నిలబడ్డం కష్టంగా వుంది. అతను కూర్చోమన్నా ఆమె కూర్చోలేదు. ఆమెకిప్పుడు అర్ధమవుతోంది… తాను కావాలనుకున్నదేమిటో, తాను కోల్పోయిందేమిటో. తాను గెరాల్డ్ ని కోల్పోయింది. ఫ్యాషన్ తెలియని, స్ధిరత్వం కలిగిన పాత గెరాల్డ్ కావాలనుకుంది. తాను తయారుచేసిన గెర్ కాదు. గెరాల్డ్… ఒక సొంత ఇల్లు.. చిన్న పిల్లాడు. అతని డెస్క్ పైన భార్య ఫోటో… ఆ ఫోటో లో తాను వుండాలనుకుంది. ఆ పిల్లవాడు తన పిల్లవాడు కావాలనుకుంది. ఇప్పుడవన్ని కోల్లోయింది. 

నాస్ధానంలో ఎవరు పనిచేస్తారు? అనడిగింది.

“నేనే చేస్తాను”  అన్నాడు నెమ్మదిగా..  

“నువ్వా” అంది… గెరాల్డ్ తన ఫోన్ బుక్ ఎడిట్ చేసుకోలేడు, మేగజైన్ ఎడిట్ చేస్తాడా? అయితే నవ్వకుండా జాగ్రత్త పడింది. 

ఎందుకంటే, నువ్వు లేనప్పుడు నీపద్ధతిలో పనిచేసే వాళ్లుండటం మంచిది కదా… అందుకే నేనే చేయాలనుకుంటున్నాను అన్నాడు. నోటితో పొగిడి నుదుటితో వెక్కిరిస్తున్నాడు. అతనంటే ఆమెకు ఇష్టం. అందుకే తనను తాను ద్వేషించుకుంటుంది. నిస్సహాయత…

అతను లేచి ఆమె వద్దకొచ్చి చేయి పట్టుకొని “నేను నీకు రిఫరెన్సు ఇస్తాను… నీకు ఉద్యోగం కోసం చూస్తాను”…అన్నాడు. 

పర్వాలేదు ఆ విషయం గురించి వదిలెయ్యండి అన్నాను. అప్పుడప్పుడు కలుస్తూ ఉందాం. “నేను చాలా మిస్సవుతాను” అన్నాడు నొక్కి పలుకుతూ…

             టాక్సీలో ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తె మెయిల్ బాక్సులో గెర్ అండ్ చెరిల్ పార్టీకి ఆహ్వానించిన ఇన్విటేషన్ వుంది. ఐదురోజుల క్రితం పంపింది. స్నానం చేసి సోఫాలో కూర్చుంది. వేరే ఉద్యోగాలున్నాయి. వేరే మగాళ్ళు కూడా వున్నారు. అయినా ఏదో కోల్పోయిన భావన. తనకిలా ఎందుకు జరిగింది. వెన్నుపోటుకోసం కత్తులు లేచినప్పుడు కత్తిపోటు తనదే అయ్యేది. ఎంత మందిని ఎదుర్కోలేదు. వెంట్రుకల బంతి వున్న సీసాను కాఫీ టేబుల్ పైన పెట్టిది. దాన్నే చూస్తూ కూర్చుంది. 

              ఆ కంతి శిశువుగా మారే అవకాశాల గురించి డాక్టరును అడిగింది. గర్భాశయం లో ఫలదీకరణం చెందవలసిన అండం పాడై అలా అయ్యిందా?…కాని డాక్టరు అలా జరగలేదన్నాడు. ఇప్పుడామె దాన్ని చూస్తూ అది శిశువుగా ఊహిస్తోంది. గెరాల్డ్ తో ఆమెకు పుట్టిన శిశువు. పూర్తిగా ఎదిగే అవకాశం దొరకని శిశువు. దాన్ని చూస్తూ “నువ్వు చాలా అసహ్యంగా వున్నావు. ఒక తల్లి మాత్రమే నిన్ను ప్రేమించగలదు” అంది. ఆమెకు చాలా బాధగావుంది. కంట నీరు ఉబుకుతోంది. చెంపలపై ప్రవహిస్తోంది. ఏడ్వడం ఆమె ఎన్నడూ చేయలేదు. 

                     అనూహ్యంగా… వెంట్రుకలబంతి ఆమెతో మాట్లాడ్డం ప్రారంభించింది. అయితే మాటలతో కాదు, కాని అందులో వాస్తవికత ఛాయలున్నాయి. అవి బొమ్మలు కాదు. ఆమె తన గురించి వినడానికి ఇష్టపడని విషయాలన్ని చెప్పింది.  చాలా విలువైన చీకటి సమాచారం, చాలా ఆవసరమైనది. ఆమె తలూపింది, ఇక్కడ నేలపై కూర్చుని, ఆ వెంట్రుకల బంతితో మాట్లాడుతూ ఏం చేస్తున్నావు? నువ్వొక మొద్దులా తయారయ్యావని తనకు తాను చెప్పుకుంది. నిద్రమాత్ర వేసుకుని పడుకోవాలనిపించింది. మర్నాడు కాస్త బానే వుందనిపించింది. లేఔట్ డిపార్టుమెంట్ నుంచి డానియా ఫోన్ చేసి సానుభూతి కురిపించాలనుకుంది. కేట్ ఆ సానుభూతి వద్దనుకుంది. కేట్ అనైతిక జీవితం వల్లనే ఉద్యోగం పోయిందని డానియా చెప్పింది. కేట్ తగిన జవాబిచ్చింది. ఇప్పుడు అనైతికత గురించి ఆలోచించే పరిస్ధితిలో తను లేదు. లేచి నడుస్తూ చెరిల్ గురించి ఆలోచించసాగింది. గెరాల్డ్ భార్య హోదాలో దర్పాన్ని ప్రదర్శిస్తుంటుంది. ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలోంచి తీసేసి గెరాల్డ్ తనను పూర్తిగా వదిలించుకున్నాడు.  కేట్ బయటకు వెళ్ళి చాక్లెట్లు తెచ్చుకుంది. ఆ వెంట్రుకల బంతిని సీసాలోనుంచి బయటకు తీసి ఎండబెట్టింది. చాక్లెట్ పౌడర్ దానిపైన చల్లింది. గోధుమరంగు పొర ఏర్పడింది. దాన్ని టిన్ ఫాయిల్ లోచుట్టి టిష్యు పేపరులో పెట్టి చాక్లెట్ బాక్స్ లో ప్యాక్ చేసింది. ఆ బాక్సును గిఫ్ట్ బ్యాగ్ లో పెట్టింది. ఇది ఆమె పంపే కానుక. ఒక విలువైన, ప్రమాదకరమైన కానుక. కార్డుపైన “గెరాల్డ్ సారీ… నీతో నేను ఉండలేను, ఇదే నాదగ్గర నీదంటూ మిగిలింది అంతా…ప్రేమతో… కే”అని కార్డుపై తన సందేశాన్ని రాసింది.

                  అక్కడ పార్టి మంచి ఊపుమీదుంది. అంత ఖరీదైన బ్యాగులో వచ్చిన కానుకను చరిల్ తీసుకోకుండా ఉండటం సాధ్యపడదు. అందరిముందు విప్పి చూస్తుంది. అందరిలోను అనుమానాలు వస్తాయి. ప్రశ్నలు వస్తాయి. రహస్యాలు బయటపడతాయి. 

                 కిటికి బయట మంచుకురుస్తోంది. కోటు తొడుక్కోని పిచ్చిదానిలా బయటకు వచ్చింది. కాస్త దూరం నడవాలనుకుంది. ముఖంమీద మంచు కురిసి కరిగిపోతోంది. చిన్న చిన్న మేళ్ళు తాకినట్లు…కేట్ గెర్ కి చాలా కోపం వచ్చే పనే చేసింది. కాని ఆమెకు తప్పు చేసిన భావన లేదు. చాలా ప్రశాంతంగా వుంది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.