
తండ్రీ, కూతురూ
-చెరువు శివరామకృష్ణ శాస్త్రి
ఆనాడు అల్లరి చేసే పిల్ల
ఈనాడు చల్లగ చూసే తల్లి
ఆనాడు ముద్దులొలికే బంగరు బొమ్మ
నేడు సుద్దులు చెప్పే చక్కని గుమ్మ
నీ పసితనమున నీకు అన్నం తినిపించబోతే
నీ చిన్ని చేతులతో తోసి వేసినావు
మారం చేసినావు, హఠం చేసినావు
కథలూ కబుర్లు చెప్పి, నిను మాయ చేసినాను.
కాలము కరుగగ, ఈ మలి వయసులో
చేయూత నిచ్చావు, నాకు అన్నం తినిపించావు
చదువు కోకుండా, ఆడుతూ పాడుతూ, అల్లరి చేస్తూ నీవా నాడు
చేసిన గోలకి మందలింపు లందించాను
నేడు నాకే పాఠము నేర్పే విద్య నేర్చావు.
నీ బుడిబుడి నడకలతో పరిగెడుతూ తడబడి పడిపోతే,
కలవరపడుతూ మందు రాసినానే, మందలించినానే.
నేడు నా అడుగులు పడక, నే తడబడుతుంటే
కడు దూరము నుండి కదలి వచ్చినావే
మందులందించి నావే, మమతలు పంచినావే.
నీ ఋణమెట్లా తీర్చేది?
మరణము తర్వాత, జననము వుంటే,
మళ్ళీ నీ కడుపున పుడతా తల్లీ!
*****

చెరువు శివరామకృష్ణ శాస్త్రి
నివాసము : హైదరాబాదు.
చదువు : B.Sc. ఉస్శానియా విశ్వ విద్యాలయము., M. A ( తెలుగు ) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయము.
వృత్తి: రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ .

Nice poem.
బావుంది. సున్నితంగా వుంది.
మీ ప్రోత్సాహమునకు ధన్యవాదములు ప్రసాదు గారూ!
శ్రీమతి గీత గారికి ధన్యవాదములు
Thanks Sivarama Krishna Sastry garu!
ధన్యవాదములండి