
మంకుపట్టు
-వసంతలక్ష్మి అయ్యగారి
కాంతమ్మ వీర్రాజులకు యిద్దరమ్మాయిల తరువాత ఒకబ్బాయి. కాంతమ్మ గారిది కళైన ముఖం. వీర్రాజుగారు ఆజానుబాహువుడు.ఎగువమధ్యతరగతి కుటుంబం. పిల్లలంతా మంచి చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు.ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్లూ యీడురాగానే జరిపారు. అబ్బాయి పెళ్లికొచ్చాయి తిప్పలు. ఆరడుగుల అందగాడు. ఓమోస్తరు ఉద్యోగం. వీర్రాజు గారు తమవైపుబంధువులపెళ్లిళ్లెన్నో మధ్యవర్తిత్వం జరిపి చేయించిన ఘనతకలిగినవారు.స్వంతానికి కొడుకుపెళ్లి విషయంలో బొత్తిగా విఫలమవడం బంధుమిత్రులందరినీ ఆశ్చర్యంలో ముంచింది. కాంతమ్మగారిది ప్రతి విషయంలోనూ అవసరానికి మించి వంకలుపెట్టే గుణం. దొడ్డచేయి. పెట్టుపోతలు అన్నీ బ్రహ్మాండం. కూతుళ్ల పెళ్లిళ్ల లోనూ వియ్యాలవారితో చిరువంకలతో చిర్రుబుర్రులాడిన సందర్భాలు లేకపోలేదు. వీర్రాజుగారి మాటకారితనంతో గట్టెక్కుతూ వచ్చారు. తీరా కొడుకు పెళ్లి విషయంలో సరిగ్గా పుష్కర కాలం పెళ్లిచూపులప్రహసనాలకే సరిపోయింది. ఓపక్క కూతుళ్లిద్దరూ నచ్చచెప్పినా యేదో వంకతో… ముక్కు చట్టిదనో… పిల్లపొట్టిదనో… రంగుతక్కువనో… జుట్టు యెరుపనో… కళ్లు లోతనో.. నడుము లావనో…చెడగొట్టి పిల్లవాడికంటూ చాయిస్ లేకుండా చేసేవారు.కొన్ని సంబంధాలకైతే చూపులకెళ్లి.. ఆవిడపక్కన పిల్లని నిలబడమనడం… నడచిచూపమనడం..వంటి పాతకాలపు చేష్టలతోపాటూ చేతిలో యెప్పుడూ టేపు కూడా తీసుకెళ్లి నిర్మొహమాటంగా ఆమ్మాయిని కొలిచిపారేసి తనుకోరిన హైటుకి యించిలు కాదు మిల్లీమీటర్లుతేడావున్నా తిరస్కరించేవారు. కొన్ని జాతకాల్లోనే వీగిపోయేవి. వీర్రాజుగారికి అందులోనూ ప్రావీణ్యం ఉండడంతో … మిగతా అన్నిబాగుండి.. జాతకాలు కలవని పక్షంలో పిల్లవాడిజాతకాన్ని కాస్త మతలబుచేసి మార్చేసైనా పెళ్లి చేయడానికి సిద్ధ పడేవారు రానురాను.వివాహవేదికల చుట్టూ తిరగడమే వారి ఏకైక వ్యాపకమైంది.ఇలా అబ్బాయికి ముప్ఫై యెనిమిదొచ్చేశాయి. తల్లిదండ్రులు నోములూ పూజల పిచ్చిలో పడిపోయారు.లక్షవత్తులనోమనీ..చి
****

అయ్యగారి వసంతలక్ష్మి
24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను.
హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను.
పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా 2010 లో గావించాకా పలు టీవీ చానెళ్లలో రాజకీయాలపై ప్రసారమైన కామెడీ కార్టూన్లలో పలువురు మహిళా నాయకుల .. మరెందరో యితరకార్టూన్ క్యారెక్టర్లకు గళపోషణ గావించి తెలుగురాష్ట్రాల్లో ఏకైక మహిళా మిమిక్రీ కళాకారిణి గా పేరు తెచ్చుకున్నాను.
సంగీతమంటే ప్రాణం. వంటిల్లు వదలడం అంటే బాధ!లలితమైనా శాస్త్రీయమైనా ..పాట విని నేర్చుకుని పాడగలిగే ప్రతిభ వుంది. ప్రస్తుతం యేడాదిగా వసంతవల్లరి పేరున యూట్యూబ్ చానెలు పెట్టి పలువురు ప్రముఖుల కథలను నా గళంలో అందిస్తున్నాను.

వసంత గారు, మీరు రాసిన ‘మంకు పట్టు’ కధ వంటివే కొన్ని నేను అమెరికాలోనూ చూసాను. మీ రచన శైలి సాఫీగా చక్కగా సాగింది. అవును ఇటువంటి వ్యక్తిత్వాలు స్త్రీలలో ఎక్కువగా నేను చూసాను. వయసుతో నిమత్తం లేకుండా అలా మొండిగా తమ చుట్టూతా ఉన్న వారిని బాధపెడుతూ, అవాంతరాలు కల్పిస్తూ జీవించేస్తారు.. మరి మీ రచన లోని కాంతమ్మ గారు మరి వృద్దాప్యాన్ని ఎలా గడుపుతారో .. మంకు పట్టు వీడకపోతే…
నేను కూడా నాకు తెలిసిన సంఘటనల ఆధారంగా ఇలా సాఫీ గా చక్కగా రాసే inspiration ఇచ్చింది మీ రచన.. బాగుంది.. శుభాకాంక్షలు మీకు.
ఉమాభారతి
స్త్రీల శత్రువులలో స్త్రీలు కూడా ఉన్నారని బాగా చెప్పారు
మీ కథ చదివాను.
కథ బాగుంది, కానీ హాస్యం ఎక్కడా కనపడలేదు.బహుశః హాస్యాన్ని ఆస్వాదించడం లో, నా లోపమే ఎక్కువ పాల్లు వుండి వుండ వచ్చు.మీకు అభినందనలు.
వసంత గారూ ఇప్పుడే మీ కథ చదివాను. బాగుంది. అబ్బాయి పెళ్లి ప్రహసనం గురించి చక్కగా రాశారు. కష్టమని అనుకునే ఆడపిల్లల పెళ్ళిళ్ళు త్వరగా చేసి గట్టెక్కి, అబ్బాయి పెళ్లి కి పెళ్లి చూపులతోనే మాత్రం పుష్కర కాలం వెళ్ళబుచ్చారు. మరి అబ్బాయి పెళ్లి అంటే మాటలా? ముఖ్యంగా హైటు విషయంలో చాలా మంది పట్టిన పట్టు విడవరు. బెండకాయ ముదిరినా.. అన్న సామెతలాగా 38 సంవత్సరాల వయసులో పెళ్లి కొడుకుగా పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. కానీ తెలుగు రాని , తెలుగు ప్రాంతం కాని తెలుగమ్మాయి కాని రాజస్థానీ అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఆ తరువాత అత్తా కోడళ్ళ మధ్య తలెత్తే పోట్లాటలు ఒక చోట వుంటే ఎక్కడైనా మామూలే! ఇక పరాయి భాష వచ్చిన అమ్మాయి అయితే మరీనూ. సర్దుబాటులేని అత్త కోరి తెచ్చుకున్న కష్టాలు .. అని చెప్పారు.
సర్దుబాటు తనం లేకపోతే సంసారం అల్లకల్లోలమే అని చెప్పారు. సాధారణంగా అందరూ అమ్మాయిల పెళ్లి కష్టాలు కథలుగా రాస్తారు. మీరు అబ్బాయిల పెళ్లి కష్టాల గురించి చెప్పారు.