
మజిలీ
(‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ఏప్రిల్ 6, 2021న ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)
– క్రాంతి కుమార్
అమ్మ కడుపులో ఆవిరైన ప్రాణాలు…ఆశల ఊహల్లో కరిగిపోయిన కలలు… అపార్థాలు మధ్య నలిగి పోయిన జీవితాలు…అవసరాల మధ్య కనుమరుగైన బంధాలు… చదువు కారాగారంలో బందీ అయిన బాల్యం…కామపు కోరలలో చితికి పోయిన అతివ భవితవ్యం… భయాల మధ్య అంతరించిన ప్రేమలు…పరువు బరువుతో గాయపడిన హృదయాలు… ఎన్నెన్నో చూస్తున్నా లెక్కకు అందని తప్పులు….మరెన్నో వింటున్నాలెక్కలేనన్ని ఘోరాలు…. మార్చాలని చూస్తున్నా… నే మార్చలేక నిలుచున్నా…మార్పు కోసం ప్రయత్నిస్తున్నా జీవిత ప్రతి మజిలీలో….
*****

మా ఊరు కడప, ఇక్కడే పంచాయితీ రాజ్ లో జాబ్ చేస్తున్నాను. తెలుగు సాహిత్య ప్రపంచంలో రీడర్ గా ఉన్న నేను ఇప్పుడిప్పుడే కవితలు రాయడం నేర్చుకుంటున్నాను. నేను రాసిన తొలి కవితకే మొదటి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది.
