నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం!

-ఎడిటర్

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ  ప్రత్యేక రచనలకు ఆహ్వానం:

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవం (జూలై 10, 2021) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం, ట్రావెలాగ్ ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. అందులో నుంచి ఒక ఉత్తమమైన రచనకు రూ.1000 (వెయ్యి రూపాయలు) పారితోషికంతో బాటూ “నెచ్చెలి ఉత్తమ రచన అవార్డు” ప్రదానం ఉంటుంది. ఉత్తమ రచన ఎంపిక, అవార్డు ప్రదానం వివరాలు ఆగస్టు సంచికలో వెలువడతాయి. నెచ్చెలి సంపాదకుల ఎంపిక మాత్రమే కాక పాఠకుల ప్రతిస్పందనని బట్టి కూడా ఉత్తమ రచన ఎంపిక జరుగుతుంది. ప్రత్యేక రచనలు జూలై సంచికలో ప్రచురించబడ్డాక ప్రతీ పోస్టు పై వచ్చిన కామెంట్ల సంఖ్య, ఉత్తమ వ్యాఖ్యల సారాంశాన్ని బట్టి అవార్డు ప్రదానం జరుగుతుంది.  ప్రత్యేక సంచికలో రచన ప్రచురితం కావాలన్నా, నెచ్చెలి అవార్డుకి ఎంపిక కావాలన్నా ఈ క్రింది అంశాలు తప్పనిసరిగా పాటించాలి.     

1. రచనలు పంపేవారు విధిగా నెచ్చెలి పత్రిక (https://www.neccheli.com/) కు, నెచ్చెలి యూట్యూబ్ ఛానెల్ (https://www.youtube.com/channel/UCk6zjjpWUJW2g4zTCVtPJOg/featured) కు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇవి రెండూ పూర్తిగా ఉచితం.
2. రచన  ఈ – మెయిలు పంపే ముందే మూడు విశేషణాత్మక కామెంట్లు నెచ్చెలిలో డైరక్టుగా పోస్టు చెయ్యాలి. కామెంట్లు పోస్టు చెయ్యడానికి నిబంధనలు:- ఇప్పటి వరకు నెచ్చెలిలో వచ్చిన విభిన్న ప్రక్రియల్లో రచనలు, నెచ్చెలి ఛానెల్లో వీడియోల నుంచి మీకు నచ్చినవి ఏవైనా మూడింటిని ఎంచుకుని ప్రతీ రచనకూ కామెంటు రూపంలో ఒక పారాగ్రాఫులో చిన్న విశ్లేషణ పోస్టు చెయ్యాలి. కామెంటులో విధిగా మీ పేరు రాయాలి. పేరు లేని కామెంట్లు లెక్క పెట్టబడవు.  రచనతో బాటూ మీరు కామెంటు చేసిన రచన పేరు, కామెంటు చేసిన తేదీ విధిగా ఈ-మెయిలులో రాయాలి. కామెంటు ఆయా రచనల దగ్గర  పోస్టు మాత్రమే చెయ్యాలి. ఈ-మెయిలులో పంపకూడదు. 
3. కథ, కవితలకు ఇప్పటి సమాజంలో స్త్రీల సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా ఉండాలి. వ్యాసం, ట్రావెలాగ్ లకు వస్తు నియమం లేదు.  
4. వస్తువు, శైలి, ఎత్తుగడ, ముగింపులలో కొత్తదనానికి ప్రాధాన్యతని ఇచ్చే రచనలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. 
5. మీ రచన విధిగా యూనికోడ్ లో ఉండి వర్డ్ (లేదా) గూగుల్ డాక్ లో పంపాలి. రచన A4 లో పది పేజీలకు మించకూడదు.
6. రచనతో బాటూ విధిగా రచన మరెక్కడా ప్రచురితం కాలేదని, పరిశీలనకు పంపబడలేదని హామీ పత్రం జతచెయ్యాలి.
7. విధిగా మీ ఫోటో, ఒక పారాగ్రాఫులో మీ గురించి వివరాలు యూనికోడ్ లో రాసి జత చెయ్యాలి.
8. రచనలు చేరవలసిన చివరి తేదీ- జూన్ 12, 2021. గడువు తర్వాత చేరినవి పరిశీలనలోకి తీసుకొనబడవు. 
9. ఒక్కొక్కరు ఒక ప్రక్రియకు ఒక రచన చొ||న అన్ని ప్రక్రియలకూ రచనలు పంపవచ్చు.    
10. ఈ-మెయిలు మీద సబ్జెక్టు “నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక-2021” కి అని రాసి editor.neccheli@gmail కు పంపాలి.  
11. ఇంగ్లీషులో పంపే రచనలు అనువాదాలైనా కూడా స్వీకరించబడతాయి. మూల రచన, రచయిత వివరాలు, మూల రచన ప్రచురణ వివరాలు విధిగా జత పరచాలి. అనువాదాలు ఎక్కడా ప్రచురితం కాలేదని హామీ పత్రం జతపరచాలి. పైన తెలుగు రచనలకు ఇచ్చిన  నిబంధనలు అన్నీ పాటించాలి. 
12. ప్రత్యేక సంచికకు ఎంపిక కాని రచనలు సాధారణ ప్రచురణకు స్వీకరించబడి నెచ్చెలిలో నెలవారీ సంచికలో ప్రచురింపబడతాయి. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. 

*****

Please follow and like us:

21 thoughts on “నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం!”

  1. ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు గీతగారు.

  2. నమస్తే గీత గారు.మిమ్మల్ని జూమ్ మీటింగ్ లో 2,3 సార్లు చూసాను.మొన్న మీ కావ్యగానం కూడా విన్నాను.మీరు తెలుగు సాహిత్యానికి చేస్తున్న కృషి గొప్పది.అభినందనలు.నెచ్చెలి పత్రిక ఒకసారి చూసాను.బాగుంది.నేను రచనలు పంపొచ్చా…

    1. తప్పకుండా పంపండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  3. నేను ప్రతి నెలా మన నెచ్చెలి పత్రికను చదువుతూ ఉంటాను.ఇందులో ఎన్నో అంశాలు చాలా బాగుంటాయి.ముఖ్యంగా నెచ్చెలి పత్రిక ఆశయాలు చాలా నచ్చాయి. స్త్రీలకు సంబంధించిన కథలు, కవితలు వ్యాసాలు, , అనువాద కథలు నాకు ఎంతగానో నచ్చాయి.
    ఈ నెలలో వచ్చిన అనువాద కథ పద్దతి చాలా బాగుంది. అనువాదం అని ఎక్కడా అనిపించలేదు.

  4. ఈ పోటీకి పురుషులు కూడా రచనలు పంపొచ్చా మేడం?

    1. తప్పకుండా పంపవచ్చు భానువర్ధన్ గారూ!

  5. నమస్కారం గీత గారు మిమ్మల్ని అడపదడపా ఇతర సంఘాల webinars లో చూశాను నేను పత్ర సమర్పణ చేసిన కొన్ని యూనివర్సిటీ వెబినర్స్ లో కూడా చూశాను. ఈ విధంగా గా మీతో పరిచయం ఏర్పరచుకోవడం ఆనందంగా ఉంది.
    మీ నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ సంచిక విడుదల కై రచనలు నేను కూడా పంపాలి అనుకుంటున్నాను మీ గైడ్ లైన్స్ చదివాను సంతోషం. ఒక చిన్న సందేహం ఏ ఫోర్ సీట్స్ 10 పేజీలు ఉండాలన్నారు కదా అవి వి6 డాక్యుమెంట్ లో టైప్ చేశాకనా లేక చేతితో రాసిన ఫార్మాట్లో పది పేజీలు ఉండాలా సందేహం తీర్చగలరు ధన్యవాదాలు
    డాక్టర్. సి .ఉదయశ్రీ
    చెన్నై

    1. ఉదయశ్రీ గారూ! టైప్ చేశాక 10 పేజీల లోపు ఉండాలండి.

  6. నెచ్చెలి,
    మీతో పరిచయం naskishtamae
    టైపింగ్,పోస్టింగ్ ఈ రెండూ నాకంత రావు..అందుకని ఈ దూరం..
    Corona సెలవుల్లో ..ఎలాగైనా సరే
    నీతో ప్రయాణం చేద్దామని ..

  7. 🙏🙏నమస్కారం అండి….
    నా పేరు నాగాశ్రీ రవీంద్ర.
    నేను ఈ మధ్యే నెచ్చలి పత్రికని చదవటం ప్రారంభిచాను. నాకు నెచ్చెలి పత్రికలో,, రచనలలో/కవితలలో ఆ రచన శైలి, అర్థవంతమైన భాషా శైలి నాకు బాగా నచ్చింది. నాకు సాహిత్యం పట్ల ఇంకా మక్కువ పెరిగింది. ఈ పత్రికలో నాకు వ్రాసే అవకాశం కై వేచిచూస్తున్నాను. నెచ్చలి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. 🙏🙏

    1. తప్పకుండా నాగాశ్రీ గారూ! నెచ్చెలి మీకు నచ్చినందుకు సంతోషం. వార్షికోత్సవ సంచిక నిబంధనలకు లోబడి రచనలు పంపితే మీకు అందులో చోటు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది.

  8. నా పేరు యాదగిరి. నేను చాలాసార్లు నెచ్చెలి పత్రిక గురించి విన్నాను. మా మిత్రులు విజయకుమార్ గారు నాకు ఈ లింక్ పంపారు. వారునేను కలసి పనిచేసాం.ఇద్దరి భావాలు ఒక్కటే. నేను కూడా చిన్న చిన్న కవితలు రాస్తుంటాను. కానీ అవి ప్రచారం చేయదలచుకొక అలానే ఉన్నవి. మీ పత్రిక చూసాక నాకు ఎందుకో సభ్యున్ని కావాలనుకున్నాను. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మీ అనుమతి కోరుతున్నాను.

  9. I too like the concept of “నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనల” పోటీ.. అందులో పాల్గొనాలనే ఆశిస్తున్నాను. ‘చదివిన కధలు కూడా బాగున్నాయి.. చక్కని సాహిత్య పత్రికను ముందుకు తీసుకువెళుతున్న గీత గారికి అభినందనలు.

    1. థాంక్స్ ఉమాభారతి గారూ. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

  10. నా పేరు సంధశర్మ ,నేను చాలా రోజులుగా నెచ్చెలి పత్రికను చదువుతున్నాను. ఇందులో కథలు చాలా బాగున్నాయి. అద్భుతమైన భావన ,బాధను మిళితం చేసే వారి రచనా శైలి నాకెంతో ఇష్టం.
    నెచ్చెలి లో నాకు వ్రాసే అవకాశం కోసం ఎదురు చూస్తూ వున్నాను. ఇపుడు ,ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆ.అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. 🙏🙏

    1. నెచ్చెలి మీరు చదువుతున్నందుకు కృతజ్ఞతలు సంధ్య గారూ. నెచ్చెలికి తప్పకుండా పంపండి. ప్రచురణకు అర్హమైనవైతే ప్రచురిస్తాం.

  11. బాగున్నాయి మీనిబంధనలు. వ్యాఖ్యలవిషయం నాకు నచ్చింది. అనువాదాలవిషయంలో మూలరచయితల అనుమతి కూాడా అవుసరం అనుకుంటాను. మీఆలోచనకు జేజేలు.

    1. I am happy that you like the idea anDi. Comments mandatory is to encourage commenting anDi. And for the translations, we always ask for the original writer’s permission if the article is sent by the translator.

Leave a Reply to వురిమళ్ల సునంద, ఖమ్మం Cancel reply

Your email address will not be published.