నవ్వుల్ నవ్వుల్ -వసంతలక్ష్మి అయ్యగారి ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు.. జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. . ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” అనమాట!!![దయచేసి జోకునుగ్రహించవలెనహో!]ప్రమోషను అంతవరకూ తీసుకోలేదు… ఆయనవద్ద నేను విని..మేధోమథనం కావించుకున్న కొన్నిమధురాలనుమీతో పంచుకుంటాను..సరేనా!!okay…. నెలపొడుగునా సిబ్బంది లీవులు పెడుతూనేఉంటారుకదా..మామూలే..అటెండెన్సు రిజిస్టరుచూసుకుంటూ..లీవులెటర్లుఇవ్వని వారందరినీ పేరుపేరునా కలిసిమర్యాదపూర్వకంగా అడిగి..ప్రింటెడు లెటరు మీద వారి పేరుతోపాటురాని తేదీలను రాసిచ్చిమరీ వారి సంతకాలడిగేవారు…పాపం ఈచాదస్తపు పెద్దమనిషి.ఈపని పూర్తయ్యాకా లీవు పుస్తకంలోకి ఎక్కించివారివారి ఖాతాలకు కొయ్యాలనమాట..చేసిన పనిని బాసుగారికిచెప్పేసుకుంటే ఓపనిఅయిపోయినట్టు. సదరు గుమాస్తా గారు బాసువద్దకు వెళ్ళి..“సార్..no pending papers with me ….all promotion eligible files putupped…… boss: what about leave record?have u updated it? గుమాస్తా: yes Continue Reading