పరమాన్నం

(‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)

-కమలశ్రీ

అర్థరాత్రి పన్నెండు దాటింది. మెయిన్ రోడ్డుపై ఓ కార్ శరవేగంగా వెళుతోంది. కారు డ్రైవ్ చేస్తున్న నలభై అయిదేళ్ళ రఘునందన్ కి ఎంత త్వరగా ఇల్లు చేరుతానా! అన్నట్టు ఉంది.  పక్కనే ఉన్న  సిటీ లో ఓ బిజినెస్ మీటింగ్ కి ఎటెండ్ అయ్యి రిటర్న్ అయ్యే సరికి కాస్త ఆలస్యం అయ్యింది. 
 
ఆ మీటింగ్ స్పాట్ తమ సిటీ కి దూరంగా ఉండటంతో అతనికి ఆకలి విపరీతంగా వేస్తుంది.
 
పోనీ కార్ లో ఏవైనా ఫ్రూట్స్ ఉన్నాయేమో చూశాడు. ఏమీ లేవు. జనరల్ గా ఇలాంటి మీటింగ్ లకు వెళితే ఫ్రూట్స్ కార్ లో పెట్టుకుంటాడు… ఇప్పుడు అవేవీ లేకపోవడంతో ఆకలికి తట్టుకోవడం అతని వల్ల కావడం లేదు. 
 
ఎక్కడా ఆపకుండా ఏకధాటిగా కార్ ని డ్రైవ్ చేసిన అతను ఓ పది నిమిషాల తర్వాత కార్ ఆపుదామనే లోపే  కార్ ఆగి పోయింది. కార్ బోనెట్ తెరిచి చూశాడు. సమస్య ఏంటో  అర్థం కావడం లేదు.
 
‘అసలే ఆకలి చంపుతుంటే ఈ కార్ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా?’ అనుకుంటూ. 
 
‘ఆ రాత్రికి అందులోనే జాగారం’ అనుకుంటూ కార్ ఎక్కబోతున్న అతనికి “ఎవరు బాబూ మీరూ.. ఈ సమయం లో ఇక్కడ కారు ఆపారు?.” అంటూ ఓ ముసలాయన మాటలు వినిపించాయి.
 
“అదీ పెద్దాయనా నా కార్ సడెన్ గా ఆగిపోయింది. ఏం  జరిగిందో ఏంటో అర్థం కావడం లేదు?.” అని సమాధానం ఇచ్చాడు రఘునందన్. 
 
“అయ్యో! బాబూ ఈ టైం లో మెకానిక్ లూ ఎవరుండరు. ఈ పూటకి మా ఇంట్లో ఉండి రేపు ఉదయాన్నే ఎవరైనా మెకానిక్ ని తీసుకుని వచ్చి కార్ బాగు చేయించుకుని వెళ్లిపోదురు.” అన్నాడు ఆ ముసలాయన. 
 
కాసేపు తటపటాయించి సరే అని ఆ ముసలాయన్ని అనుసరించాడు రఘునందన్. 
 
“పార్వతీ… పార్వతీ..” అంటూ పిలుస్తూ ఆ పూరింట్లోకి అడుగుపెట్టాడు అతను.ఆ ముసలాయన్నే అనుసరిస్తూ వెళ్లిన రఘునందన్ ఆ పూరింట్లో అడుగుపెట్టగానే ఆశ్చర్యంగా ఉండిపోయాడు. ఎక్కడి సామాన్లు అక్కడ పొందికగా అమర్చి ఉన్నాయి. 
 
ఓ ముసలామే  బయటకు వచ్చింది నడుం వంచుతూ నడుచుకుని. 
 
“బాబూ దీనిపై పడుకోండి.” అంటూ ఓ నులక మంచం తెచ్చాడు  ఆ ముసలామె వచ్చిన గదిలోనుంచి( ఆ పూరింట్లోనే గదులుగా చేసుకున్నారు) రఘునందన్ దానిపై కూర్చోగానే ఆ ముసలామె ఓ చిన్న పళ్లెం లో అన్నం, చారు, పచ్చడి పట్టుకుని వచ్చి “బాబూ ఈ రాత్రి పూట ఏదైనా తిన్నావో లేదో. ఈ అన్నం  తిను.” అంటూ ఓ పళ్లెం అందించింది. 
 
అది అందుకున్న రఘునందన్  కాసేపు ఆలోచించినా ఆకలికి ఆగలేక  నోట్లో ఓ ముద్ద పెట్టుకున్నాడు. చారన్నం అయినా పరమాన్నం లా అనిపించి ఆ పళ్లెంలోని అన్నం మొత్తం అరనిమిషం లో తినేసి తలపైకెత్తే సరికి ఆమె ఓ చిన్న గ్లాసుతో మజ్జిగ అందించింది.అది  తాగిన రఘునందన్   ఆ మంచంపై నే పడుకున్నాడు.
 
పొద్దున్న లేచి చూసే సరికి ఆ ముసలాయన కనపడలేదు. ముసలామె బయట ఏదో పని చేసుకుంటుంది. 
 
“అమ్మా! పెద్దయ్య ఎక్కడా?” అని అడిగితే “నీ కారు బాగు చేయించడానికి మెకానిక్ ని తీసుకు రావడానికి పట్నం పోయినాడు సైకిల్ తో.” అంటూ సమాధానం ఇచ్చింది. 
 
ఆమె కి వెళ్తానని చెప్పి కారు దగ్గరికి వెళ్లేసరికి మెకానిక్ కార్ ని రెఢీ చేశాడు. 
 
“బాబూ కారు బాగయ్యింది.” అన్నాడా ముసలాయన.
 
“థాంక్యూ పెద్దయ్యా! మీ మేలు మరువలేను.ఇదిగో ఇది ఉంచండి.” అంటూ కొంత మొత్తం అందించాడు రఘునందన్. 
 
అవి రఘునందన్ చేతిలోనే పెట్టేసి “బాబూ ఈ లోకంలో అన్నీ డబ్బుతో ముడిపడవు.ఓ మనిషి గా సహాయం చేశాను. నీకు సహాయం చేయాలనిపిస్తే ఆకలితో ఉన్నవారికి ఇవ్వు.” అంటూ వెళ్లిపోయాడాయన.
 
అతని వైపే చూస్తూ కార్ ఎక్కిన రఘునందన్ తన కార్ ని ఓ అనాధాశ్రమం వైపు పోనిచ్చాడు..

****

Please follow and like us:

3 thoughts on “పరమాన్నం (‘తపన రచయితల గ్రూప్’ మినీ కథల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కథ)”

  1. Katha lo message baagundi andi. Katha shaili mariyu kathanam pai naa konni suggestions: Katha lo main character (Raghunandan) transformation antha paiki raaledu. For example katha start lo atanni oka upper class manishiga, money minded person ga and poverty ni sahinchaleni person ga chupinchi unte, katha end ki athanu aa poor couple hospitality ki grateful ga mariyu itharulaku dabbu to kaakunda manasu to saayam chese person ga transform ayinattu chupi undachu. Deenivalla katha lo marintha balam vastundi.
    Maroka salahaa emanaga, katha starting lo chaala english padaalu – drive , fruits, city, return etc. vaadaaru. Kaani veetannitiki telugu vaaduka bhaasha lone translations unnayi (kaaru nadapadam, pallu , nagaram, tirigi vachetappudu etc.) . Oka character maatladutunnappudu english slang lo maatladithe believable gane untundi. Kaani oka telugu katha lo narration maathram saadhyamainantha varaku telugu lone undaalani naa abhipraayam. Leka pothe dissonant ga untundi, chadavadaaniki

    1. ఇక మీదట తెలుగు పదాలనే ఉపయోగించి రాస్తాను. ఇక మీరు కథానాయకుడి పాత్ర ఇంకాస్త ఎక్కువ ఎలివేట్ చేయమన్నారు. కానీ తపన వారిచ్చిన అక్షరాల నిడీవి తక్కువ. అందులోనే క్లుప్తంగా కథ చెప్పాలని రాశాను. ఇక ముందు ముందు రాసే నా కథల్లో మీ సలహాను తప్పక పాటిస్తాను

  2. బాగుందండీ మంచి నీతి. ఇలాంటి వారు ఇవాళ రేపూ కనిపిస్తారో లేదో కానీ, నిజంగా ఇలాంటి మనుషులు ఉంటే, అటువంటి వారి సహాయం పొందితే, ఆ సహాయం తప్పకుండా Pay it Forward చైను ని మొదలెడుతుంది.

Leave a Reply

Your email address will not be published.