“నెచ్చెలి”మాట 

 రెండో దశ

-డా|| కె.గీత 

“రెండో దశ” అంటే 

చిన్నప్పుడెప్పుడో జీవశాస్త్రం క్లాసులో చదువుకున్న 

సీతాకోకచిలుక దశల్లో లార్వా దశ 

మానవ జీవన దశల్లో కౌమార దశ  

నవవిధ జ్యోతిశ్శాస్త్రదశల్లో చంద్ర దశ 

కాదండీ-

కిందటేడాది మొదటి దశలో లైటుగా తీసుకున్నామూ..

అదే- 

అన్ని దేశాలూ చెవినిల్లు కట్టుకుని పోరుతుంటే పెడచెవిని పెట్టామూ…

గుర్తొచ్చిందా?

అదన్నమాట-

అదేనండీ.. 

ముందు నవ్వుకుంటూ 

తర్వాత నమ్మినట్టు నటిస్తూ 

రానురాను విసుక్కుంటూ 

ఉన్నామే-

ముందు యథాలాపంగా వింటూ 

తర్వాత ఆశ్చర్యపోతూ

రానురాను ఆలోచిస్తూ  

ఇక ఇప్పుడు వణుకుతూ ఉన్నామే 

అదన్నమాట!

తిన్నగా విషయానికొస్తాను 

ప్రపంచమంతా విచ్చలవిడిగా విజృంభిస్తున్న 

కరోనా రెండో దశలో 

ఒక విషయం స్పష్టమైంది 

ఇక ఇది జోకు కాదు

ఇక ఇది ఆట కాదు

ఇది 

తప్పనిసరి 

భౌతిక దూరం, 

ఒంటరితనాల కాలం

ఇది

వ్యక్తిగత శుభ్రత,

సామాజిక జాగ్రత్తల కాలం 

మర్చిపోకూడని

మూడు మంత్రాల కాలం 

ముక్కుకు మాస్కు-

చేతులకు శుభ్రత- 

ఆరడుగుల దూరం- 

మన చేతుల్లో ఉన్నది ఒక్కటే ఒక్కటి ఇప్పుడు

మనదాకా వచ్చేవరకూ ఆగకుండా 

అన్ని జాగ్రత్తలూ పాటించడం! 

అత్యంత జాగరూకతతో మెలగడం! 

మీకు కరోనా వచ్చి 

మీ ప్రాణం రక్షింపబడినా  

మీ వల్ల కరోనా వచ్చి 

మీ సన్నిహితుల 

ప్రాణాలు రక్షింపబడకపోవచ్చు!  

తస్మాత్ జాగ్రత్త! 

ఇది ఇంకా రెండో దశ మాత్రమే

*****

Please follow and like us:

11 thoughts on “సంపాదకీయం- మే, 2021”

  1. బాగా చెప్పారు. మూడు మంత్రాల కాలం అని.
    చెడ్డ కాలమే! కానీ మంచి నేర్పి పోతోంది. గ్రహించగల జ్ఞాన సంస్కారాలు మనిషికి వుంటె..ఇకనైనా ఇలాటి విపత్కరాలు ఎదురవకుండా, మానవజాతి సురక్షితం గా మనగలుగుతుంది.

  2. కరోనా కట్టడికి జగజాగృతం చేసేలా సంపాదకీయం సాగింది.

  3. కవితాత్మక సంపాదకీయం సూటిగా, క్లుప్తంగా హెచ్చరిస్తూ బాగుంది. రెండో దశ మాత్రమే, ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతోందో అంటూ హెచ్చరించారు. ప్రభుత్వాలు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత ప్రమాదం అం.

  4. క్లుప్తంగా, అందరి మేలునూ ఆకాంక్షిస్తూ చెప్పిన హిత వచన సంపాదకీయం ఎంతో బావుంది

  5. సమయానికి తగు మాటలు చెబుతున్న మీ సంపాదకీయం ( మే నెల) బాగుంది గీత గారు. కరోనాను తేలికగా తీసుకోవద్దన్న మీ హితోక్తి అందరు విని పాటిస్తే ‘జీవామశరదశ్శతం ‘అన్న దీవెన అందుకున్నట్టే. ‘మీ ఆత్మీయుల ప్రాణాలు తస్మాత్ జాగ్రత్త ‘అనే కొస మెరుపు కొరడా దెబ్బలా మేలుకొలుపుతుంది. సమాజాన్ని తట్టి లేపవలసిన బాధ్యతను పత్రికా సంపాదకులు భుజానికెత్తుకోవడం ఎంతో అవసరం. అభినందనలు
    Tangirala. Meera subrahmanyam

      1. ఇది ఇంకా రెండో దశ మాత్రమే…. గీతాజీ…. మీ హెచ్చరిక….ఇంకా……మనవరకు మాత్రమే అనుకున్న వారికి బాగా చెప్పారు.ఇది ఒంటరి తనాల కాలం… ఇది సమైక్య బాధ్యత….. సందర్భోచిత మైన సంపాదకీయం

      2. సమయానికి తగిన సంపాదకీయం. 2వ దశ గురించి…… తెలిపి…. ఏమి చేయాలో చెప్పిన భాద్యతాయుతమైన హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published.