image_print
sailaja kalluri

ఒక నాటి మాట (కథ)

ఒక నాటి మాట -కాళ్ళకూరి శైలజ “మీ ఆయనకి నాలుగో తరగతి నుంచి పరీక్ష ఫీజులు నేనే కట్టానమ్మా. చిన్న మావయ్యా ! అంటూ నా చుట్టూ తిరిగేవాడు”. శిల్ప నవ్వుకుంది. రాహుల్ కూడా నవ్వాడు. ప్రేమ వివాహం అయ్యాక ఇరుపక్షాల వాళ్ళు ఇంకా వేడిగా ఉండటంతో రాహుల్ శిల్పని పూనాలో ఉన్న తన మేనమామ రాధాకృష్ణ గారింటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి లోనవ్లా వెళ్లాలని వాళ్ళిద్దరి ప్లాన్. తెలుగు రాష్ట్రాలకి దూరంగా ఉండటంతో రాధాకృష్ణ గారికి […]

Continue Reading
Posted On :
sailaja kalluri

సౌందర్య సీమ (కవిత)

సౌందర్య సీమ -డా.కాళ్ళకూరి శైలజ హిమాలయం నా పుట్టిల్లు’గుల్మార్గ్’ నే విరబూసిన బాట. తొలి అడుగుల తడబాటు నుంచి,ఇన్నేళ్లు నడిచిన దూరమంతా,నేనై తమ దరికి వచ్చేదాకావేచి చూసిన ఉత్తుంగ శ్రేణులవి.  కొండల భాష వినాలంటే మనసు చిక్కబట్టుకోవాలి.ఆ భాషకు లిపి లేదు.ఆ పాటకు గాత్రం ఉండదు. ఎంత ఎత్తైనవో అంత లోతైన అంతర్మధనం జరిగేలా దీవించి,అక్కున చేర్చుకునే సీమ. ఆకలి,దప్పిక,ప్రేమ,గాయం పదేపదేతూట్లు పొడిచిన జల్లెడను నేను.ఈ దేహం పక్కకు పెట్టి, ఇక పర్వతాల గాలి పీల్చుకోవాలి. చీనార్ ఆకుల నడుమ పండి, ఎలా వర్ణశోభితమయ్యానో!తోటలోనే మాగిన ఆపిల్ గుత్తిలోఎన్ని […]

Continue Reading
Posted On :
sailaja kalluri

మంచు తీగ (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ

మంచు తీగ -డా.కాళ్ళకూరి శైలజ మోగని తీగ వెనుక ఆగిందా? ఆగి ఉందా? అని పిలుపు కోసం వెతుకులాట.ప్రతీ వాగ్దానపు కర్ర  మీద ఒక ఆశాలత పాకించి పొంగిపోయిన మనసు తీగకు అల్లుకునే గుణం ఉంటుంది మంచు పేరుకుపోయాక మాత్రం వసంతం వచ్చేదాకా వేచి చూడాలి . పదాలు పై తొడుగులు, చెప్పీ,చెప్పక కొన్ని భావాలు దాచి పెడతాయితాబేలు పెంకు వెనక దాక్కుంటుంది!అవకాశం ఉంటే ఇదే బ్రతుకుఇలాగే గడుపుతావా? అవునేమో! కాదేమో! గడియారం కేసి చూస్తూ వెలుగు పారబోసినందుకుకాలం […]

Continue Reading
Posted On :
sailaja kalluri

ఎవరికి ఎవరు (కథ)

ఎవరికి ఎవరు -కాళ్ళకూరి శైలజ ఆరింటికి ఇంకా వెలుతురు రాని చలికాలపు ఉదయం, గేటు తాళం తీసి నిలుచున్నాను. భద్రం గారు వచ్చారు. “మహేష్! మీ వీర ఇక లేడు’ అన్నారు. “తలుపు తెరిచి ఉంది,ఏ అలికిడీ లేదు.డౌటొచ్చి లోపలికెళ్ళి చూస్తే ప్రశాంతంగా పక్కమీదే నిర్జీవంగా…” నా చెవుల్లో నిశ్శబ్దం సుడులు తిరిగింది. ఎన్నిసార్లు విన్నా, ఎంత దగ్గరగా చూసినా, మరణం ఒక్కటే ఎప్పుడూ ఒకేలా ఆశ్చర్యపరుస్తుంది. వీర మంచి ఆర్టిస్ట్. అతడిల్లు మా ఇల్లున్న సందులో  మొదటిది. […]

Continue Reading
Posted On :
sailaja kalluri

బతుకు అద్దం

బతుకు అద్దం -కాళ్ళకూరి శైలజ ఆంధ్రప్రదేశ్ సర్జికల్ కాన్ఫరెన్స్ కి  వెళ్లడమంటే గణపతి మాష్టార్ని కలుసుకోవడం కోసం కూడా.ఇప్పుడు ఆయనున్న ఊరు, విజయనగరం లోనే.ఆ ఊరికి కూడా ఒక కోట ఉంది. ఇప్పటికి నేను చూసినవి గుత్తి కోట, కర్నూలు బురుజు. మా అమ్మ “,అనంతూ.నా మనసుకు నువ్వే రాజువి”, అంటూ ప్రేమ గా పెంచింది. కోట ఒక ప్రాంతానికి ఐ.డీ.నంబర్ లా అనిపిస్తుంది! మాది మధ్యతరగతి కుటుంబం.అమ్మా, నాన్నా స్కూలు టీచర్లు.నన్నూ,చెల్లి నీ శ్రద్ధ గా  […]

Continue Reading
Posted On :
sailaja kalluri

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డాక్టర్. కాళ్ళకూరి శైలజ ఉపగ్రహం కన్నుకు దొరకని ఉపద్రవం మాటు వేసింది. ఊపిరాడనీయని మృత్యువు వింత వాహనం ఎక్కి విహార యాత్రకు వచ్చింది. బ్రతుకు మీద ఆశ నాలుగ్గోడల మధ్య బందీ అయింది.  ప్రియమైన వారి శ్వాస ఆడేందుకు పరుగులు తీసి  అలిసిన గుండెలు, కూర్చున్న చోటే కలత నిద్దర్లోకి జారి మందుల పేర్లు పలవరిస్తూ ఉలిక్కిపడి లేస్తున్నాయి.  ప్రాణం కోసం ఇంటి పునాదులుకుదువ పెట్టినప్పుడు, కళ్ళలో దైన్యం కరెన్సీ నోట్లను   తడిపేస్తుందిమరణం నల్లని […]

Continue Reading
Posted On :

వ్యసనం (కవిత)

వ్యసనం -డా.కాళ్ళకూరి శైలజ గుండె చప్పుడు చెవిలో వినిపిస్తుందిస్వేదం తో  దేహం తడిసిపోతుంది.ఎండిన గొంతు పెదవులను తడుముకుంటేశక్తి చాలని కండరాలువిరామం కావాలని మొర పెట్టుకుంటాయి.ఆగావా? వెనుకబాటు,కన్నుమూసి తెరిచేలోగా వందల పద ఘట్టనలుఉన్నచోట ఉండేందుకు పరుగు, పరుగు.ఏమిటీ పోటీ?ఎందుకీ పరుగు? బతుకు జూదంలో అనుబంధాలను పందెం కాసిజవాబు దొరకని ప్రశ్నలు పావులుగా,పేరుకున్న నిశ్శబ్దాన్ని గడ్డపారతో ఎత్తిపోస్తూస్వీయచిత్రం కోసం చిరునవ్వు అతికించుకుని తుడిచేసుకునే క్షణాలు ఆక్రమించిన బ్రతుకు.ఎందుకీ పోటీ? ఎందాకా ఈ పరుగు? పిండి కొద్దీ రొట్టె లా పెట్టుబడి కొద్దీ వ్యాపారంతలపులు […]

Continue Reading
Posted On :
sailaja kalluri

మచ్చలు (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ

మచ్చలు -డా.కాళ్ళకూరి శైలజ ఎండ సోకిన చోట నలుపు,బట్ట దాపున తెలుపు,  ఒంటి మీద కష్టసుఖాల జాడలుమచ్చలై ముచ్చట్లు చెపుతాయి. సొమ్ములు సాగి సాగి వేలాడే కండలౌతాయి .శతమానాల ముద్దర ఎద మీద ఒత్తుకుంటుంటే , నాలి తాడు ఆనవాలు మెడ చుట్టూ చేరి తాకట్టుకెళ్ళి తిరిగి రాని ఊసులు చెపుతుంది.పాలు చీకిన ముచ్చికలు,పసి అంగుడి కోసిన పగుళ్ళతోఉసూరు మంటాయి.      రోకళ్ళు,చీపుర్లు కదుము కట్టిన చేతులుఎగుడు దిగుడు గుట్టలు.గుండిగలు తోమి మకిలి ఇంకిన వేళ్ళు  పంట కొడవలి గంట్లకి రెల్లు గడ్డిలా […]

Continue Reading
Posted On :