కనక నారాయణీయం -20

పుట్టపర్తి నాగపద్మిని

 

   పుట్టపర్తి లేఖిని ద్వారాశివతాండవం అన్న గేయ   కావ్య ఆవిష్కరణకు వేదికగా నిలిచిందిప్రొద్దుటూరులోని అగస్తేశ్వర ఆలయం !!

        అలా ఆవిష్కరింపబడిన శివతాండవం లోని కొంత భాగాన్ని భారతి పత్రిక కు పంపగా, వెంటనే ప్రచురితమైంది.

తర్వాత, కొన్ని సభలలో శివతాండవ భాగాలను చదవగా, స్పందన అద్భుతం. అందులో అనుపమానం గా ఇమిడిపోయిన లయ, అచ్చతెనుగు పదాలలో శివ వైభవం, సంగీత, నాట్య కళా విశేషాలు, సంస్కృతంలో వెలువడిన గంభీర భావ సాంద్రతలుఅందరిని ముగ్గులను గావిస్తున్నాయి. వెళ్లిన ప్రతి చోటా అడిగి మరీ శివతాండవాన్ని నాట్య ముద్రల ప్రదర్శనలతో సహా పాడించు కుంటున్న రసజ్ఞుల కళ్ళలో, రచన పట్ల ఆరాధనా భావం చూస్తుంటే , అగస్తేశ్వర స్వామి ఆశీస్సులు తనపై మెండుగా ఉన్నట్టే అనుభూతమవుతోంది.

     మరీ ముఖ్యంగా బాల్యం లో నేర్చిన సంగీత నాట్య విద్యలు, విధంగా శివతాండవ సాహిత్యంతో జత కట్టడంపుట్టపర్తి వారికి కలిసివచ్చిన అదృష్టమే అనవచ్చు. శివుడు నటరాజు కదా మరి!! శివతాండవ రచ కైలాస నాధుని కృప వలన అనతికాలంలోనే    పుట్టపర్తి కీర్తి   వేగ విస్తరణకు తోడ్పడింది.

      కీర్తి ప్రతిష్టల మాట బాగానే ఉన్నా, చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం , పుట్టపర్తికి ఏమాత్రం తృప్తి రంగా లేవు. వైష్ణవుడు అయి ఉండి , శివతాండవం రచించటం, చర్చనీయాంశమైంది . సంప్రదాయవాదులు, దీన్ని కాస్త గంభీరంగానే తీసుకున్నారు. రెండు వైపుల నుంచి విమర్శలు ఘాటుగా నే ఉన్నాయి. రచనలోని పరిపక్వత మాట వదిలేసి, కవి సంప్రదాయం ఏమిటి?? అన్న విషయమే ప్రధానమై పోయింది.

      కాలంలోనే   ప్రొద్దుటూరులోయువ సాహిత్య మండలిఅన్న పేరుతో, ఒక సాంస్కృతిక సంస్థ వేలిసింది. అందులో ప్రగతిశీల కార్యకర్తల దృక్పథం, పుట్టపర్తి దృష్టి నీ, ఆకర్షించింది. వారి మనసు ప్రభావితమైoది కూడా !! పెట్టుబడిదారీ వ్యవస్థ పై తిరుగుబాటు ధోరణి, మార్క్స్ భావ జాలం ప్రభావంతో, పుట్టపర్తిలోని మానవీయ కోణంపురోగమనంఅన్న ఖండకావ్యం గా ఆవిష్కృతమైంది.

                        మతవాదులు, యుద్ధాలు

                        హి వాదులు, వివాదములు

                        కుతంత్రాలు, కైమోడ్పులు

                           జాతి జాతి సంఘర్షణ

                           జాతి సేవ బురఖా తో

                          జాతి విద్రోహుల నటనలు

                          సాహిత్య వినోదాలు

                          సౌఖ్య పు బానిసలు కవులు

                          ధనవంతుల జీవితమే

                          తమ కవితల కొర ప్రాణం

                          నడవమ్మా…. కవితా!! నడు నడు!!

వచన కవితా రీతుల లో కూడా, తన కలానికి బలం ఎంతో ఉందని నిరూపించారు కవి !!

                        ‘ఇంకనూ ల్లార లేదా మీ దాహం??

                         రాక్షస ధనికుల్లారా??  

                         ల్లార లేదా ??

                         వేలాది ఏండ్ల నుండి విలువైన చరిత్రనే మార్చి

                         మీ ఇంటి కాగడా పట్టించారు!!

                         కీర్తి, సుఖం, ఆనందం,

                         కృషి, వాణిజ్యం, సంస్కృతి

                        అన్నీ మీవే !!

                        అనాధ లయిన మాకు దవ పాత్ర

                        వట్టి పాత్ర

                       చేతికిచ్చారు !!!

                       చల్లారలేదా మీ దాహం??

             శివతాండవం లో వెల్లివిరిసిన పుట్టపర్తి సున్నితమైన సృజనాత్మకతపురోగమనంలో పురివిప్పిన సామాజిక స్పృహరెండూ పూర్తిగా భిన్నమైనవి. కానీ లోతైనవి.

         ఒక విధంగా శివతాండవం తరువాత రచనగాపురోగమనంకవిగా పుట్టపర్తి లోని మరో బలమైన కోణాన్ని సాహిత్య ప్రపంచానికి పరిచయం చేయటమే కాదు, శివతాండవం కంటే ముందుగా పుస్తకరూపంలో ప్రచురితమై, బహుళ ప్రచారానికి నోచుకుంది కూడా !!

       అభ్యుదయ భావజాలం కలిగిన శ్రీయుత రాచమల్లు రామచంద్రారెడ్డి, గజ్జల మల్లారెడ్డి, వై.సి. వి. రెడ్డి వంటి రచయితల స్నేహంపుట్టపర్తిని మార్క్స్ వాదం వైపు మళ్లించింది.

        చాలా విస్తృతంగా సోషలిజం గురించిన విశేషాలన్నీ కూలంకుషంగా అధ్యయనం చేసిన పుట్టపర్తి, ఒక నాడు తన చిన్ననాటి చెలికాడు విద్వాన్ విశ్వం ను కలవటానికి వెళ్లారు. బాల్యంలో మిత్రులిద్దరూ తిరుపతి ప్రాచ్య కళాశాలలో కలిసి చదువుకున్న వారు. అక్కడే అధర్వణ వేదం అనువాదాన్ని కూడా కాస్త ఇద్దరూ కలిసే చేశారు. పుట్టపర్తి శిరోమణి ముగించకుండా నే అర్ధాంతరంగా పెనుగొండ కి వెళ్లిపోవడంతో పని అలాగే, అక్కడే ఆగి పోయింది. కానీ విద్వాన్ విశ్వం, పుట్టపర్తి మధ్య స్నేహం మాత్రం పచ్చగానే ఉంది ఇప్పటికీ !! పైగా ఇద్దరూ ఒకే జిల్లా వారు కావటంవల్ల కూడా వారి స్నేహం కూడా రాయలసీమ సౌరభం లాగేతాజాగానే ఉంది.

        మిత్రులిద్దరూ, తమ తమ జీవితానుభవాలను పంచుకున్నారు.

        ప్రొద్దుటూరు జీవితం, అనంతపురం కళాశాలలో తన అనుభవం తో పాటురచ నానుభవాన్ని కూడా స్నేహితునికి వివరించారు పుట్టపర్తి!!

      విద్యార్థి దశ దాటి జీవన మార్గంలో ప్రయాణం మొదలైన తొలినాళ్ళలో    స్వాతంత్ర్య సంగ్రామ   కాలంలో తాను ఎదుర్కున్న కష్టాలు వివరిస్తూ విద్వాన్ విశ్వం , కడలూరు జైలు లో   తన అనుభవాన్ని హృద్యంగా వివరించారు.

            ఒకరోజు, ఒక బక్కచిక్కిన దళితుడు ఒకడిని తన గదిలో పడేశారట !! !! వచ్చినప్పటినుంచి అతడు అన్నా హారాలు ముట్టక, ఎల్లవేళలా ఏడుస్తూ ముడుచుకుని పడుకొని ఉండేవాడట !! కొన్ని రోజుల తర్వాత విశ్వం, అతనితో మాట మాట కలిపి, అతని వివరాలు సేకరించారు.

      అతనికి పెళ్లయింది. భార్య నిండు గర్భవతి. గాంధీజీ అంటే ప్రాణం. స్వతంత్రం కోసం పోరాడాలని అతని కోరిక. ఒకసారి వాళ్ల ఊరిలో జరుగుతున్న ఒక సభలో, ఆవేశం పట్టలేక, గాంధీజీకి అనుకూలంగా, బ్రిటిష్ వాళ్లకు ప్రతికూలంగా గట్టిగా నినాదాలు చేశాడు. ఇంటికి వెళ్లాడో లేదో, అతని వెనకే తెల్ల పోలీసులు చేరుకున్నారు. గర్భవతి అన్న కనికరం కూడా లేకుండా అతని భార్యని బూటు కాళ్లతో తన్ని, దాక్కుని ఉన్న అతని ఆచూకీ పట్టుకున్నారు. ఇంకేముంది?? తెల్ల పోలీసులు అతనిని కటకటాల వెనక్కి తో శారు. స్థానిక జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి, అటు తరువాత ఇదిగో, క్కడికి చేర్చారు .. నిండు గర్భిణీ భార్యను తలచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. – దళిత యువకుడు!!

           ఎన్ని రోజుల కైనా అతన్ని విడుదల చేయటం లేదు పోలీసులు !! తన బాధను చెప్పుకునేందుకు తోడు ఎవరు లేని జైలు జీవితం!! విద్వాన్ విశ్వం తో, తన గోడు అంతా చెప్పుకునే వాడు పాపం !!  వర్షాకాలం వచ్చింది !! హోరున వాన!! ఉరుములు మెరుపులతో భయం కలిగిస్తోంది. యువకుడు , భయంతో , విశ్వం గారి పక్కకు చేరి, బోరున ఏడ్చాడు  !!

   అటు తరువాత కొన్ని రోజులకే తనను జైలు నుంచి మరో చోటికి తరలించడంతో దళిత యువకుడు సంగతి ఏమైందో తెలియదన్నారు విశ్వం. పుట్టపర్తి కళ్ళలో కన్నీరు వరదలయింది. ఇంకా చాలా విషయాలు మిత్రులిద్దరూ కలబోసుకు న్నారు . కానీ, పుట్టపర్తి మనసులో ఇంకా ఖైదీ కథ , సుళ్ళు తిరుగుతూ ఉంది.

    పుట్టపర్తి మనసులోనూ దేశభక్తి పెల్లుబికింది. అనంతపురంలో తన అనుభవం గుర్తు వచ్చింది. దళితుడైన ఖైదీ బాధ సామాజిక నేపథ్యం , అతని కారాగారవాసం, గర్భిణీ అయిన భార్యపట్ల అతని వేదనప్రస్తుతం పుట్టపర్తి మనసులో నెలకొన్న అభ్యుదయ భావాలుఅన్ని ఒక్కసారి యువ కవి హృదయాన్ని ప్రభావితం చేశాయి. నాటి కాళిదాసు ఖైదీ , భార్య నుంచి దూరమై , వియోగ దుఃఖంలో మేఘo ద్వారా సందేశాన్ని పంపితే, పుట్టపర్తి ఖైదీ, స్వాతంత్ర్యోద్యమ ఖైదీ. దేశం పట్ల ఆరాధన మనసులో పెల్లుబికింది. జయ జయ కారాలు పలికింది. కారాగారవాసం కల్పించింది. కానీ, గర్భవతి భార్యపట్ల అతని ప్రేమ, వేదనకు గురి చేసింది. వేదనను భార్యకు తెలియజేసే వాహికగా మేఘం గోచరించింది. ఇంకేముంది?? అదే పుట్టపర్తి కావ్య వస్తువు అయింది.

              ద్రవిడ సాహిత్యాలను ఆపోసన పట్టిన పుట్టపర్తికి, కన్నడ సాహిత్యంలో లయాత్మక మైన రగడలు అంటే చాలా ఇష్టం. తెలుగు ఛందోబద్ధ వృత్త రీతులలో కంటే, మాత్రా గణ లయాన్విత రచనగా తన మేఘదూతాన్ని మలచే పనిలో పడ్డారుపుట్టపర్తి !

         కాళిదాసు రచన కంటే తన రచన భిన్నంగా ఉండాలి. అదెలా?? దీనికోసం పుట్టపర్తి ప్రణాళికను తయారు చేసుకున్నారు. తన నాయకుడు, దళితుడు. అతను ఉన్నదిఒక పల్లెటూరి నిరుపేద కుటుంబంలో !! వివాహమైన కొద్దిరోజులకే సంఘటన జరగటం వల్ల , సంసార సుఖాలని సంపూర్తిగా అనుభవించిన ఆచూకీ లేదుఅందువల్ల, కాళిదాసు నాయకుని వలె, శృంగార నాయకుడు కాదు. కాళిదాసు వలె తన మేఘదూతం, ఋతువర్ణన కు మాత్రమే పరిమితం కాకూడదు. తన నాయకుడు కారాగారానికి చేరుకోవడానికి కారణం ఇతని దేశభక్తి. అందువల్ల, తన రచనదేశభక్తి ప్రపూరితంగా ఉండాలి. దేశభక్తిని చాటేందుకు, చారిత్రక నేపథ్యం కొల్లలుగా ఉన్న ఆంధ్ర ప్రాంతం, వివిధ సంస్కృతులకు కూడా పెట్టనికోట. కాబట్టిదళిత కావ్య నాయకుని వేదనా కథనం తో పాటూ, తన సందేశాన్ని భార్యకు చేరవేయబోతున్న మేఘ గమన మార్గంలో, కనిపించే వివిధ చారిత్రక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాలు, నదులూ,వివిధ విధాలైన  సామాజిక జీవనాన్ని  కూడా చిత్రీకరించాలి.

   దళిత కావ్య నాయకుని వేదనా కథనం తో పాటూ, తన సందేశాన్ని భార్యకు చేరవేయబోతున్న మేఘ గమన మార్గంలో, కనిపించే వివిధ చారిత్రక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాలు, నదులూ,  వివిధ విధాలైన  సామాజిక జీవనాన్ని  కూడా చిత్రీకరించాలి.    

  ఇంత చక్కటి ప్రాతిపదికను రూపొందించుకుని, పుట్టపర్తి తన మేఘ దూత కావ్యానికి శ్రీకారం చుట్టారు.

                        తనవంటి మానవుల దైన్యమే సుఖ శయ్య

                        గా, వారి నిట్టూర్పు గాడుపులె చామరలు

                        గా – వారి కన్నీట గరగు దినముల పైని

                        నిలిచి – మేమూ మానవులమంచు  గొంతెత్తి

                        యార్చు ధనికుల జూచి యసురులని అన్నాదు

                                                       వాడు మానవుడూ!!

(సశేషం)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.