నిప్పు కణికలై

(‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

-వాడపర్తి వెంకటరమణ

న్యాయానికి నిలువెల్లా సంకెళ్ళు వేసి

అన్యాయం తురగమెక్కి వికటాట్టహాసంతో

విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నప్పుడు

ధర్మాన్ని ధైర్యంగా గోతిలో పూడ్చేసి

అధర్మం అవినీతి చెంతన

ధ్వజస్తంభమై దర్జాగా నిలుచున్నప్పుడు

మంచితనాన్ని అథఃపాతాళానికి తొక్కేసి

చెడుగాలి జడలువిప్పి రివ్వుమంటూ

ఉన్మాదంతో విరుచుకుపడుతున్నప్పుడు

నువ్వు ఎక్కుపెట్టి వదిలిన ప్రశ్నల శరాలు

అన్యాయ అధర్మ చెడుగాలుల గుండెల్లోకి

జ్వలించే నిప్పు కణికలై దూసుకుపోవాలి!

*****

Please follow and like us:

7 thoughts on “నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)”

  1. ఒక కవి గా సమాజం లోని చెడును, అవినీతిని,అధర్మాన్ని దుయ్యబట్టినతిరు బాగుంది.అదే విధంగా సమాధానంగా ప్రశ్నల శరాలు నిప్పుకణికలై దూసుకుపోవాలి అందం మంచి అభివ్యక్తి.బహుమతి అన్ని విధాల అర్హమైన కవిత.అభినందనలు సర్.

  2. డా. కరిమిండ్ల లావణ్య,Associate Professor, Telangana University, Nizamabad, Telangana says:

    నేడు సమాజంలో విలయతాండవం చేస్తున్న అన్యాయ, అధర్మాలను పారద్రోలడానికి సూచిక మీ కవిత. అభినందనలు.🙏💐

  3. బాగుంది రమణ గారు. ఒక ఫైర్ ఉంది కవితలో.

Leave a Reply

Your email address will not be published.