“నెచ్చెలి”మాట 

మహా మంత్రం  

-డా|| కె.గీత 

గత సంవత్సర కాలంలో వచ్చిన ఒక కొత్త మహా మంత్రం ఏవిటంటే-

రోజూ

ముందు ఓం

చివర నమః అంటూ

లాక్ డౌన్

లాక్ డౌన్

లాక్ డౌన్

………..

వెరసి

“ఓం లాక్ డౌనాయ నమః”

పచ్చి మంచినీరు ముట్టో, ముట్టకుండానో

రోజూ ముప్పుటలా

ముక్కు మూసుకుని జపించాలి సుమా!

ఏదో నాల్రోలు మంత్రం జపిస్తే చాలు కదా!

ఇదేవిటీ రోజూ అంటున్నారని హాశ్చర్యంగా చూడకండి-

ప్రతిరోజూ భూమ్మీద ఎక్కడోచోట లాక్ డౌన్ లేని రోజు లేదు మరి!

మారి మారి లాక్ డౌన్ కే విసుగొచ్చేటట్టు ఉంది పాపం!!

అయినా

అసలు

లాక్ డౌన్ అంటే ఏవిటి?

మనచుట్టూ మరణాలు మొదలయినపుడు ప్రభుత్వాలు అమలు పర్చేది-

అధికారులు జపించమన్నపుడే ముక్కున పట్టాల్సింది-

ఎవరో గుర్తు చేసినప్పుడు మాత్రమే మోచేత్తో తడుముకునేది-

మరి  లాక్ డౌన్ మంత్ర పరమార్థం ఏవిటి?

ఇలా వదలగానే అలా రాసుకుపూసుకు తిరగమని

పనున్నా లేపోయినా బయటికెళ్లి పచార్లు చెయ్యమని

పనిగట్టుకుని పదిమంది మాత్రమే కలిసి ఫంక్షన్లు చేసుకోమని

 కాకపోయినా

ముళ్ల మీద కూచున్నట్టు ముణగదీసుకు కూచోవడం

ఉడతాభక్తిగా ఏదో అలా వీథి గాలి పీల్చుకు రావడం

ఉప్పుకో పప్పుకో బైటికి కాస్సేపు చెక్కేయడం

అన్నమాట!

అసలు విషయం ఏవిటంటే

కరోనా కాటు పడకుండా-

కోవిడ్ ప్రాణాల్ని పీల్చేయకుండా-

ఆసుపత్రి పాలయ్యి నానా కష్టాలూ పడకుండా-

జపించాల్సిన

తప్పుతప్పు

ఆచరించాల్సిన……….

ఆగండాగండి-

అయినా మంత్రాల

అర్థం పరమార్థం  తెలుసుకుని జపించే

అలవాటు, అవసరం ఎప్పుడూ బొత్తిగా లేదు కదా

బతుకుజీవుడా అని ఏ ఆనందయ్య మందో మింగడమే కదా

ఇప్పుడేవిటి కొత్తగా ఈ అర్థాలు పరమార్థాలూ

ఆయ్…

అయినా మనలో మన మాట!

కోవిడ్ లక్షణాలు కనబడగానే సెల్ఫ్ ఐసోలేషన్ చెయ్యడం

అవసరమున్నా లేకున్నా ఆరడుగుల దూరం పాటించడం

గెడ్డానికి కాకుండా ముక్కుకి మాస్కు తప్పనిసరిగా తొడుక్కోవడం

వంటివి

మొదటినుంచి ఎవరికి వాళ్ళం స్వచ్ఛందంగా చేసుంటే

ఇప్పుడీ మహా మంత్రం జపించాల్సిన అవసరం ఉండేదంటారా?!

*****

Please follow and like us:

6 thoughts on “సంపాదకీయం- జూన్, 2021”

  1. లాక్ డౌన్ గురించి చాలా బాగా చెప్పారు మేడం.వ్యాసలా కాకుండా కవితాత్మకంగా చాలా చక్కగా చెప్పారు.బాగుంది మేడం

  2. డా. గీత గారు చక్కగా చెప్పారండీ ప్రస్తుత దేశాకాల పరిస్తితులు. ఎవరి నోట విన్నా లాక్ డౌన్ మంత్ర జాప్యమే! అలా గాలి పీల్చుకోవటానికి బయటికి చెక్కేసినా గాలితో పాటు కోవిద్ వైరస్ ను కూడా ఆస్వాదించి వెంట తీసుకొచ్చి మరి కొంత మంది కి అందిస్తున్నారు. నోటికి మాస్కు, చేతికి గ్లౌసు , మొహానికి షీల్డ్, తరుణోపాయం.. అవి పాటించక పోవటం వల్లనే కదా ఇంట్లోనే ఒక్కరే గదిలో ఐసొలేషన్ ముదిరితే ఐసీయు పాలు. లాక్ డౌన్ నియమాలు, ఆరడుగుల దూరం పాటించక పోవటం వల్లనే కదా కరోనా మరింత విజృంభించి దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కవిత రూపంలో లాక్డౌన్ ని చక్కగా చెప్పారు గీత గారు. – -మాణికోపల్లె

    1. సంపాదకీయం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు మణి గారూ!

  3. విషయాన్ని హ్యూమరస్ గా ..నాన్చకుండా …పోయెటిక్ గా చెప్పారు.. nice గీత గారు..

Leave a Reply to వురిమళ్ల సునంద, ఖమ్మం Cancel reply

Your email address will not be published.