
ఆమె ఇపుడొక శిల్పి
-పోర్షియా దేవి
ఆమెని కొంచెం అర్ధం చేసుకోండి ఎప్పటికీ ఒకేలా ఉండడానికి ఆమేమీ పనిముట్టు కాదు మారకుండా ఉండడానికి ఆమేమీ తాంజావూరు చిత్రపటం కాదు తరతరాల భావజాల మార్పులను ఇంకించుకున్న మోటబావి తాను అంతరాల సంధి కాలాలను మోస్తున్న ముంగిట ముగ్గు కదా తాను అవును ఆమె ఇప్పుడు మారుతుంది ఎందుకంటే కొత్త నీరు వచ్చి పాతనీరు పోయినట్టు కాలప్రవాహంలో తాను కూడా ప్రవహిస్తుంది ఎంతకాలమింకా ఇతరుల కోరికలకు అనుగుణంగా తనను తాను మలచుకుంటుంది ఇకనైనా తనకే సొంతమైన తన ఊహలకు రూపమిచ్చుకోవాలి కదాజనవాక్యం తనవాక్యంలా పలికిన ఆ చిలకపలుకులనిక ఆపేసి తన గొంతు తానే శృతి చేసుకోవాలి కదా ఇంటిపేరు దగ్గరనుంచి వెచ్చాల వరకు నా అనే భావన నుంచి మన అనే భావం కలిగించే దాకా ఆమె మారుతునే వుంటుందిచుట్టూ గుండ్రంగా గీసుకుని తనను బయటనే నిలిపిన వారి ముందే తనచుట్టూ తానే ఇంకో గీతగీసుకుని సగర్వంగా నిలుచుంటుంది నిజానికి ఆమెకిపుడు స్వేచ్ఛ అంటే ఏంటో అర్ధమవుతుంది అందుకే తన పరిధిప్పుడు విశాలమయింది యుగాలుగా ఎవరెవరో ఉలితో చెక్కుతున్న ఆ ఆకృతిపుడు తనకేమాత్రం నచ్చడం లేదు అందుకే ఇపుడామె తనను తాను చెక్కుకునే శిల్పి
*****

అమ్మ నాన్న పెట్టిన పేరు శ్రీదేవి. పుట్టింది ఒరిస్సాలో అడాగాం అనే గ్రామంలో. లా చదువుకుని ప్రస్తుతం గృహిణిగా వున్నాను. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరనివాసం. నేను పోర్షియాదేవి అనే కలం పేరుతో రచనలు చేస్తుంటాను. చిన్నప్పటినుంచి ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండడం వలన చిన్న వయసు నుంచే సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడింది. కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదవడం అలవడింది. మొదటినుంచీ పుస్తకమే నేస్తం అవడం వలన బాధ, సంతోషం ఏదైనా కానీ పుస్తకంతోనే పంచుకోవడం, పుస్తకంలోంచే ప్రపంచాన్ని చూడడం అలవాటు. నాలుగైదేళ్లనుంచి రాయడం మొదలుపెట్టాను. ఓ ఐదారు కథలు, వందదాకా కవితలు రాసాను.

kavita chala bagundi. avunu thananu thanu chekkukune shilpi… ippudu….
Congratulations madam…