
డయాస్పోరా రచయిత్రి అపర్ణ గునుపూడి గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
(అపర్ణ గునుపూడి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
అపర్ణ మునుకుట్ల గునుపూడి సంగీత ప్రియులు, నాట్యాభిమాని, సాహిత్యానురక్తులు, రచనాసక్తులు. కథలు, కవితలు, పాటలే కాకుండా వీరు ఎన్నో నృత్యరూపకాలు రచించేరు. వీరి కథలు కవితలు సుజనరంజని, కౌముది, తానా, ఆటా పత్రికల్లో ప్రచురించారు. వీరు రాసిన పాటలు ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ మనోహర్ మూర్తి సంగీతం కూర్చిన “ ప్రేమ తరంగిణి” గా వెలువడ్డాయి. వీరు రాసిన ఝాన్సీ రాణి, ప్రసన్న అష్టలక్ష్మి, ఉషా కళ్యాణం, స్నేహం, జంషెడ్జీ టాటా నృత్యరూపకాలు కూచిపూడి, భరతనాట్యం బాణీల్లో ప్రదర్శనలుగా బహు ప్రశంసలందుకున్నాయి. ప్రస్తుతం కౌముదిలో కృతి ఆకృతి అన్న శీర్షికతో కర్ణాటక సంగీత కృతులని వివరిస్తూ వ్యాసాలు రాస్తున్నారు. వాటినే ఇంగ్లీషులోకి అనువదించి నెచ్చెలి పత్రికలో Carnatic Compositions – The Essence and Embodiment అన్న శీర్షికతో ప్రచురిస్తున్నారు.
చిన్నప్పటి నుంచి రకరకాల అభిరుచుల్ని ప్రోత్సహించి, చదవడానికి కావలసినన్ని సాహిత్యపరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచిన తన తలితండ్రులే పరమ గురువులుగాను, రచనారంగానికి శ్రీ కరుణశ్రీ మానసిక గురువుగాను పరిగణిస్తారు. రెవిన్యూ కంట్రోలర్ గా పనిచెయ్యడం వీరి వృత్తి. నలభై సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న అపర్ణ, భర్త సుబ్బారావుతో పాలో ఆల్టో కాలిఫోర్నియాలో నివసిస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు అనుపమ, రంజని.
ప్రచురణలు:
ఘర్షణ – కథల సంపుటి (2014)
శీర్షికలు:
అర్థం అంతరార్థం – సుజనరంజని – (2004-2005)
కృతి – ఆకృతి – కౌముది – (2021)
Carnatic Compositions – The Essence and Embodiment – నెచ్చెలి – (2021)
పాటలు:
ప్రేమ తరంగిణి – కేసెట్ విడుదల (1994)
నృత్య రూపకములు:
ఝాన్సీ మహారాణి (1999)
సుగుణమాల (2001)
ప్రసన్న అష్టలక్ష్మి (2003)
సత్యభామ కృష్ణ (2004)
ఉషా కళ్యాణం (2005)
స్నేహం – సుయోధన, కర్ణ (2006)
జంషెట్జి టాటా (2007)
త్రిశక్తి – సీత, సావిత్రి, ద్రౌపది (2009)
తార (2015)
మైసూరు మహారాణి (2019)
ప్రత్యేక ఎంపికలు:
లోకరీతి – వంగూరి ఫౌండేషన్ కథల పోటీలో ప్రశంసా బహుమతి (2010)
పువ్వుల జడ – కేంద్ర సాహిత్య అకాడమీ వారి అర్థ శతాబ్ధిలో అమెరికా తెలుగు కథ సంపుటి (2019)
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
