అయ్యమ్మ

-ఆదూరి హైమావతి

                        

         వాజ్ఞ్మయీ విద్యాలయంలో ఆరోజు పితృదినోత్సవం జరుపు తున్నారు. ఆహూతులంతా వచ్చి కూర్చున్నారు. పిల్లలంతా తమ అమ్మా నాన్నలతో కలసి కూర్చున్నారు.  

 ప్రియ, ప్రియతం ఆవిద్యాలయంలో ఏడోతరగతి చదువుతున్నారు. వారిద్దరూ పాఠశాల మైన్ గేటు వద్దకూ ,వేదిక వద్దకూ తెగతిరుగు తున్నారు.ఎవరిరాక కోసమో చూస్తున్నట్లు  అనిపిస్తోంది. 

          ఇంతలో విద్యాలయ ప్రధానోపాధ్యాయిని వేదిక మీదికి వచ్చి , ” ప్రియమైన మా విద్యార్ధుల తల్లి దండ్రులారా! స్వాగతం, సుస్వాగ తం. కొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ముందుగా ప్రార్థన ,తర్వాత ఇరువురు మా విద్యార్థులు మాట్లాడతారు. ఆతర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు. మొత్తం కార్యక్రమం ఒక గంటలో ముగుస్తుంది. ఓపిగ్గా దర్శించి మా విద్యార్థులను దీవించి, ప్రోత్సహించ వలసినదిగా మనవి.” అని ముగించగానే ఇద్దరు విద్యార్థులు వచ్చి ప్రార్థన చేశారు.  

ఆతర్వాత ప్రియ, ప్రియతం వేదిక మీదకువచ్చి, ఆదుర్దాగా మైన్ గేటుకేసి చూస్తూ,కళ్ళు తుడుచుకుని ,చెరో మైక్ తీసుకుని  అందరికీ నమస్కరించి మొదలు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు చెప్పసాగారు.

” ప్రియమైన పెద్దలారా! భగవంతుని అంతా నమ్ముతారు. ఆయన అనేక రూపాల్లో ఉంటారంటారు .మా దేవుడు మానాన్న రూపంలో ఉన్నారు. మానాన్నే మా భగవంతుడు. దేవుడెలా ఉంటాడో ఎవ్వరికీ తెలీదు. గుడిలో విగ్రహాన్నో , ఎవరైనా చిత్రకారుడు గీచిన బొమ్మ నో దేవునిగా అంతా పూజిస్తారు..ఐతే మాకా బాధలేదు. ఎవ్వరూ ఎన్నడూ నేరుగా చూడని దేవుని చిత్రాల్లో చూసి, అందరూ నమస్కరించు కుంటూ పూజిం చు కుంటూ ఉంటే మేం మానాన్న నే దేవునిగా భావించి, పూజించం— ప్రేమిస్తాం,  గౌరవిస్తాం, కృతజ్ఞతగా మసలు తాం.  ఆయన మాటే మాకు వేదవాఃక్కు.మానాన్న మాకు  వాత్సల్యపు నీడనిచ్చే ఒక వట వృక్షం.  కాదు–కాదు వటవృక్షం తనక్రింద ఏ మొక్కనూ  పెరగ నివ్వదుట. మానాన్న ఒక కల్పవృక్షం .కల్పవృక్షం అడిగితేనే అన్నీ ఇస్తుంది. మా కల్పవృక్షం అడక్కుండానే మాకు ఎప్పుడేవి కావాలో అవి ఇస్తుంది.  మాస్నేహితు లొకరు ‘మీనాన్న మా నాన్న కర్మాగారం లో పని చేసే చిన్న ఉద్యోగి  ‘ అని హేళన చేశాడు. అదేమో మాకుతెలీదు, చిన్నో, పెద్దో. మా నాన్నకర్మాగారం వేరే ఒక టుంది . అది ప్రేమ కర్మాగారం. దానికి ఇన్ పుట్స్ మాకు తెలీవు, కానీ ఔట్ పుట్స్ తెల్సు ,  అభిమానం, అనురాగం  , ఆప్యాయత,ఆదరణ,  దయ, కరుణ, జాలి, బాధ్యత, స్నేహం,మక్కువ, మమకారం, చెలిమి ఇలాంటివి ఇంకా అనేకం మా నాన్న హృదయ కర్మాగారం నుండీ మాకు వచ్చే ఔట్ పుట్స్. మా కవిచాలు, వాటిలో మునిగి తడిసి ఆనంది స్తాం. మాకు పెద్ద మేడలూ, మిద్దెలూ అక్కర్లేదు, కార్లూ గట్రా వద్దే వద్దు. మా నాన్నే మా సర్వస్వం. మానాన్న మాకుంటే అన్నీ ఉన్నట్లే.మాకు అమ్మంటే తెలీదు. మేము కళ్ళు తెరవక ముందే వెళ్ళిపోయిందిట. దేవుడు తీసుకెళ్ళాట్ట. ఒక వేళ దేవుడు ఇప్పుడు వచ్చి ‘అందరికీ అమ్మ ఉందని మీకులేదనీ బాధపడు తున్నా రా! మీకు మీ అమ్మను ఇవ్వమంటా రా?’ అని అడిగితే మేం ‘వద్దంటాం’, ఎందుకంటే ఆ దేవునిలానే  ఇంత వరకూ చూడని అమ్మ మాకు వద్దు.  మానాన్నే మాకు అమ్మ కూడా. ఇప్పుడు కొత్తగా అమ్మ వస్తే ఆమెకెలా దగ్గరవ్వాలో మాకు తెలీదు. మానాన్న మా చిన్న తనంలో మాకు పాలు పట్టేప్పుడు  , స్నానం చేయిం చేప్పుడు, బువ్వ పెట్టే ప్పుడూ చీర చుట్టుకునే వాట్ట. అమ్మ అనుకుంటా మని. మేం చిన్నగా ఉన్నప్పుడు  నన్నూ నా తమ్ముడ్ని,”  అని ప్రియ అనగానే , ప్రియతం అందుకున్నాడు

 “మాఅక్క అనే ఈ ప్రియ నాకంటే ఒక్కనిముషం ముందు పుట్టింది లేండి. నేను పుట్ట గానే మా అమ్మను మింగేశానని బంధువులంతా  నన్ను తిట్టారని, మా నాన్న వారికంతా దూరంగా ,ఈ ఊరికి ఉన్న పెద్ద ఉద్యోగం వదిలేసి, ఇల్లూ,ఆస్థీ అన్నీ తెగనమ్ముకుని వచ్చి మేం మూడేళ్ళ వాళ్ళ మయ్యే వరకూ మమ్మల్ని పెంచి, ఆ తర్వాత మమ్మ ల్ని ఉంచను ప్లేక్లాస్ ఉండేచోట చిన్న ఉద్యోగంలో చేరి, మమ్మల్ని అక్కడ చేర్చి, మధ్య మధ్యలో వచ్చి చూస్కుని వెళ్ళేవాడు. మాకు అమ్మ ఉన్నా ఇలా చూసేదో కాదో మాకు తెలీదు.మానాన్నే మా దేవుడు.  ఈ రోజున మా నాన్న ఇక్కడికి ఎందుకు రాలేదో కానీ వస్తే ఆయన కాళ్ళు కడిగి మా ప్రేమ చూపుకుందా మనుకున్నాం.ఆదర్శ అయ్యమ్మ అంటే మాకు అయ్యాఅమ్మా ఆయనే ,మేం మా నాన్నని అయ్యమ్మ అనిపిలు స్తాం.ఎందుకో రాలేక పోయారు. అందుకేమేము కొంత కాలంగా మా అయ్యమ్మకు తెలీకుండా రహస్యంగా గీసిన ఈ చిత్రాన్ని మీకు చూపు తున్నాం. మా అయ్యమ్మ వచ్చిఉంటే ఆయన కు బహుమతిగా మీఅందరిముందూ ఇవ్వాలను కున్నాం. ” అంటూ గుండ్రంగా చుట్టి ఉన్నఒక నిలువెత్తు చిత్ర పటాన్ని విప్పి ఇద్దరూ కలసి పైకెత్తి చూపారు.” ఇదేమా అయ్యమ్మ చిత్రం “అని చెప్పారు. 

      ఆ నేత్రాలలో ప్రేమ నయాగరా జలపాతంలా ప్రవహిస్తుండగా , రెండు చేతులతో ఇద్దరు చిన్నారులను ఎత్తుకుని, హృదయానికి హత్తుకుని ఉన్న   ఒక పురుష రూపం. అది సంపూర్ణంగా ప్రేమరూపు దాల్చినట్లున్న ‘ప్రేమ స్వరూపం’. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల తో ఆప్రాంతమంతా ప్రతి ధ్వనిస్తుండగా, దూరంగా మైన్ గేటు వద్ద ఒక వ్యక్తి దుఃఖమో,ఆనందమో ,ఉద్వేగమో భరించలేక క్రిందవంగి  కూర్చు ని రెండు చేతులలో ముఖాన్ని కప్పు కుని విలపించడం ఎవ్వరూ గమనించలేదు.   

                                                           

******

Please follow and like us:

2 thoughts on “ఓ కథ విందాం! “అయ్యమ్మ””

  1. చాలా అద్భుతంగా వ్రాశారు మేడం. తండ్రి ప్రేమని ఎంతో బాగా తెలియచేశారు. మీ పాద పద్మాలకు నమస్సుమాంజలి. సాయిరాం . మీ స్టూడెంట్ సత్య శివ ప్రసాద్.

  2. Sairam Madam Garu, 🌹🙏🌹. మీకు మీరే సాటి మీకు ఎవరూ లేరు పోటీ. ఇందులో అయమ్మ కథ అద్భుతం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి. అనుగ్రహ ఆశీసులు కలగాలని కోరుకుంటున్నాను. జై సాయిరాం. గౌరవనీయులు శ్రీ అధూరి శ్రీనివాస్ గారి అనుచరుడు,మరియు శ్రీ సత్య సాయి సేవా సమితి , సేవకుడు (కన్వీనర్,). S. మధుసూదనo, చిత్తూరు

Leave a Reply to S.Madhusudhanam Cancel reply

Your email address will not be published.