
ఉప్పు నీరు
-జయశ్రీ అట్లూరి
ఎండి పొడారిన కనుగవచెలరేగే తుఫానుల తాకిడికుమిలి కదలి చెమ్మారిన అలికిడిఆరని జ్వాల కరిగిన కల విరిగిన అల చేరేసిన తట్టా బుట్టా మట్టిపాలుకనిపెంచిన పిల్లా జెల్లా నిన్నటి మురిపాలుకసాయికన్ను పడితే కడదేరిపోయే జీవితాలుఆశలు ఆశయాలు కొడిగట్టిన దీపాలు తరతరాలుగా ఎత్తుతున్న తలల అణచివేత యుగయుగాలుగా ఎవరూ వినని ఆత్మఘోషదినదినపు సుడిగుండాల గుండెకోత నాకు నేను నాది..నాకుండకూడని భాష కోటానుకోట్ల మగువల తీరని దుఃఖంగుండె సెగకు కరిగిన వ్యథ రుధిరాక్ష స్రవంగాబాధా సాంద్రపు రక్తకన్నీటి చుక్కలుగా లక్షల కోట్ల కన్నీటి చుక్కల సాకారం సాగరం లవణం సాగర జల లక్షణంకన్నీటి రుచి లక్షణం లవణంభూగోళం మీద భూదేవి సహనాన్ని మించినసప్తసముద్రాలు ఉప్పురికిన శోక సముద్రాలు
*****

పేరు: జయశ్రీ అట్లూరి
ఊరు: స్టోక్ అన్ ట్రెంట్
వృత్తి: లెక్చరర్/టీచర్
రచనలు: చిన్న కథలు/కవితలు/ట్రావెలోగ్స్

శ్రీమతి జయశ్రీ అట్లూరి గారి కవిత ‘ ఉప్పు నీరు ‘ లో తరతరాలుగా అణచివెయ బడుతున్న స్త్రీ ఆత్మ గౌరవాన్ని గురించిన ఆవేదన వుంది .
సంద్రం , కన్నీరు రెండింటి లక్షణమూ ఉప్పగా వుండటమే . స్త్రీ ఆవేదన తీరేది ఎప్పుడు అని ప్రశ్నిస్తూ సమాజాన్ని నిలదీస్తున్నారు
మంచి కవిత . అభినందనలు
జి . రంగబాబు