
మేం పోరాడుతాం
-లలితా వర్మ
పుట్టినదాదిగా పోరాడుతూనే ఉన్నాంఎన్ని యుద్ధాలు చేయలేదు! మా జీవితం నిన్నటి సమరమైనా అనునిత్యం నూతన భావికి గమనమే రూపుదిద్దుకోక మునుపే రూపుమాపే జన్మకారకులతో లేలేత చిరు ప్రాయాన్నినలిపేసే కిరాతకులతో సొగసునలద్దుకున్న యవ్వనాన్ని కాటేసే కసాయిలతో కడుపుచేతబట్టి వెడలినచోటలైంగికవేధింపులకు గురిచేసేమేకవన్నె పులులతో నాలుగు గోడల మధ్య సాగే గృహహింసకుకారణభూతులైన పతిదేవుళ్లతో కనిపించే శారీరక గాయాలకు ప్రత్యామ్నాయంగా,మనసుకు కనబడని గాయం చేసేప్రబుద్ధులతో బాంధవ్యాలలో భేదాలు చూపేకన్నవారితో అడుగడుగున ఆంక్షలతోఅస్తిత్వాన్ని సవాలు చేసేమెట్టినింటివారితో నొసలు భక్తుడై నోరు తోడేళ్లయిన సంఘ జనులతో, ఆచారాలు దురాచారాలు చేసి బ్రతుకు దుర్భరం చేసేఛాందసులతో మేము మేము గా బ్రతకటానికి పోరాడుతూనే ఉన్నాం. మేము మహిళలంఆదిశక్తి అంశలంవిజయం సాధించే వరకూపోరాడుతూనే ఉంటాం!
*****

నా పేరు లలితా వర్మ. విశ్రాంత ఉపాధ్యాయినిని. 64వ ఏట రచనా వ్యాసంగం పైన దృష్టి సారించి, రెండు సంవత్సరాల్లో రెండు పుస్తకాలు వెలువరించాను. ఒకటి అరుంధతి@70 కథలసంపుటి రెండోది సాంఘిక కాల్పనిక ధ్రిల్లర్ నవల హవేలీ. మూడో పుస్తకం త్వరలో రాబోతుంది. కథా కేళి, భావుకతలు, అమ్మంటే, మా కథలు 2020, అనుబంధాల పూదోట, మానసవీణ వంటి కథా, కవితా సంకలనాల్లో చోటు సంపాదించుకున్నాను. కొన్ని కథలు, కవితలు వివిధ అంతర్జాల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వసంతవల్లరి, వినిపించే కథలు, మీ కథలు సమయం వంటి యూ ట్యూబ్ ఛానెల్స్ లో నా కథలు వినిపించబడ్డాయి. సమాజంలో జరిగిన జరుగుతున్న సంఘటనలు చూసినపుడు నాలో కలిగిన భావోద్వేగాలకు అక్షరరూపం ఇస్తుంటాను. సమాజంలో మృగ్యమవుతున్న మానవీయ సంబంధాలు పెంపొందించాలని నా ఆకాంక్ష.

మహిళ లేనిమహి లేదు.
మహిళ లేక మనుగడ యే లేదు.
మహిళ లేక మహి యొక్క మనుగడ
గగన కుసుమమే.
Thank u