మేం పోరాడుతాం

-లలితా వర్మ

పుట్టినదాదిగా పోరాడుతూనే ఉన్నాం
ఎన్ని యుద్ధాలు చేయలేదు!
 
మా జీవితం 
నిన్నటి సమరమైనా 
అనునిత్యం నూతన భావికి  గమనమే
 
రూపుదిద్దుకోక మునుపే 
రూపుమాపే జన్మకారకులతో
 
లేలేత చిరు ప్రాయాన్ని
నలిపేసే కిరాతకులతో
 
సొగసునలద్దుకున్న యవ్వనాన్ని 
కాటేసే కసాయిలతో
 
కడుపుచేతబట్టి వెడలినచోట
లైంగికవేధింపులకు గురిచేసే
మేకవన్నె పులులతో
 
నాలుగు గోడల మధ్య సాగే గృహహింసకు
కారణభూతులైన పతిదేవుళ్లతో
 
కనిపించే శారీరక గాయాలకు 
ప్రత్యామ్నాయంగా,
మనసుకు కనబడని గాయం చేసే
ప్రబుద్ధులతో
 
 బాంధవ్యాలలో భేదాలు చూపే
కన్నవారితో
 
అడుగడుగున ఆంక్షలతో
అస్తిత్వాన్ని సవాలు చేసే
మెట్టినింటివారితో
 
నొసలు భక్తుడై నోరు తోడేళ్లయిన 
సంఘ జనులతో,
 
ఆచారాలు దురాచారాలు చేసి 
బ్రతుకు దుర్భరం చేసే
ఛాందసులతో
 
మేము మేము గా బ్రతకటానికి 
పోరాడుతూనే ఉన్నాం.
 
మేము మహిళలం
ఆదిశక్తి అంశలం
విజయం సాధించే వరకూ
పోరాడుతూనే ఉంటాం!

*****

Please follow and like us:

2 thoughts on “ఓ కవిత విందాం! “మేం పోరాడుతాం” (కవిత)”

  1. మహిళ లేనిమహి లేదు.
    మహిళ లేక మనుగడ యే లేదు.
    మహిళ లేక మహి యొక్క మనుగడ
    గగన కుసుమమే.

Leave a Reply to Lalitha varma Cancel reply

Your email address will not be published.