
https://youtu.be/GQlXoZR_m7Y
ప్రముఖ అనువాదకులు కల్యాణి నీలారంభం గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
(కల్యాణి నీలారంభంగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
కల్యాణి నీలారంభం 18-8-1946న జన్మించారు. తల్లిదండ్రులు రామయ్య, శారద (శర్వాణి-ప్రముఖ అనువాదకులు) జన్మస్థలం బెంగళూరు. ప్రస్తుత నివాసం విజయవాడ. స్కూలు చదువు రాజమండ్రి, విజయవాడల్లో, కాలేజి అనకాపల్లి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తి చేశారు.
ఇంగ్లీషులో ఎమ్మే చేశాక మొదటి ఉద్యోగం విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో, తర్వాత కాకినాడ అన్నవరం సత్యవతీదేవి స్త్రీల కళాశాలలో, ఆ తరవాత తాడేపల్లి గూడెం,శ్రీకాకుళం, విశాఖపట్నం, శృంగవరపుకోటలలో పనిచేశారు. 38 ఏళ్ల సర్వీస్ లో ఆఖరి ఎనిమిది సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా శృంగవరపుకోట, విశాఖపట్నంలలో పనిచేశారు. 2004 లో విశాఖ మహిళా కళాశాలలో పదవీ విరమణ చేశారు.
కాలేజీలో చదువుతున్న రోజుల్నుండీ వారి అమ్మగారు శర్వాణిగారు అనువదించిన కథలు, నవలలకు మేలుప్రతి చేస్తూండడంతో సహజంగానే అనువాద ప్రక్రియలో ఆసక్తి కలిగింది వీరికి.
కల్యాణి గారు అనువాదం చేసిన నవలలు:
పునర్జన్మ (మూలం త్రివేణి)
సంఘర్షణ (మూలం త్రివేణి)
చిగురు (మూలం త్రివేణి)
మాధవి (మూలం అనుపమా నిరంజన)
మిథ్య (మూలం బి.యు గీత)
కథానువాదాలు: దాదాపు పదిహేను వరకు
స్వీయ కథలు: కొన్ని
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
