
ఆలస్యంగా
-మనోజ్ఞ ఆలమూరు
మనిద్దరం ఆలస్యంగా ఒకరి జీవితాల్లోకి ఒకరం అడుగుపెట్టాం
ఎవరు కాదనగలరు?
అయినా నేను ప్రతీరోజూ నీ గురించి కలగంటాను
ఏ ఒక్కటీ నిజం కాదని తెలిసినా….
ప్రతీ కలనీ….అందులోంచి కదలివచ్చే నీ రూపాన్నీ…
తల్చుకుంటూ రోజులు దొర్లించుకుంటాను
ఎన్నెన్నో మధుర స్మృతులు
మరెన్నో చేదు జ్ఞాపకాలునూ..
అన్నింటినీ కలిపే తీపి కల….
వాస్తవంలోకి లాక్కొచ్చే జీవితం
కలలోని నీ రూపం కోసం నా ఎదురుచూపు
ఆ ఎదురుచూపులో మిగిలే నైరాశ్యం
అది ఎప్పటికీ కలే అని తెలిసినా
మళ్ళీ మళ్ళీ అదే కల కనే నా ఆశ
నీతో జీవితం కల కాకుంటే బాగుండు
కానీ ఎప్పటికీ నువ్వు నా కలల మనిషివే కదా
ఆశకు నిరాశకు మధ్యన ఆగిపోయాను
అయినా.. నాకేం కాదు
కలల తర్వాత మెలకువలో నిన్ను ఎప్పటికైనా కలుసుకుంటాను
*****
Please follow and like us:

మనోజ్ఞ ఆలమూరు ఎంఫిల్ తెలుగు పూర్తి చేసి, ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పుట్టింది, పెరిగింది విజయనగరంలో. ఆంధ్రా, సెంట్రల్ యూనివర్శిటీలో చదువు. తెలుగులో మంచి అభిరుచి గల కుటుంబంలో పుట్టి పెరిగిన నేపథ్యం. ఆరవ తరగతి నుంచి తెలుగు సాహిత్యంతో పరిచయం. అదే తెలుగు చదువుకునేలా చేసింది. పుస్తకాలు చదవడం అంటే పిచ్చి. రాయడం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. చదివిన వాటిని సమీక్షించడం అంటే మక్కువ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కొకు, రావిశాస్త్రి, చలం అభిమాన రచయితలు. భవిష్యత్తులో రాయడమే పూర్తి వ్యాపకం చేసుకునే దిశగా అడుగులు.
