
బొమ్మను
-రాధాకృష్ణ కర్రి
బొమ్మనుగమ్యానికి బాటలు వేసుకోలేని రాతి బొమ్మను.దిక్సూచికి వ్యతిరేక దిశలో పయనించేకళ్ళు ఉన్న కబోది బొమ్మను.కర్కశత్వం, మొండితనమే ఇంధనంగాసాగే మనసు లేని మరబొమ్మను.అష్ట వంకరల మార్గంలో పయనించేరెక్కలు లేని విహంగాన్ని.ప్రేమ అనే తెరచాపకై వెదుకులాడుతూరుధిరమైన తనువుతోసాగరంలో నడిచే నావికను.వందశాతం పరీక్షలు రాసిఅద్భుతమైన శూన్య ఫలితాలను సాధించే నిత్య నూతన విఫల విద్యార్థిని.లోటుపాట్ల జాడ తెలుసుకోలేకచతికిలపడ్డ పంకిలాన్ని.నాకు నేనే అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నను.
*****
Please follow and like us:

నా పేరు రాధ కర్రి. నివాస స్థలం విజయవాడ. భాగస్వామి పేరు కృష్ణ. వృత్తిరీత్యా ప్రయివేట్ సంస్థలో సహాయ నిర్వాహకురాలు కొనుగోలు (Asst. Manager Commercial ) విభాగంలో పనిచేస్తున్న. ప్రతిలిపి , స్టోరీ మిర్రర్ అనే అంతర్జాల వేదికలలో కథలు, వచన కవితలు వ్రాస్తుంటాను. విహంగ అంతర్జాల మాస పత్రికలో, మెట్రో ఉదయం నిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. పలు సాహితీ బృందాలలో సభ్యత్వం కలిగిఉన్నాను. ఎక్కువగా భావకవిత్వాన్ని ఇష్టపడతాను. కథలు, కవితలు ఎక్కువగా చదువుతుంటాను.
