
పల్లె పిలుస్తోంది…!
-గవిడి శ్రీనివాస్
చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసిలేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానేచిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కాఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలుపిల్లలు పల్లెకు రెక్కలు కట్టుకునిఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలోజీడి చెట్ల కొమ్మల్లోఅడుగులు వడివడిగామురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకునిమంచు బిందువుల్ని పూసుకునిఎగిరే పక్షుల వెంటఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకునినా పల్లెలో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్నివెలిగించుకునిఅలసిన క్షణాల నుంచీఅలా సేదదీరుతుంటాను.
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
