
నా నీడ తప్ప
-హేమావతి బొబ్బు
నా నీడ తప్ప
నేను నాకు కనిపించడం లేదు
నా లోన ఏదో సందిగ్ధత
అది పెరిగి పెద్దదై
చివురు నుండి మ్రానుగా
తుఫానుగా మారుతుంటే
తుమ్మెదల ఝూంఝూంకారం
నాథoగా నాథా కారంగా
లోకాన్నంతా అలుముతుంటే
విషాదమో ఆనందమో
విశదీకరించలేని స్థితి
ఛిటికేనవ్రేలుని పట్టుకొన్న చిన్నారి
కన్నులలోకి జారుతున్న కన్నీళ్ళు
ఏదో తరుముకొస్తున్నట్లు
అంతా వేగంగా కదలిపోతుంటే,
……..ఇక్కడే ఒక్క క్షణం
స్తబ్దంగా మిగిలిపోవాలని
మారే కాలాన్ని గుప్పెటన బంధించి
నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగి పోవాలని
నీ దాహాన్ని తీర్చే నీటి బొట్టునై
నీ హృదయాన్ని చేరాలని …….
*****

నేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందాను. పరిశోధకురాలిగా, అధ్యాపకురాలిగా అనుభవం ఉంది. ఆర్ జి యు కె టి ఇడుపులపాయ లో జీవశాస్త్రం అధ్యాపకురాలి గా పనిచేసారు .
