image_print

నా నీడ తప్ప (కవిత)

నా నీడ తప్ప -హేమావతి బొబ్బు నా నీడ తప్ప నేను నాకు కనిపించడం లేదు నా లోన ఏదో  సందిగ్ధత అది పెరిగి పెద్దదై చివురు నుండి మ్రానుగా తుఫానుగా మారుతుంటే తుమ్మెదల ఝూంఝూంకారం నాథoగా నాథా కారంగా లోకాన్నంతా అలుముతుంటే విషాదమో ఆనందమో విశదీకరించలేని స్థితి ఛిటికేనవ్రేలుని పట్టుకొన్న చిన్నారి కన్నులలోకి  జారుతున్న కన్నీళ్ళు ఏదో తరుముకొస్తున్నట్లు అంతా వేగంగా కదలిపోతుంటే, ……..ఇక్కడే ఒక్క క్షణం స్తబ్దంగా మిగిలిపోవాలని మారే కాలాన్ని గుప్పెటన బంధించి నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగి పోవాలని నీ దాహాన్ని తీర్చే నీటి బొట్టునై నీ హృదయాన్ని చేరాలని ……. ***** నేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల  తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం […]

Continue Reading
Posted On :

సంతోషాన్ని వెతుకుతూ (కవిత)

సంతోషాన్ని వెతుకుతూ -హేమావతి బొబ్బు సంతోషాన్ని వెతుకుతూ కొండ కోనలు తిరుగుచూ ఎక్కడున్నదో తెలియక ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని పబ్బుల్లో ఉందో మబ్బుల్లో ఉందో తాగే మందులో ఉందో చల్లటి చెట్టు నీడలో ఉందో మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో పర్స్ లో లేకా ప్రేమించే గుండెలోన హిమాలయాల లోనే కలియతిరుగుచూ కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా నాకు కొంచెం సంతోషాన్ని ఇవ్వమని విరిసే ప్రతి పువ్వుని అడిగా దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని పొత్తిళ్ళలో పసిపాపలా పెంచాను నేను దాన్ని మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలో యవ్వనాన ఎదిగేను మహావృక్షంగా నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచి పోయెను నేను ఎదిగానని తలచి ***** నేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల  తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ […]

Continue Reading
Posted On :

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ (కవిత)

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ -హేమావతి బొబ్బు దప్పికతో ఒయాసిస్సులు వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనక లాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుతున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాది నా వాళ్లంటూ  ప్రాణం పోయినా మమకారాన్ని చంపుకోలేక నా ఆత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు అమ్మ కడుపులో ఊపిరి పొసినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవై నందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ కడుపు నిండిన మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నా గుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలి వై, భార్య వైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ వాలుతున్న శరీరాన్ని వసంతంలో నింపడానికి వయస్సుడుగుతున్నపుడు నా భుజాల చుట్టూ చేతులు వేసి నన్ను నడిపించడానికి నా బిడ్డవైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాకు పునరుజ్జీవితం ఇవ్వడానికి నాకు మరణాన్ని ప్రసాదిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రభూ ***** నేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత […]

Continue Reading
Posted On :