
చూస్తూ ఉరుకునేదే లేదు
-డా. కందేపి రాణీప్రసాద్
సహనంగా ఉంటే చాతగాదని కాదుమౌనంగా ఉంటే మతాలు రావని కాదుఓపిక పట్టామంటే ఎదురు తిరగలేరని కాదుభరిస్తున్నామంటే పోరాడలేరని కాదు! నీ పరువెందుకు తీయటమని కావచ్చునీ మీద మిగిలిన ప్రేమ నమ్మకం కావచ్చునీలాగా దిగజారి మాట్లాడలేక కావచ్చునీలాగా అవినీతి వెంట నడవలేక కావచ్చు! అంతేకానీనువ్వేం చేసిన చెల్లుతుందని కాదునువ్వేం మాట్లాడినా నెగ్గుతుందని కాదుఅన్యాయం ఎల్లవేళలా కాపుకాస్తుందని కాదుకాలం కొండలా అడ్డు నిలబడిందని కాదు పదే పదే అవమానిస్తే వెనక్కి తోసేస్తేకావాలని గొప్పదనాన్ని తగ్గించి చులకన చేస్తేవర్ణం రూపం కులం ప్రాంతం జెండరంటూవివక్ష చూపి అణగ తొక్కేయాలని చూస్తే బలహీనులని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తేఅసహాయులని అబలలని మీది మీది కొస్తే చేతికి గాజులు తోడుక్కున్నారని ఎత్తిపొడిస్తేఏమి చేస్తారులే అని అనవసరంగా రెచ్చిపోతేచూస్తూ ఉరుకునేదే లేదు! సయ్యంటూ రణరంగంలోకి దూకేయ్యడమేదారిలోని ముల్లులా తీసి పక్కన పారేయ్యడమేఅబద్దపు నీలి రాతల్ని తుడిచి పారేయ్యడమేశిశుపాలుడి వంద తప్పుల్ని లెక్కపెట్టడమే! అసత్యానికి దిక్కులేని చావు తప్పదుఅక్రమానికి అంతులేని శిక్షలు తప్పదునిజానికి ఎప్పటికైనా విజయం తప్పదుధర్మానికి యుద్ధం తర్వాతైనా గెలుపు తప్పదు!*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.
