
దిగులు కళ్ళు
-బండి అనూరాధ
దిగులు కళ్ళు చుక్కలని పోల్చుకోలేవు.చీకటి ఇల్లు వెన్నెలని చదువలేదు. పనికిమాలిన తత్వాలకిపేర్లు పెట్టుకుంటూఇంకా నువ్వు వెళ్ళిన వైపే చూస్తూ అక్షరాలతో, అనేకానేక చింతలతోకాలయాపన చేస్తున్నా. మిగులుగా జీవిస్తూ పోతానుకానీఅప్రమేయతలోనూ సత్యమొకటి ఉంటుంది. అడుగు అడుగుకీ నిబద్ధత చప్పుడుని చేస్తుంది. ఇక,.. ఏ తెల్లారగట్టో కోడి కూస్తుంది.మసకవెలుతురికి చూపు జారుతుంది. అప్పుడు,.. కలల జాడ ఒక ప్రశ్నై పొడుస్తుంది.కళ్ళ ఎరుపు ఒక జవాబై మిగులుతుంది.
*****
Please follow and like us:

పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. కథలంటే ఆసక్తి. రాస్తుంటాను.
