
అమ్మా! ఎత్తుకోవే
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-ఎం.వి.చంద్రశేఖరరావు
బెంగుళూరు.హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ.ఉదయం ఏడు గంటలు. “అమ్మా,ఎత్తుకోవే, నేను స్కూలు కెళ్ళనే”మారం చేస్తున్నాడు, ఐదేళ్ళ కల్యాణ్. “అలా అంటే ఎలా, స్కూలుకెళ్ళి, బాగా చదువుకుంటే, మంచి ఉద్యోగం వస్తుంది, బోల్ఢెన్ని చాక్ లెట్లు, బిస్కెట్లు కొనుక్కోవచ్చు”ఆశ చూపించింది,ఆద్య. కొడుకుని మెయిన్ గేట్ బస్ షెల్టర్ దగ్గరకు తీసుకెడుతూ. “ఐతే,నన్నెత్తుకు తీసుకువెళ్ళు”అన్నాడు, కల్యాణ్. “ఒరేయ్, నీ అల్లరి రోజురోజుకు పెరిగిపోతోంది, ఈ చేత్తో, నేను, నిన్ను ఎత్తుకోవడంసాధ్యమయ్యే పనేనా” అంది, తన మొండిచెయ్యి చూపిస్తూ. “ఐతే, నేను స్కూలుకు వెళ్ళను”మారాం చేస్తూ, అన్నాడు, కల్యాణ్. దూరంగా, వాకింగ్ చేస్తున్న అనురాగ్ , ఇదంతా గమనిస్తూ, ఆమె అవస్థకు జాలి పడుతూ, దగ్గరకు వచ్చి “పోనీ, నేను ఎత్తుకోనా” అని అడిగాడు, కల్యాణ్ ని, నవ్వుతూ. “నో,మా అమ్మే ఎత్తుకోవాలీ” అన్నాడు, కల్యాణ్. “వాళ్ళ నాన్నను, తీసుకురావల్సింది” అన్నాడు, ఆద్యతో. అనురాగ్ వంక చూస్తూ…”ఆయన మరణించారు” అంది, ఆద్య. “ఓ, ఐ యామ్ సారీ, నా పేరు అనురాగ్, కొత్తగా వచ్చాం, ఇక్కడకు” అన్నాడు, అనురాగ్. ఈ లోపల, అనురాగ్ భార్య అర్చన, వాళ్ళ దగ్గరకు వచ్చి ‘వెళ్దామా, అనురాగ్” అంది. అర్చనాను, ఆద్యకు చూపిస్తూ “నా శ్రీమతి అర్చన” అన్నాడు, అనురాగ్.. అర్చన, ఆద్య వంక చూస్తూ, “నమస్తే అండి”అంది, ప్రతి నమస్కారం చేస్తూ “చూడముచ్చని జంట మీరు” అంది, ఆద్య. “పద, స్కూలు బస్ వచ్చే టైమయ్యింది”అని తొందరచేసింది, కల్యాణ్ ను, ఆద్య. వాడు “ఎత్తుకోవే అమ్మా, లేకపోతే నేను స్కూలుకెళ్ళను” అని భీష్మించాడు. వాడిని చూసి నవ్వుతూ,ఎత్తుకుంటూ “పిల్లలులేని కొరత ఈ రకంగా తీరింది” అంది, గేట్ వేపు నడుస్తూ, అర్చన. “అయ్యో, మీకెందుకు శ్రమ” అంది, ఆద్య నొచ్చుకుంటూ. “పర్వాలేదు, ఇందులో శ్రమేముంది, నా కోరిక తీరింది” అంది, అర్చన. *** కల్యాణ్ ను, స్కూలు బస్ ఎక్కించి, తిరిగి వస్తూ “ఊ, చెప్పండీ, మీ చెయ్యికేమయ్యింది” అని అడిగారు, అనురాగ్, అర్చనాలు. “నేను, నా భర్త అఖిల్ ఇద్దరం ఆర్మీ ఆఫీసర్లం. ఇద్దరం ప్రేమించి, పెళ్ళి చేసు కున్నాం ఒకరోజు LOC దగ్గర డ్యూటి చేస్తుండగా, చైనా కవ్వింపు దాడులు మొదలు పెట్టింది. పెట్రోలింగ్ చేస్తున్న, మా హెలీకాఫ్టర్ పై, మిసైళ్ళతో దాడిచేసింది. అప్పుడ ప్పుడు, ఇలా సరిహద్దులలో కవ్వింపు చర్యలు జరుగుతుంటాయి. ఆ మిసైళ్ళదాడికి, మా హెలీకాఫ్టర్ నేలకూలింది. నా భర్త , అఖిల్ అక్కడికక్కడే మరణించాడు. నా చేయ్యిమోచేతి వరకు తీసేసారు” అంది,ఆద్య. “అయ్యో,అలానా,మీరు, మీ భర్తలాంటి, వీరయోధుల త్యాగాల వల్లనే, మేమందరం, ఇలా సుఖంగా ఉన్నాము, ఈ యుధ్ధం కాని యుధ్ధం, కవ్వింపు చర్యలు, సరిహద్దు దేశాలు ఎందుకు చేస్తాయో, అర్ధంకాదు, ప్రతీ ఏటా అనేక మంది వీరజవాన్లు, ఈ కవ్వింపు చర్యలలో మరణిస్తున్నారు, పాపం, వారి కుటుంబాలు, రోజూ చాలా కష్టాలు పడుతున్నాయి” అని అన్నాడు, అనురాగ్. “ఇందులో త్యాగమేమీ లేదు, అది మా ఉద్యోగధర్మం, అంతే, ఆర్మీ ఉద్యోగంలో చేరినప్పుడే దేశం కోసం, మా ప్రాణాలు పణంగా పెట్టాం” అంది, ఆద్య. “మీ భార్యాభర్తలిద్దరూ ఆర్మీ ఆఫీసర్లవడం, ఈ అపార్ట్ మెంట్లోనే ఉండటం, మా కెంతో గర్వకారణం” అంది, అర్చన. “ఖాళీగా ఉన్నప్పుడు మా ఇంటికి రండీ” అని ఆద్యను ఆహ్వానించి, తమ ఫ్లాట్ నెంబరు చెప్పింది, అర్చన. *** ఇంటికి వచ్చినా, అనురాగ్ కళ్ళ ముందు ఆద్య, కల్యాణ్ లు, కనపడసాగారు, అనురాగ్ కు. దేశం కోసం ప్రాణాలొడ్డిన ఆ కుటుంబం అలా అవస్థపడటమేమిటీ?అన్పించింది. “
*****


అమ్మా ! ఎత్తుకోవే అనే కథ బాగుంది. సైన్యం లో పని చేసే వీరులు చనిపోతే వారి కుటుంబాలు ఎలా అవస్థ పడతాయో బాగా చెప్పారు.ఒకే ఫ్లాట్స్ లో వుండే వారు పరస్పరం సహాయం చేసుకోవాలనే సందేశం బాగుంది. ఓ సందేహం. సాధారణం గా అంగ వైకల్యం పొందిన వారికి ఆర్మీ లో కృత్రిమ అవయవాలు మొదలైనవి, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఆర్మీ నే భరిస్తుంది అనుకుంటాను. వాళ్ళకు ఎన్నో వసతులు కల్పించారు. అలాగే వాళ్ళకు ఇంటి వసతి, క్వార్టర్ వసతి కూడా వుంటుంది. అందులోనూ కథా నాయిక కూడా సైన్యం లో పని చేసే వ్యక్తి కదా! ఎప్పుడైనా క్వార్టర్స్ చాలక పోతే ఇతర ప్రదేశాల్లో వుంటారు.నేను ఇంకా వివరాలు తెలుసుకోలేదు. కానీ రచయితలు తెలుసుకోవాలి. కథ చాలా త్వరగా అయిపోయిందని అనిపించింది. మరికొంత వుంటే బాగుండేది. కథ బాగుంది.
కథలో మంచి సందేశం ఉంది. కథనం ఇంకా బాగా మనసుకు హత్తుకునేలా చెప్పే ప్రయత్నం చేస్తే కథ మరింత బాగుండేది. అభినందనలు
మంచి సందేశాత్మక కథ.
ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి.
అందులోనూ దేశసేవ చేసే మిలటరీ లో ఉన్న వాళ్ళకి సహాయము చెయ్యడం అదృష్టం.
కథ చాలా బాగుంది.
చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చిన కథ రచయత గారు. ఆర్మీ ఆఫీసర్ ఆద్య మన రాష్ట్రానికి చేసిన సేవనీ గుర్తిస్తూ ఆ తల్లి కోడిక్కి ఆర్చన,అనురాగుల చేసిన సాయం కూడా తక్కువ ఏమీ కాదు .పొరుగు ఇల్ల వారు నిజ జీవితం లో కూడా అలా ఉండ గలిగితే ఇంకా ఏం కావాలి?
పక్కన ఇంటి వారెవరు అన్నది తెలుసుకోని ఈ రోజుల్లో అందరూ ఒకేలా ఉండరు అని చెప్పడమే కాకుండా ఒక సందేశం ఇచ్చారు. బాగుంది చాలా
చంద్రునిలో చిన్న మచ్చ సహజమేకదా…సందేశం నచ్చిందికదా…
కధ లో మంచి సెన్సిబిలిటీ ని చూపించారు రచయితా గారు. ధన్యవాదాలు!
కథలో ఏదో సందేశాన్ని చెప్పాలనే తపన కనిపించింది. కానీ ఎక్కడో, ఏదో వెలితి కనపడుతున్నది కథనంలో. పక్కవారు ఎలా పోతే నాకేమిటి అన్న ధోరణి నుంచి, సాటివారికి సాయం చేయాలనే సందేశంతో కథ చక్కని ముగింపును ఇచ్చింది. రచయితకు అభినందనలు
సాహిత్యం లక్ష్యం విశ్వశ్రేయస్సే…
అందుకనే అలా…