త్యాగాల నిలయం ( కవిత)

-సుధీర్ కుమార్ తేళ్ళపురి

ప్రపంచాన్నంతా నిద్రలేపేసూర్యుడికి కూడాతెల్లారిందని చెప్పేదికల్లాపిచల్లే నీ గాజుల చేతులే కదా – నువ్వు లేనిదే నిముషమైనా గడవదని తెలిసికూడాలేని అహాన్ని ప్రదర్శించినప్పుడునీ మౌనంతోనే అందరి హృదయాలనుజయిస్తావు – నిషిద్దాక్షరి, దత్తపది, అప్రస్తుత ప్రసంగాల వంటి వాటితో చేసేఅవధానాలకే గజమాలలుగండపెండేరాలు తొడిగితేఅత్తమామలు , ఆడపడుచులుకన్నవాళ్ళు, కట్టుకున్నవాడు,విరామం లేకుండా వచ్చిపోయేసమస్త బంధుగణంతోఅనునిత్యం నువ్వు చేసే అవధానానికిఎన్ని గజమాలలు వేయాలోఇంకెన్ని గండపెండేరాలు తొడగాలో – కాలాన్ని నడిపించే ఋతువులు ఆరేఅనుకుంటాం కానీమానవజాతి మనుగడ కోసంకనపడకుండా నీలో దాచుకున్నఏడో రుతువే లేకపోతేఏ ఒక్కడైనా పురుడు పోసుకొనిఈ పుడమి పై పడేవాడా – దిగంతాలవైపుకు పరుగులు తీస్తూవిజయకేతనాన్ని ఎగరేశానని విర్రవీగేప్రతి మగాడి విజయం వెనకగాయాల దేహంతో త్యాగాల నిలయమై ఉన్నదినిస్సందేహంగా నువ్వేనని తెలిసినాఏమీ ఎరుగనట్టుఒకచిన్న చిరునవ్వు నవ్వుతూవినమ్రంగా వెనకాలే ఉండిపోతావుఅలుపెరుగక నడుస్తూనే ఉంటావుసమస్త మానవాళిని ముందుకు నడిపిస్తూనే ఉంటావు..!

*****

Please follow and like us:

One thought on “త్యాగాల నిలయం ( కవిత)”

  1. త్యాగాల నిలయం కవితలో అన్యాపదేశంగా స్త్రీ ఔన్నత్యాన్ని చెప్పిన తీరు బాగుంది!
    కవికి అభినందనలు. 💐👍😊

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.