
బతుకమ్మ పద్యాలు
-సముద్రాల శ్రీదేవి
సృష్టిలోన పూలు స్త్రీ జాతిరూపము
ప్రకృతి మాతగాను బ్రతుకునిచ్చు
తల్లిగ బ్రతుకమ్మ తా తెలంగాణలో
దివ్యమైన బాట దేవిమాట
తీరుతీరు పూలు గౌరమ్మగను నవ
రాత్రులందు మారి చిత్రముగను
నీకు సాటిలేరు నేడు మా బ్రతుకమ్మ
దివ్యమైన బాట దేవిమాట
సంబురాలు జేస్తునంబరమ్ముగ మార్చి
నారిగణము నాడు దీరులైరి
న్యాయస్థాపనంబు నవ్విడె బ్రతుకమ్మ
దివ్యమైన బాట దేవిమాట
ఊరువాడయాటలుయ్యాల పాటలు
నూరెగుబ్రతుకమ్మలుత్సవముగ
వనములోన మనము జనజాతర గణము
దివ్యమైన బాట దేవిమాట
కల్పవల్లి సకల కళల తెలంగాణ
పుడమిపైన నేడు పూలలొల్లి
యాడుకొనును ఘనముగతివలు సతతము
దివ్యమైన బాట దేవిమాట
*****

పేరు, సముద్రాల శ్రీదేవి, వృత్తి, ప్రభుత్వ ఉపాధ్యాయిని, స్కూల్ ఆసిస్టెంట్ తెలుగు, నివాస స్థలం,హైద్రాబాద్, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు, ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్ రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ అవార్డ్, కవిత్వము,సంగీతము,నృత్యము లో ప్రతిభా పురస్కారములు. నా యొక్క కవితా సంపుటి అర్ణవ వర్ణమునకు, ప్రతిష్టాత్మక మైన గిడుగు రామ మూర్తి పంతులు పురస్కారం, మెతుకుసీమవిశిష్ట సాహితీ పురస్కారం,గురు బ్రహ్మ,పురస్కారం. అలిశెట్టి ప్రభాకర్, సి.నారాయణ రెడ్డి, గురజాడ అప్పారావు పురస్కారాలు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ , పలు విధములైన పురస్కారములు వివిధ పత్రికలలో ప్రచురణలు, ,watsup సమూహంపేరు సాహితీ విజయం. బిరుదములు,; కవిచక్ర, సహస్ర కవిమిత్ర, గాన కోకిల, మొ,,
